english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ గురువు (బోధకుడు) ఎవరు - I
అనుదిన మన్నా

మీ గురువు (బోధకుడు) ఎవరు - I

Wednesday, 29th of January 2025
0 0 258
Categories : గురువు (బోధకుడు) (Mentor)
అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ, “క్రీస్తు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. (1 కొరింథీయులు 4:15-16 ESV)

కొంతమంది గొప్ప బైబిలు వీరుల విజయ రహస్యాలలో ఒకటి సలహాదారులను (బోధకుడు) కలిగి ఉండడం. మీరు అనుకరించే మరియు నేర్చుకునే ఉపదేశకుడు మీకు ఉన్నారా? లేకపోతే, కొరింథీయులకు పౌలు చేసినట్లే, మీ కోసం ఈ పాత్రను పూరించడానికి ప్రార్థనాపూర్వకంగా ఒక వ్యక్తిని వెతకండి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, ఇది మీరు విస్మరించలేని ఒక సిధ్ధాంతం.

బైబిల్లోని ఉపదేశకుల యొక్క కొన్ని ఉదాహరణలను చూద్దాం.
ఉదాహరణ #1
యెహోషువ ఎల్లప్పుడూ అక్కడే ఉండేవాడు, దేవుని దాసుడైన మోషే చుట్టూ తిరుగుతూ ఉండేవాడు.

మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను య్యవనస్థుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. (నిర్గమకాండము 33:11)

ఇది చాలా క్లుప్తమైన మరియు సూక్ష్మమైన కానీ ముఖ్యమైన ప్రస్తావన, ప్రభువు మోషేతో మాట్లాడేటప్పుడు యెహోవా ఉన్నాడు, కానీ అంతకంటే ముఖ్యమైనది, మోషే వెళ్ళినప్పుడు కూడా యెహోవా గుడారం నుండి బయటికి కదలలేదు. అతడు మోషే ప్రార్థన జీవితం నుండి దేవునితో సాన్నిహిత్యాన్ని నేర్చుకున్నాడు. మోషే దేవుని కలుసుకోవడానికి కొండపైకి వెళ్ళినప్పుడు, యెహోషువ అతనిని అనుసరించాడు. (నిర్గమకాండము 24:13)

ఈ వ్యక్తి యెహోషువ ప్రవక్త మోషే జీవితాన్ని, దేవునితో అతని సంబంధాన్ని మరియు అతని జీవితాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించాడు. తర్వాత, ఒకరోజు, ఈ వ్యక్తి ఇశ్రాయేలీయులను వాగ్దానం చేయబడిన కనాను దేశానికి తీసుకెళ్లాడు.

ఉదాహరణ #2
ఎలీషా ఒక రైతు. ఏలీయా ఎలీషాను మొదటిసారి కలిసినప్పుడు, అతడు పన్నెండు కాడితో దున్నుతున్నాడు. (1 రాజులు 19:19) అతని తండ్రి ధనవంతుడు. ఒకరోజు ఏలీయా వచ్చి ఎలీషాపై తన కవచాన్ని వేసాడు, ఆ రోజు నుండి ఎలీషా నమ్మకంగా ఏలీయాను అనుసరించాడు. ఆ రోజుల్లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఎలీషా అనే ఈ వ్యక్తి తన ఉపదేశకుని వెంబడించాడు. ఈరోజు ఇలా చేయడం చాలా తక్కువ మందిని చూస్తున్నాను.

నేడు, చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేయడానికి మాత్రమే దేవుని దాసుడు లేదా దాసికి దగ్గరవ్వాలని కోరుకుంటారు. దేవుని దాసుని నుండి నేర్చుకునేందుకు వారికి అస్సలు ఆసక్తి ఉండదు. దేవుని దాసుడు మోస్తున్న అభిషేకం గురించి వారు నిజంగా పట్టించుకోరు. వారు తమ ప్రార్థన విన్నపములకు సమాధానమివ్వడానికి మాత్రమే అభిషేకాన్ని ఉపయోగించాలనుకుంటున్నారు.

యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీ షాయు కూడి గిల్గాలు నుండి వెళ్లుచుండగా  2ఏలీయా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.

4పిమ్మట ఏలీయా, "ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి."

6అంతట ఏలీయా, "యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడుయెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి." (2 రాజులు 2:2-6)

పేర్కొన్న నాలుగు స్థలాలో ప్రతి ఒక్కటి (గిల్గాలు, బేతేలు, యెరికో మరియు యొర్దాను) ఇశ్రాయేలు చరిత్రలో చాలా ముఖ్యమైనవి, మరియు అవి క్రైస్తవ జీవిత ప్రయాణంలో దశలకు అత్యంత ప్రతీక అని నేను నమ్ముతున్నాను. గిల్గాలు అనేది దేహముతో వ్యవహరించే స్థలం. (యెహోషువ 4:19-24). బేతేలు మన లోకము మీద విజయం పొందడం గురించి మాట్లాడుతుంది ఎందుకంటే లేఖనములో ఐగుప్తు లోకాన్ని సూచిస్తుంది. యెరికో ఆధ్యాత్మిక యుద్ధ స్థలము. చాలా మంది క్రైస్తవులు ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఇష్టపడరు, ఎందుకంటే అది అధికారముతో అడుగుతుంది, కాబట్టి వారు సులభమైన మార్గాన్ని తీసుకుంటారు. వారు తమ కోసం ప్రార్థించమని దేవుని దాసుని అడుగుతారు.

ఏలీయా చుట్టూ ఉండటం సవాలుగా ఉండే వ్యక్తి, కానీ అప్పుడు కూడా, ఎలీషా ఏలీయాకు సేవ చేశాడు. ఎలీషా ఏలీయాకు చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ, పేర్ల కోసం వెతకలేదు కానీ సేవకుడి పాత్రను పోషించాడు మరియు ఏలీయా చేతుల మీద నీరు పోసిన వ్యక్తిగా పేరు పొందాడు. (2 రాజులు 3:11)

మీరు నిజాయితీగా సమాధానం ఇవ్వాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి:
1. మీరు ఎవరి నుండి నేర్చుకుంటున్నారు?
2. మీరు ఎవరిని వెంబడిస్తున్నారు?
3. మీ గురువు ఎవరు?

Bible Reading: Exodus 30-32
ప్రార్థన
తండ్రీ, నా జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతను చూడటానికి నా కళ్ళు తెరువు. యేసు నామములో. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● వెతికే మరియు కనుగొనే యొక్క కథ
● రాజుల యెదుట నిలబడేలా చేసిన దావీదు గుణాలు
● మరొక అహాబు కావద్దు
● ప్రార్ధనలేనితనం (చేయకపోవడం) వలన దేవదూతల కార్యాలకు ఆటంకం కలిగిస్తుంది
● 20 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలి - 2
● శ్రేష్ఠత్వమును ఎలా కొనసాగించాలి?
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్