అనుదిన మన్నా
ప్రవక్త ఎలీషా జీవితం- ఆధ్యాత్మిక పెరుగుదల యొక్క నాలుగు ప్రదేశాలు - III
Wednesday, 19th of May 2021
3
2
1246
పిమ్మట ఏలీయా, "ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు" గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, "అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను" గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి. (2 రాజులు 2:4)
యెరికో యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
యెరికో యొక్క ప్రాముఖ్యత గురించి స్పష్టమైన సూచనలు యెహోషువ 6వ అధ్యాయంలో ఉంది.
ఆకాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. 2 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనుచూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను. 3 మీరందరు యుద్ధసన్న ద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగ వలెను. ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. (యెహోషువ 6:1-3)
ఇశ్రాయేలీయులు తమకు వాగ్దానం చేసిన దేశం, కనాను వైపు వెళ్లుతున్నప్పుడు స్వాధీనపరచుకున్న మొదటి నగరం యెరికో. అది వారికి ఉత్తినే రాలేదు. వారు దాని కోసం పోరాడవలసి వచ్చింది.
క్రైస్తవులైన మనం దేహాన్ని మరియు లోకాన్ని జయించడమే కాదు, శత్రువుతో నేరుగా వ్యవహరించి వాణ్ణి కూడా జయించాలి. చాలా మంది క్రైస్తవులకు ఆత్మ మరియు దేహం మధ్య యుద్ధం గురించి తెలుసు; కానీ విశ్వాసులు మరియు చీకటి శక్తుల మధ్య మనలో ఉన్న ఆధ్యాత్మిక యుద్ధం గురించి వారికి తెలియదు.
అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు 6:12 లో దీనిని గురించి వివరించాడు
ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల (దుష్టుల) సమూహ ములతోను పోరాడుచున్నాము. (ఎఫెసీయులు 6:12)
తన సమయం తక్కువగా ఉందని శత్రువుకు బాగా తెలుసు మరియు వాని వంచక పథకాలను అమలు చేయకుండా వానిని ఆపేది దేవుని ప్రజలు మరియు అందువల్ల వాడు తన దుష్టశక్తుల ద్వారా వారి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు మరియు చేస్తాడు.
క్రైస్తవులు తరచూ వారి పర్యావరణంపై (వారు పనిచేసే లేదా నివసించే ప్రదేశం) ఇటువంటి దాడులను ఎదుర్కొంటారు, కొన్నిసార్లు వారి భౌతిక శరీరాలలో అనారోగ్యం లేదా ప్రమాదాల ద్వారా. కొంత మంది క్రైస్తవులు వారి ఆలోచనలు మరియు భావోద్వేగాల్లో దుర్మార్గపు దాడులను ఎదుర్కొంటారు, ఇది వారి సంబంధాలలో వినాశనాన్ని సృష్టిస్తుంది. కొంత మంది క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక జీవితంపై దుర్మార్గపు దాడులను ఎదుర్కొంటారు, ఇది ప్రభువును సమర్థవంతంగా సేవించకుండా అడ్డుకుంటుంది.
ప్రతి ఒక్కటి మరియు ప్రతి ఒక్కరూ తమకు వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారో చాలామందికి అర్థం కాలేదు, అది వారి జీవితంలో భయంకరమైన గందరగోళం మరియు బాధను సృష్టిస్తుంది. చాలా తరచుగా, కొందరు ఈ విషయాలను సహజమైన సంఘటనలుగా భావిస్తారు, అవి వారిని చీకటి శక్తులచే అతీంద్రియంగా హింసింపబడుతున్నారని గ్రహించడంలేదు.
అలిసిపోయిన క్రైస్తవ తల్లి నుండి ఒక లేఖ ఇక్కడ ఉంది. "పాస్టర్ గారు, నా కుమారునితో నేను చాలా తగినంతగా ఉన్నాను. నేను ప్రతిదీ ప్రయత్నించాను. నేను వానితో విశ్వాసం గురించి వాదించాను. నేను వానిని బైబిల్ చదవటానికి మరియు ప్రార్థన చేయటానికి ప్రయత్నించాను. నేను క్రైస్తవ వీడియోలు మరియు పాడ్‌కాస్ట్‌లు పంచుకున్నాను. నేను అదనపు బాగా ఉండటానికి సమస్తము ప్రయత్నించాను కాని నాకు ఏమి జరగలేదనిపిస్తుంది. నేను గోడతో మాట్లాడుతున్నానిపిస్తుంది. దయచేసి సహాయం చేయగలరా?"
ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే, ఒక క్రైస్తవుడు శత్రువు యొక్క కార్యాల మీద విజయం పొందాలి.
ఎలా? యెహోషువ 6లో దాచబడినది మూడు రత్నాలు ఉన్నాయి
అట్లు రెండవ దినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి. ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆ ప్రకా రముగానే పట్టణ ముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి. (యెహోషువ 6:14-15)
1. చుట్టు తిరుగుట: ఇది అనుదిన జీవిత క్రమశిక్షణ. ఆపవద్దు. వెనుకకు తగ్గవదు. 7 సార్లు, వారంలో ఏడు రోజులు.
ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి. (యెహోషువ 6:12-13)
2. బూర: ఇది ఒక ప్రకటన. ఇది మీరు చూసే ముందు విజయాన్ని జరుపుకోవడం లాంటిది. ఇది మీరు ఎదుర్కొంటున్న చెడు కోట నుండి మొదటి రాయి పడక ముందే విజయాన్ని జరుపుకోవడం లాంటిది.
మీరు క్రమం తప్పకుండా ప్రకటిస్తూ (ఆజ్ఞాపిస్తు) ఉండాలి. "నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు!" "నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను." "ఆయన పొందిన గాయములచేత నేను స్వస్థత నొందితిని." "నేను యేసుక్రీస్తు ద్వారా విజయుడు కంటే ఎక్కువ." "దేవుడు ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలోనూ నాకు విజయం ఇస్తాడు!" "కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును." (1 యోహాను 4: 4; ఫిలిప్పీయులు 4:13; 1 పేతురు 2:24; రోమీయులకు 8:37; 2 కొరింథీయులు 2:14; ఫిలిప్పీయులు 4:19).
యెరికో వద్ద, మీరు భిన్నంగా మాట్లాడటం ప్రారంభించండి. మీరు సమస్య గురించి మాట్లాకండి, మీరు పరిష్కారాన్ని ప్రకటిస్తూ ఉండండి. మీరు ముగింపును మొదటి నుండి ప్రకటిస్తూ ఉండండి.
ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనని కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. (యెహొషువ 6:16)
3. కేకలు వేయుడి: అది ఆరాధన. ఆత్మతోను మరియు సత్యంతోను నిజమైన ఆరాధన కంటే చీకటిని చెదరగొట్టేలా ఏమీ లేదు.
మీరు ఇప్పటికే యెరికోలో ఉంటే, అది చాలా మంచిది. కాకపోతే, మీరు గిల్గాల్‌కు వెళ్లి బెతేల్‌కు వెళ్లాలి. అక్కడ నుండి యెరికోకు రావాలి. మీరు యెరికోకు వచ్చినప్పుడు, మీరు ఆత్మలో యోధులు అవుతారు.
రాజుకే మహిమ కలుగును గాక!
ప్రార్థన
(దయచేసి ప్రతి ప్రార్థన అంశాన్ని కనీసం 5 నిమిషాలు ప్రార్థించండి)
యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము." (కీర్తనలు 35:1)
దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం పుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. (కీర్తనలు 59:1-2)
నా జీవితం మరియు కుటుంబంపై దైవిక రక్షణ కోసం దేవునికే మహిమ కలుగును గాక. నాకు మరియు నా కుటుంబ సభ్యులకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నాకును, నా కుటుంబ సభ్యులకును దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. (యెషయా 54:17)
Join our WhatsApp Channel
Most Read
● యేసు రక్తాన్ని అన్వయించడం● పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం – I
● విశ్వాసులైన రాజుల యాజకులు
● కార్యం చేయండి
● 37 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● క్రైస్తవులు వైద్యుల వద్దకు వెళ్లవచ్చా?
● జీవ గ్రంథం
కమెంట్లు