english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. కృపలో అభివృద్ధి చెందడం
అనుదిన మన్నా

కృపలో అభివృద్ధి చెందడం

Wednesday, 5th of June 2024
1 0 706
Categories : కృప (Grace)
మన ప్రభువును రక్షకుడునైనయేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడునుయుగాంతదినమువరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌. (2పేతురు3:18)

కృప  అనే భావనను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పాపం నుండి క్షమాపణ మరియు నిర్లక్ష్య జీవనశైలిని కొనసాగించడానికి ఇది ఒక అవసరం అని వారు నమ్ముతారు. కృప పాపాన్ని సమర్థించడానికి ఒక అవసరం లేదు. రోమీయులకు6:1 లో బైబిలు చెబుతోంది "ఆలాగైనఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా?"

కృపను అందించడానికి దేవుని ఉద్దేశ్యం ఏమిటంటే, మనుష్యులందరూ రక్షణకి వచ్చి నీతి బద్ధంగా జీవించడం. పాపంలో కొనసాగడం మరియు పవిత్రీకరణ కోసం ఆయన పిలుపును విస్మరించడం ద్వారా మనము ఆయన కృపను నిరాశపర్చడానికి ఆయన అనుమతించడు. 

ప్రియమైనవారులారా, ఆయన కృపతో మీరు విశ్వాస జీవితంలోకి పిలువబడ్డారు, మరియు మీరు దానిలో అభివృధిచెందాలని భావిస్తున్నాము. దేవుని నుండి వచ్చిన ఏవైనాప్రత్యక్షత మాదిరిగానే, దేవుని అద్భుతమైన కృపను తప్పుగా అర్థం చేసుకుని, దుర్వినియోగం చేసే అల్పవయస్కు వారిలాగా ఎల్లప్పుడూ ఉంటుంది.

కృపలో  అభివృధి చెందడం అంటే మీ ఆధ్యాత్మిక జీవితం గురించి అన్ని బాధ్యతలను దేవునిపై వదిలివేయడం కాదు, ఎందుకంటే కృప వారు సోమరితనం కావడానికి అనుమతించాలని చాలామంది అనుకోవచ్చు. లేదు! 

కృపలో  అభివృధి చెందడం అంటే దేవుని జ్ఞానం మరియు ఆయన వాక్యంలో అభివృధి చెందడం. ఇది నీతిమంతులుగా, పవిత్రీకరణ మరియు పవిత్రతలో అభివృధి చెందడం. మనుష్యులందరూ కృపలో ఎదగాలని, ఆయనలాగే పవిత్రంగా ఉండాలని, క్రైస్తవులుగా పరిపక్వం చెందాలని, పవిత్రంగా ఉండాలని, సత్యంలో, ప్రేమలో ఆయనతో పాటు వేరు చేయాబడాలని దేవుడు కోరుకుంటాడు. ప్రార్థన మరియు వాక్యం యొక్క పరిచర్యకు మనల్ని మనం సమర్పించుకోవడం. (అపొస్తలుల కార్యములు 6:4)

కృపలో ఎదగడం అంటే దేవుడు మనకు ఇచ్చిన కృపలో అభివృధి చెందడం కాదు. దానికి బదులుగా, ఇది క్రీస్తు మనకోసంఏమి చేశాడో అర్థం చేసుకోవడం మరియు మన జీవితంలోని వాక్యం మరియు దాని పనితీరును మనకు ఇవ్వడం ద్వారా ఈ సత్యంలో అభివృధి చెందడం. దేవుని బిడ్డగా, మీరు పొందిన ఈ కృపను మీరు అర్థం చేసుకోవాలని భావిస్తున్నాము. ఇది దేవుని సంపూర్ణతలో ప్రవేశించడానికి మరియు విశ్వాసిగా నిలబెట్టడానికి ఒక క్లిష్టమైన వరము. కృప క్రైస్తవుల అప్రయత్నంగా వృద్ధిని సాధిస్తుంది!

మనము దేవునితో మన నడకలో కఠినమైన కార్యంగా గుర్తించినప్పటికీ, పరిశుద్ధాత్మతో మరింత సన్నిహితంగా మారినప్పటికీ, మనం యేసులాగే, ఆయన స్వరూపంగా రూపాంతరం చెందడం మరియు మన పూర్వ స్వభావాలలో తక్కువగా మారడం వంటి కృపలో అభివృధి చెందుతాము. మీరు విధేయులుగా ఉండటానికి కష్టపడుతున్నారా? రహస్య పాపాలతో పోరాడుతున్నారా? ప్రార్థన మరియు వాక్యం కోసం కోరిక మరియు  ఆకలి లేదా?

దేవుని కృపలో లభించిన ఈ నిబంధనను మీరు గుర్తించాలి. నిజం ఏమిటంటే, మీరు కృపలో  అభివృధి చెందకుండా రక్షణ యొక్క నడవడికలో నడవలేరు. మంచి శుభవార్త! దేవుడు తన అనంతమైన జ్ఞానంలో ఈ కృపలో పాలుపంచుకోవాలనుకునేవారి అందరికి అందుబాటులో ఉంచాడు. మన నీతి యొక్క నడక మన బలం కాదు, అది ఆయన దయ ద్వారా. దీన్ని అర్థం చేసుకోవడం వల్ల మీ అవసరం మరియు అభివృధి కోసం మీరు ఆయనపై ఆధారపడతారు.

దేవుని కృపలో అభివృధి చెందడం ఆయనతో మన సంబంధంలో ధృడంగా ఉండటానికి ఏకైక మార్గం. ఈ రోజు వాక్యం యొక్క విద్యార్థిగా మరియు ప్రార్థన యొక్క ప్రేమికుడిగా ఉండటానికి చేతన నిర్ణయం తీసుకోవడం ద్వారా కృపలో ఎదగడానికి ఎంచుకోండి. ప్రభువు యొక్క కృప మీరు దాని కోసం మరింత చేరుకున్నంత అందుబాటులో ఉంది. షాలొమ్!
ప్రార్థన
తండ్రీ, మీ కృపకు ధన్యవాదాలు. నేను ఈ కృపను కృతజ్ఞతతో స్వీకరించాను. నా స్వంత శక్తి నాకు లేదని నేను అంగీకరిస్తున్నాను. ఓ దేవా, మీ కృప నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● దేవుని 7 ఆత్మలు: జ్ఞానం గల ఆత్మ
● సరైన బంధాలను ఎలా నిర్మించుకోవాలి
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనం అవుతారు - 4
● దుష్ట ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం
● వుని కొరకు మరియు దేవునితో
● వాక్యం ద్వారా వెలుగు వస్తుంది
● క్రీస్తు రాయబారి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్