english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 21 రోజుల ఉపవాసం: 6# వ రోజు
అనుదిన మన్నా

21 రోజుల ఉపవాసం: 6# వ రోజు

Friday, 17th of December 2021
16 0 1543
కొంత మంది క్రైస్తవులు తమ జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉన్న అభిషిక్త బైబిలు బోధనలను విన్న తర్వాత కూడా అదే దుస్థితిలో ఉంటారు. మీరు వారిలో ఒకరు కాకూడదని ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీరు నేర్చుకున్న వాటిని అమలు చేయడంలో విఫలమైతే శూన్య ఫలితాలు వస్తాయి.

గమనిక: మీరు ఉపవాసం చేయకపోతే ఈ క్రింది వాటి గురించి ప్రార్థించవద్దు.

ధ్యానించుటకు కొన్ని లేఖనాలు
2 రాజులు 4:1-7
మత్తయి 17:24-27

క్రింది మూడు ప్రవచనాత్మక సూచనలు మిమ్మల్ని అప్పుల బారి నుండి బయటకు పడేలా చేస్తాయి మరియు మరీ ముఖ్యంగా మిమ్మల్ని అప్పుల బారి నుండి దూరంగా ఉంచుతాయి.

ప్రవచనాత్మక సూచన #1:
మీరు ఒక్కరికి చెల్లించాల్సిన ప్రతి బిల్లు, అప్పు మరియు రుణాల జాబితాను రూపొందించండి. 

మీలో ఎవ డైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? (లూకా 14:28)

మీరు ఎంత రుణపడి ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేవుడు దైవిక క్రమం మరియు వివరణ గల దేవుడు. అద్భుతాలకు దైవిక క్రమం తప్పనిసరి. యేసు ఒక రొట్టె మరియు రెండు చేపల ముక్కలతో అద్భుతంగా వారికి తినిపించే ముందు యాభై మందిని గుంపు గుంపులుగా కూర్చుండబెట్టాడు (లూకా 9:14-17).

ప్రవచనాత్మక సూచన #2:
ఆ జాబితాపై చేతులు ఉంచి మరియు ఉపవాసం యొక్క మిగిలిన రోజులు ప్రార్థన అంశములను ప్రార్థించండి. మీరు ప్రతి ప్రార్థన అంశమును కనీసం 12 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పునరావృతం చేయాలి.

1. ఆర్థిక కరువు యొక్క దుర్మార్గపు ప్రక్రియ, నా జీవితం, నా కుటుంబం మరియు నా ఆర్థిక స్థితిపై నీ శక్తిని నేను యేసుక్రీస్తు నామంలో విచ్ఛిన్నం చేస్తున్నాను. ప్రతి బిల్లు, అప్పు మరియు రుణం యేసు నామంలో అద్భుతంగా చెల్లించబడును.

2. యేసు రక్తము మరియు యేసుక్రీస్తు నామంలో నా ఆర్థిక మరియు ఆస్తులను తినే ప్రతి సాతాను శక్తిని రద్దు చేస్తున్నాను.

3. తండ్రీ, యేసు నామంలో, నా కుటుంబ సభ్యులను మరియు నన్ను ఆధ్యాత్మిక జలగల నుండి వేరు చేయి (సామెతలు 30:15)

4. నా ఆర్థిక, ఆస్తులు మరియు నా ఆదాయ వనరులను కలిగి ఉన్న దుష్ట శక్తులు యేసు నామంలో నరికివేయబడును గాక.

5. ఓ దేవా, యేసు నామంలో లాభరహిత శ్రమ మరియు గందరగోళం నుండి నన్ను విడిపించు.

6. నా జీవితంలో ప్రతి పితరుల అప్పు మరియు పేదరికం యేసు నామంలో యేసు రక్తం ద్వారా రద్దు చేయబడును గాక.

7. నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాను, కాబట్టి, పాపాత్ముల ఆస్తి ఇప్పుడు నాతో యేసు నామంలో ఉంచబడును. (సామెతలు 13:22 చదవండి)

8. యేసు నామంలో ఇప్పుడు నాకు సమృద్ధి మరియు ఆశీర్వాదం యొక్క దైవిక తలుపులు తెరవబడును.

9. తండ్రీ, యేసుక్రీస్తు నామంలో దైవిక సహాయకులతో నన్ను జతపరచు.

10. నాకు లేదా నా కుటుంబ సభ్యులకు నా ఆర్థిక స్థితికి ఆటంకం కలిగించే ప్రతి దుష్టుని సంపద లేదా ఆస్తులు, యేసు నామంలో పరిశుద్దాత్మ అగ్నితో నేను నిన్ను తుడిచివేస్తున్నాను.

11. ప్రభువా, నాకు ఉపదేశము చేసి మరియు నేను నడవవలసిన మార్గమును నాకు బోధించుము. నామీద నీ దృష్టియుంచి నన్ను నడిపించు. (కీర్తనలు 32:8) ఇప్పటి నుండి, నా ప్రతి నిర్ణయం యేసు నామంలో నీ ఆత్మచే పూర్తిగా ప్రభావితమవుతుంది.

ప్రవచనాత్మక సూచన #3:
కరుణా సదన్ పరిచర్య (లేదా దేవుని కార్యము చేస్తున్న ఏదైనా ఇతర పరిచర్య)లో భాగస్వామి అవ్వండి. మేము మీ నుండి కొంత డబ్బు సంపాదించాలని నేను దీన్ని వ్రాయడం లేదు.

భాగస్వామ్యం మీ జీవితం నుండి పేదరికం యొక్క కాడిని విచ్ఛిన్నం చేసే అభిషేకాన్ని విడుదల చేస్తుంది. నీ సమృద్ధి అంతా నీదే అయితే అది స్వార్థం.

ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును. (లూకా 14:38)

మీరు ఇచ్చినప్పుడు పొంగిపొర్లుతున్న సమృద్ధి విడుదల అవుతుంది. హృదయంతో ఒప్పందం చేసుకోవడం వలన ఇవ్వడం మరియు దురాశ మరియు స్వార్థం యొక్క ఆత్మల నుండి ఒకరిని విడుదల చేస్తుంది. దురాశ, లోభము మరియు స్వార్థం యొక్క ఆత్మలను ఎదుర్కోవటానికి వేరే మార్గం లేదు.

ఒప్పుకోలు
దయచేసి వీలైనన్ని సార్లు ఇలా చెప్పుతూ ఉండండి.

ఈ సంవత్సరం 2021 మరియు రాబోయే 2022 సంవత్సరం సహాయం కోసం నా వైపు చూసే ఎవరు నిరుత్సాహపడరు. నా అవసరాలను తీర్చడానికి మరియు అవసరమైన ఇతరులకు ఇవ్వడానికి యేసు నామంలో నా దగ్గర తగినంత ఉంది.

(గమనిక: మీరు అప్పుల నుండి బయటపడటానికి సహాయపడే కలలు, దర్శనాలు, సృజనాత్మక ఆలోచనల ద్వారా ప్రభువు మీకు విషయాలను చూపిస్తాడు. దయచేసి వాటిపై కార్యం చేయండి)

గమనిక: పాస్టర్ మైఖేల్ మరియు పాస్టర్ అనిత గారు ఈరోజు (17.12.2021) వారి 22వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు, కాబట్టి దయచేసి మీ ఉపవాసం మరియు ప్రార్థనలలో వారిని మరియు వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి.


Join our WhatsApp Channel


Most Read
● మీ హృదయాన్ని శ్రద్ధగా కాపాడుకోండి
● చింతగా ఎదురు చూడటం
● అగ్ని తప్పక మండుచుండాలి
● ఆయన ద్వారా ఏ పరిమితులు లేవు
● మీ హృదయాన్ని పరిశీలించండి
● తెలివిగా పని చేయండి
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 4
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్