english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. పందెంలో గెలవడానికి రెండు పి(P)లు
అనుదిన మన్నా

పందెంలో గెలవడానికి రెండు పి(P)లు

Monday, 2nd of March 2026
0 0 50
Categories : ఆధ్యాత్మిక పందెం (Spiritual Race)
మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీయులకు 12:1)

జీవితం యొక్క పందెము 100 మీటర్ల అడ్డగీత కాదు; అది ఒక మారథాన్ (దీర్ఘ కాలిక పరుగు). మరియు ఒక మారథాన్ పరుగెత్తడానికి, మీకు ఓర్పు అవసరం. ఓర్పు అనేది సహనం మరియు పట్టుదల యొక్క కలయిక.

మీ కోసం విషయాలు సరిగ్గా పని చేయని సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో, మనం దేవుని వాగ్దానాలపై ఓపికగా నమ్మకంగా ఉండాలి, మనం చేయవలసిన పనిని చేయడంలో పట్టుదలతో ఉండాలి మరియు వెనకడుగు వేయకూడదు.

అందుకే ఆత్మహత్య అనేది దేవుని బిడ్డకు ఎంపిక కాదు; నిరాశ అనేది దేవుని బిడ్డకు ఒక ఎంపిక కాదు. అడ్డంకులు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి మరియు మోసాలు ఉంటాయి. కానీ మీ ముందు ఒక పందెం ఉంచబడి ఉంది; ఓర్పు మరియు పట్టుదలతో పరుగెత్తండి.

హిజ్కియా రాజు నీతిమంతుడైన రాజు, అతడు ప్రభువును హృదయపూర్వకంగా వెంబడించడానికి కట్టుబడి ఉన్నాడు. అతడు ఇశ్రాయేలు, యూదా, ఎఫ్రాయిము మరియు మనష్షే అంతటా ఉత్తరాలు పంపాడు, ప్రతి సంవత్సరం జరిగే పస్కా పండుగ కోసం యెరూషలేము ప్రభువు మందిరానికి రావాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించాడు.
ఆ లేఖలో "ఓ ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి" అనే సందేశం ఉంది. (2 దినవృత్తాంతములు 30:6)
అంచెవాండ్రు జెబూలూను దేశము వరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలో నున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహసించిరి. (2 దినవృత్తాంతములు 30:10)

అప్పుడు అపహాస్యం చేసేవారు ఉన్నారు, ఇప్పుడు అపహాస్యం చేసేవారు ఉన్నారు. అపహాస్యం చేసేవారు ప్రతి యుగంలోనూ ఉంటారు. ఓడను సిద్ధం చేసేట్టప్పుడు నోవహును అపహసించారు. మన ప్రభువైన యేసయ్యను అపహాస్యించిరి.

అంచెవాండ్రు అపహాస్యించబడ్డారు. కానీ మంచి విషయం ఏమిటంటే వారు అపహాస్యం చేసినప్పటికీ పరిగెడుతూనే ఉన్నారు. అపహాస్యం చేసేవారు అపహాస్యిస్తూనే ఉంటారు, మీరు పరిగెత్తుతూనే ఉండండి. దేవుడు నిన్ను పిలిచిన పనిని ఆపవద్దు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండు.

బైబిలు గలతీయులకు 6:7లో, "మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు" అని చెప్తుంది.

దేవుడు మనలను చేయమని పిలిచిన దానిని మనం చేస్తూనే ఉన్నప్పుడు, యెహోవా ఎంచుకున్న ప్రజలు ఖచ్చితంగా యెహోవా వైపు తిరుగుతారు. అప్పుడు మీరు దేవుడు ఇచ్చిన గమ్యాన్ని చేరుకుంటారు.
అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. 12 యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. (2 దినవృత్తాంతములు 30:11-12)

నేను ఆజ్ఞాపిస్తున్నాను మరియు ప్రకటిస్తున్నాను, మీ కుటుంబ సభ్యులు రక్షించబడతారు. మీరు ప్రశాంతమైన నివాసంలో స్థిరపడతారు. ఉంచబడిన పందెంలో పరుగెత్తడాన్ని ఆపవద్దు మరియు వెనుకడుగు వేయవద్దు.

Bible Reading: Deuteronomy 4-6
ప్రార్థన
1. తండ్రీ, నేను పడిపోను, నేను విఫలమవను మరియు అలసిపోను. నేను వెనుకడుగు వేయను యేసు నామంలో.

2. తండ్రి, యేసు నామంలో, జీవితంలో నా దారిలో ఎదురయ్యే ప్రతి సవాళ్లను, అడ్డంకిని నా అభివృద్ధికి, విజయానికి సోపానాలుగా ఉండను గాక.

3. నేను మరణించను కానీ భూమిపై నా దినములను పూర్తి చేయడానికి జీవిస్తాను. నేను క్రీస్తులో, జీవించే దేశంలో, యేసు నామంలో నా విధిని (కర్తవ్యాన్ని) నెరవేరుస్తాను. ఆమెన్. 


Join our WhatsApp Channel


Most Read
● ఇటు అటు పరిగెత్తవద్దు
● రాజ్యానికై మార్గాన్ని స్వీకరించడం
● 21 రోజుల ఉపవాసం: 6# వ రోజు
● ఏ కొదువ లేదు
● మర్యాద మరియు విలువ
● మానవ తప్పుల మధ్య దేవుని మార్పులేని స్వభావం
● మీ మార్పును ఏది ఆపుతుందో తెలుసుకోండి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్