అనుదిన మన్నా
క్రీస్తు కేంద్రీకృత స్వగృహము
Wednesday, 30th of November 2022
2
0
970
Categories :
కుటుంబం (Family)
శిష్యత్వం (Discipleship)
"క్రీస్తు కేంద్రీకృత స్వగృహము (ఇల్లు)" అంటే ఏమిటి?
నేటి కాలంలో వివాహం మరియు కుటుంబాన్ని నిర్మించడం అంత సులభం కాదు. ఇది మీ సమస్తమును, మీ సమయాన్ని మరియు శక్తిని కోరుతుంది - అక్షరాలా ప్రతిదీ. ఏదేమైనా, వీటన్నింటిలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే (కీర్తనలు 127:1). ప్రతిరోజూ మనం మన ఇంటిని, మన వివాహాన్ని నిర్మించమని ప్రభువును అడగాలి - ఇది మొదటి తాళంచెవి.
క్రీస్తు కేంద్రంగా ఉండే ఇల్లు కొన్ని విశిష్టతలను కలిగి ఉంది. వాటిని పరిశీలిద్దాం:
ఒక క్రైస్తవ ఇల్లు క్రమబద్ధంగా ఉంటుంది
అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 14:33 లో ఇలా వ్రాశాడు: "దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు".
నేను క్రమబద్ధంగా అంటున్నపుడు, ప్రతిదీ చక్కగా మరియు శుభ్రంగా ఉండడం అని అర్ధం కాదు (వాస్తవానికి, అది బాగుంటుంది). క్రమపద్ధతిలో నా ఉద్దేశ్యం, కుటుంబ సభ్యులు ఏది ఆమోదయోగ్యమైనది మరియు ఏది కాదో నిరంతరం సమీక్షిస్తారు. ఏది అవసరమో మరియు ఏది అవసరము కానిది అని.కొన్ని ప్రశ్నలు, "ఈ విషయం కుటుంబాన్ని నిర్మిస్తుందా లేదా?" తప్పక అడగాలి. ఈ నిర్ణయాలన్నీ దేవుని వాక్యంతో ప్రభావితమై ఉండాలి. ఇది కుటుంబానికి దైవికమైన పద్దతిని తెస్తుంది.
క్రీస్తు కేంద్రీకృత ఇల్లు అనేది ఆధ్యాత్మిక క్రమశిక్షణలను పాటించే ప్రదేశము
క్రీస్తు కేంద్రీకృత ఇల్లు అనేది కుటుంబ సభ్యులు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి మొదలైన వాటిని ఉదాహరణగా ఉండడానికి ప్రోత్సహించే ప్రదేశము.
క్రీస్తు కేంద్రీకృత ఇల్లు కృపతో గుర్తించబడింది
ప్రతి వివాహం మరియు ప్రతి కుటుంబంలో కఠినమైన రోజులు ఉంటాయి. మీరు ఎంత దైవికంగా ఉన్నా, కొన్ని వాదనలు మరియు ఇలాంటివి ఎల్లప్పుడూ ఉంటాయి. ఏదేమైనా, క్రీస్తు కేంద్రీకృత స్వగృహంలో, తల్లిదండ్రులు మరియు పెద్దలు ఒకరినొకరు క్షమించడంలో మరియు విషయాలను పునరావృతం చేయకుండా ముందుండాలి. ఇది యువకులకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. బాధిత వ్యక్తి ఓదార్పు, విశ్రాంతి మరియు స్వస్థత పొందగలిగే చోటు ఇల్లు ఒక ఆశ్రయము అవుతుంది.
ప్రభువు మన ఇళ్లను క్రీస్తు కేంద్రంగా ఉండే గృహాలుగా చేస్తాడు, ఎందుకంటే పరలోకపు తండ్రి మనల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు, ఆయన ఎల్లప్పుడూ మన మొఱ్ఱను ఆలకించును మరియు మనల్ని రక్షించును. (కీర్తనలు 34:18).
ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నేను నా కుటుంబ సభ్యులందరినీ నీకు సమర్పిస్తున్నాను.
తండ్రీ, యేసు నామంలో, ఈ రోజు నుండి, నేను మరియు నా కుటుంబ సభ్యులందరికీ నీ ఇష్టానికి విరుద్ధంగా ఉండే దాని నుండి వేరు చేస్తాను.
యేసు నామంలో, నా ప్రతి కుటుంబ సభ్యుడిపై (నాతో సహా) మునుపటి తరాల నుండి ప్రతి చెడు అనుబంధాలను నేను విచ్ఛిన్నం చేస్తాను
నేనును మరియు నా యింటి వారును కేవలము యెహోవాను సేవించెదము.
Join our WhatsApp Channel
Most Read
● అద్భుతాలలో పని చేయుట: కీ#1● మీ విధిని మార్చండి
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 3
● మీరు సులభంగా గాయపరచబడుతారా?
● నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను కోరుకోవచ్చా?
● ఏ కొదువ లేదు
● విశ్వాసం యొక్క సామర్థ్యము
కమెంట్లు