english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. విజయానికి పరీక్ష
అనుదిన మన్నా

విజయానికి పరీక్ష

Sunday, 15th of March 2026
0 0 27
Categories : విజయం (Success)
"నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, 11 నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, 12 ​దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము." (ద్వితీయోపదేశకాండమ 6:10-12)

మనలో చాలా మంది ప్రభువు ఇలా చెప్పాలని ఆశిస్తాం. "కృతజ్ఞతతో ఉండండి. స్తుతిస్తూ మీ చేతులను పైకి ఎత్తండి, కానీ ఆయన చెప్పేది ఇది కాదు. దానికి బదులుగా, "జాగ్రత్తపడుతూ, జాగ్రత్తగా ఉండండి!"

ఎవరైనా స్త్రీ లేదా పురుషుడు దేవుని కృపను అనుభవించినప్పుడు, రెండు విషయాలలో ఒకటి జరుగుతుంది:

మొదటిది, దేవుని ఆశీర్వాదం మన కృతజ్ఞతా భావాన్ని తీవ్రతరం చేస్తుంది మరియు ప్రభువు పట్ల మనకున్న ప్రేమను పెంచుతుంది. ఉదాహరణకు, ప్రభువు పేతురు పడవలోకి ప్రవేశించినప్పుడు పేతురు ప్రభువు అతనికి ఇచ్చిన ప్రవచనాత్మక సూచనలను పాటించాడు. అతని ఖాళీ పడవ నిండిన చేపలతో నింపబడింది. దీంతో పేతురు ప్రభువు యందు భక్తితో నమస్కరించాడు. ఆ రోజు నుండి పేతురు ప్రభువును వెంబడించాడు.

రెండవది, దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి జాగ్రత్తగా ఉండకపోతే దేవుణ్ణి మరచిపోయేలా చేస్తుంది.

మీరు ఆ కొత్త ఇంటికి మారినప్పుడు, మీరు ఆ డిగ్రీని పూర్తి చేసినప్పుడు, మీ జీతం ఐదు అంకెల నుండి ఆరు అంకెలకు మారినప్పుడు, ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఒక సూక్ష్మ పరీక్ష ఉంటుంది. దీనిని విజయ పరీక్ష అని అంటారు.

ఇప్పుడు, దయచేసి అర్థం చేసుకోండి, శ్రేష్ఠమైన ప్రతి యీవియు తండ్రి యొద్ద నుండి వచ్చును. (యాకోబు 1:17) ఈ శ్రేష్ఠమైన ప్రతి యీవియు స్వాగతించబడాలి మరియు ప్రఖ్యాతిపొందాలి, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదం దానిలో విజయం యొక్క సూక్ష్మ పరీక్షను కలిగి ఉంటుంది.

మీరు విజయం సాధించిన తర్వాత, మీరు విజయాన్ని దేవునికి ఆపాదిస్తారా లేదా మీ జ్ఞానం, మీ ప్రతిభ, మీ పని చేసిందని చెబుతారా? "నా సామర్థ్యము నా బాహుబలము ఇంత భాగ్యము నాకు కలుగజేసెను" అని చాలా మంది చెప్పడం నేను విన్నాను. (ద్వితీయోపదేశకాండము 8:17)

మీ సాక్ష్యాన్ని పంచుకోవడం ద్వారా ప్రభువును మహిమపరచడం మర్చిపోతారా? ఇప్పుడు ఆశీర్వదించబడ్డారని దేవుని మందిరానికి రావడం మానేస్తారా? ఆ జీవిత భాగస్వామి, ఆ ఇల్లు, సంతానంతో మీరు ఆశీర్వదించబడ్డారని ఇప్పుడు ప్రార్థన చేయడం మానేస్తారా?

గొప్ప ఆధ్యాత్మిక ప్రమాదం ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు కాకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి బాగా ఉన్నప్పుడు, వారు ప్రభువును మరచిపోయే అవకాశం ఉంది.

లూకా 17లో, స్వస్థత కోసం యేసయ్య దగ్గరకు వచ్చిన పది మంది కుష్టురోగుల గురించి మనం చదువుతాము. వెళ్లి యాజకులకు చెప్పుడి అని యేసయ్య వారికి ప్రవచనాత్మక సూచన ఇచ్చాడు. వారు ప్రవచనాత్మక సూచనలకు విధేయత చూపి, తమ దారిలో వెళ్లినప్పుడు, వారు స్వస్థత పొందారు. తాను స్వస్థత పొందడం చూసి, ఒక కుష్ఠురోగి యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన తట్టు తిరిగాడు.
మన ప్రభువు ప్రతిస్పందనను గమనించండి: అందుకు యేసు పదిమంది (అందరు) శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? (లూకా 17:17)

మీ గొప్ప పరీక్ష సమయం బహుశా మీరు ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు కాకపోవచ్చు, కానీ మీకు ఉద్యోగం దొరికినప్పుడు కావచ్చు. మీరు మీ విజయాన్ని పొందుకున్నప్పుడు; మీరు మీ విజయాన్ని ప్రభువుకు ఆపాదించడం కొనసాగిస్తారా? మీరు ఆలా చేయగలిగితే, మీరు ఆశీర్వాదం యొక్క మరొక స్థాయికి వెళతారు.

Bible Reading: Joshua 6-7
ప్రార్థన
తండ్రీ, నేను చివరి వరకు నీ యందు నమ్మకంగా ఉండేలా చేయి. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ప్రతి రోజు జ్ఞానిగా ఎలా వృద్ధి చెందాలి
● పరధ్యానం యొక్క గాలుల మధ్య స్థిరంగా (ఉండుట)
● అనుకరించుట (పోలి నడుచుకొనుట)
● ఇతరులకు సేవ చేయడం ద్వారా మనం అనుభవించే దీవెనలు
● దేవుని హెచ్చరికలను విస్మరించవద్దు
● కలుసుకోవడం యొక్క సామర్థ్యం
● యుద్ధం కోసం శిక్షణ - 1
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్