అనుదిన మన్నా
1
0
55
అత్యంత ఫలవంతమైన వ్యక్తుల 9 అలవాట్లు1
Saturday, 10th of January 2026
Categories :
9 Habits of Highly Effective People
సంవత్సరాలుగా, ఉన్నత పదవులు నిర్వహిస్తున్న అనేక మంది వ్యాపారవేత్తలు, వ్యాపార మహిళలు మరియు కార్పొరేట్ నాయకులతో సంభాషించే అవకాశం నాకు లభించింది. వారు ఎలా ఎదగడం, రాణించడం వారి ప్రభావాన్ని అసాధారణ రీతిలో విస్తరించడం నేను గమనించాను.
నేను వారి జీవితాలను నిశితంగా గమనించినప్పుడు, వారిని నిజంగా వేరు చేసేది ప్రతిభ, విద్య లేదా అవకాశం మాత్రమే కాదు - కాలక్రమేణా వారు పెంపొందించుకున్న కొన్ని అలవాట్లు అని నేను గమనించాను. ఈ అలవాట్లు వారి ఆలోచనను రూపొందించాయి, వారి అనుదిన నిర్ణయాలను నడిపించాయి వారి ప్రభావాన్ని కొనసాగించాయి.
రాబోయే కొన్ని రోజుల్లో, నా పరిశోధనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఈ అలవాట్లను అభివృద్ధి చేసుకుంటే, మీరు కూడా మీరు చేసే ప్రతి పనిలో చాలా ఫలవంతమైనవారు మరియు ప్రభావవంతమైనవారు అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. చివరికి, అదే నిజంగా తండ్రికి మహిమ తెస్తుంది.
"కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును." (మత్తయి 6:33)
బైబిలు దృక్కోణం నుండి అత్యంత ఫలవంతమైన వ్యక్తులు ఉత్పాదకతతో ప్రారంభించరు - వారు ప్రాధాన్యతతో ప్రారంభిస్తారు. వ్యూహాలు రూపొందించే ముందు, ప్రణాళికలు అమలు చేసే ముందు, నిర్ణయాలు సమర్థించుకునే ముందు, వారు ఒక ప్రాథమిక ప్రశ్నను పరిష్కరిస్తారు: మొదటి ప్రధాన్యత ఏది?
బైబిలు స్థిరంగా చూపుతున్నది ఏమిటంటే, ప్రభావం యాదృచ్చికం కాదు; అది దేవుని ముందు సరైన విధంగా జీవించిన జీవిత ఫలితం.
1. ప్రాధాన్యత అధికారాన్ని నిర్ణయిస్తుంది
ఆదికాండములో, లేఖనం మొదటి పదాలు, “ఆదియందు, దేవుడు...” (ఆదికాండము 1:1) ప్రకటిస్తున్నాయి. ఇది ఒక దైవ సిధ్ధాంతం. దేవుడు దేనిలో మొదటివాడో, ఆయన పరిపాలిస్తాడు. ఆయన దేనిని పరిపాలించినా, ఆయన ఆశీర్వదిస్తాడు.
దేవుడు మొదట కానప్పుడు, మంచి విషయాలు కూడా చెడిపోతాయి. కానీ ఆయన మొదటిగా ఉన్నప్పుడు, కష్టతరమైన సమయాలు కూడా ఫలాలను ఇస్తాయి. ప్రభువైన యేసు, ఇతర విషయాలతో పాటు దేవుని వెతకండి అని చెప్పలేదు—ఆయన, మొదటిగా వెతకండి అని చెప్పాడు. జీవితంలో ప్రభావం అంటే మన ప్రణాళికలకు దేవుని జోడించడం గురించి కాదు; అది మన ప్రణాళికలను దేవునికి సమర్పించడం గురించి.
దావీదు రాజు దీనిని లోతుగా అర్థం చేసుకున్నాడు. అతడు యోధుడు, రాజు, కవి, నాయకుడు అయినప్పటికీ, అతడు ఇలా ప్రకటించాడు:
యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని
దానిని నేను వెదకుచున్నాను.
యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను
యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను (కీర్తనలు 27:4).
దావీదు ప్రభావం ప్రతిదానిలోనూ దేవునికి మొదటి స్థానంలో ఇవ్వడంలో నుండి వచ్చింది.
2. మొదటి ప్రేమ శాశ్వత బలాన్ని ఇస్తుంది
“ఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది." (ప్రకటన 2:1-4)
గమనించండి—వేరే ఏదీ ఖండించబడలేదు. వారి పనులు కొనసాగాయి, వారి శ్రమ భరించబడింది, వారి సిద్ధాంతం దృఢంగా ఉంది—కానీ సాన్నిహిత్యం లేకుండా ప్రభావం ఖాళీగా మారింది.
అత్యంత ప్రభావవంతమైన విశ్వాసులు తమ మొదటి ప్రేమను కాపాడుకుంటారు. ప్రార్థన తొందరపాటుతో చేయబడదు. పరిశుద్ధ లేఖనాలను పైపైన చదవడానికి ఉద్దేశించినవిగా ఉండదు. ఆరాధన యాంత్రికమైనది ఉండదు. బేతనియ మరియలాగే, వారు యేసు పాదాల వద్ద కూర్చోవడం అనే మంచి భావాన్ని ఎంచుకుంటారు - సాన్నిహిత్యం ఎల్లప్పుడూ కార్యాలు కంటే ఎక్కువగా ఉంటుందని తెలుసుకుంటారు (లూకా 10:38–42).
ఈ అధ్యాత్మిక వైఖరి యొక్క ప్రతిఫలాన్ని ప్రవక్త యెషయా వెల్లడిస్తాడు:
యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలము పొందుదురు
వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు
అలయక పరుగెత్తుదురు
సొమ్మసిల్లక నడిచిపోవుదురు. (యెషయా 40:31).
ఇక్కడ వేచి ఉండటం అంటే నిష్క్రియాత్మకత స్థితి కాదు - అంటే దేవునిపై కేంద్రీకృతంగా ఆధారపడటం. బలం ప్రయత్నం ద్వారా కాదు, సరైన స్థానం ద్వారా పునరుద్ధరించబడుతుంది.
3. మొదటి అలవాటు ప్రతి ఇతర అలవాట్లను రూపొందిస్తుంది
పాత నిబంధనలో, దేవుడు ప్రథమ ఫలాలను కోరాడు - మిగిలిపోయిన వాటిని కాదు (సామెతలు 3:9). మొదటి భాగం మిగిలిన వాటిని విమోచించింది. ఈ సిధ్ధాంతం ఇప్పటికీ ఉంది. దినంలోని మొదటి గంట, హృదయపూర్వక ప్రేమ, సంకల్పం యొక్క మొదటి విధేయత దేవుని పట్ల ఉన్నప్పుడు, మిగతావన్నీ దైవ క్రమంలోకి వస్తాయి..
ప్రభువైన యేసు స్వయంగా ఈ అలవాటును తెలియ చేశాడు. "ఆయన పెందలకడనే లేచి ....అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయు చుండెను" (మార్కు 1:35). జనసమూహాలు, అద్భుతాలు, అడగటానికి ముందు - సహవాసం ఉంది.
అందుకే లేఖనంలో ప్రభావ భక్తి నుండి ఎప్పుడూ వేరు చేయబడదు. యెహోషువ విజయం వాక్య ధ్యానం నుండి ప్రవహించింది (యెహోషువ 1:8). యోసేపు ఉత్థానం దేవుని సన్నిధి నుండి ప్రవహించింది (ఆదికాండము 39:2). దానియేలు ప్రభావం స్థిరమైన ప్రార్థన జీవితం నుండి ప్రవహించింది. (దానియేలు 6:10).
4. బలిపీఠం వద్ద ప్రభావం ప్రారంభమవుతుంది
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.. (రోమా 12:1)
ఈ లేఖనం ప్రతి విశ్వాసులను తమను తాము సజీవ యాగాలుగా సమర్పించుకోవాలని స్పష్టంగా పిలుస్తుంది. బలి ఎల్లప్పుడూ మొదట బలిపీఠంపైకి వెళుతుంది. ప్రతిరోజూ నిర్దేశించబడిన జీవితం దేవునిచే పైకి ఎత్తబడిన జీవితంగా అవుతుంది.
అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు “ఏది పనిచేస్తుంది?” అని అడగరువారు, “దేవుని నిజంగా ఏది ఘనపరుస్తుంది?” అని అడుగుతారు
మరియు లేఖనం స్పష్టంగా సమాధానం ఇస్తుంది:
“యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము” (సామెతలు 9:10).
దేవుడు మొదటిగా ఉన్న చోట, జ్ఞానం ప్రవహిస్తుంది.
జ్ఞానం ప్రవహించే చోట, ప్రభావం వెంబడిస్తుంది.
ఇదే మొదటి అలవాటు - అది లేకుండా, మరే ఇతర అలవాటు నిజంగా నిలబడదు.
Bible Reading: Genesis 30-31
ప్రార్థన
తండ్రీ, నా జీవితాన్ని తిరిగి నీ క్రమంలోకి తీసుకువస్తున్నాను. ప్రతి తప్పుడు ప్రాధాన్యతను పెకిలించి వేయుము. నా జీవితంలో మళ్ళీ నీవే మొదటి స్థానంగా ఉండు, నా విధేయతను బలపరచుము, నీ రాజ్యము కొరకు, నీ మహిమ కొరకు నా జీవితాన్ని ఉపయోగించుకో. యేసు నామంలో. ఆమేన్!
Join our WhatsApp Channel
Most Read
● ఆందోళనను అధిగమించుట, ఈ విషయాలపై ఆలోచించుట● దేవుని కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండడం
● దేవుని నోటి మాటగా మారడం
● వాక్యాన్ని పొందుకొవడం
● ఐదు సమూహాల ప్రజలను యేసు అనుదినము కలుసుకున్నారు #3
● నేటి కాలంలో ఇలా చేయండి
● మర్యాద మరియు విలువ
కమెంట్లు
