english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. స్వతహాగా చెప్పుకునే శాపాల నుండి విడుదల
అనుదిన మన్నా

స్వతహాగా చెప్పుకునే శాపాల నుండి విడుదల

Saturday, 10th of December 2022
2 0 1048
Categories : నాలుక (Tongue) విడుదల (Deliverance) శాపాలు (Curses)
సామెతలు 18:21లో, అతడు ఇలా వ్రాశాడు: "జీవమరణములు నాలుక వశము దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు"

జీవం మరియు మరణాన్ని తెచ్చే శక్తి నాలుకలో ఉంది.

యాకోబును ఆశీర్వదించడానికి ఇస్సాకును మోసగించడానికి యాకోబు తల్లి రిబ్కా ఒక విస్తృతమైన పథకాన్ని ప్రణాళిక చేసింది. తెలిసిందేంటంటే, ఇస్సాకు తనను శపిస్తాడని యాకోబు భయపడ్డాడు.

అయినను అతని తల్లి (రిబ్కా) నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నీవు నా మాట మాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పెను. (ఆదికాండము 27:13)

అప్పుడు రిబ్కా తనపై ఒక శాపాన్ని పలికింది - తనపై చెప్పుకునే - శాపం. ఆమె జీవితంలో ఈ శాపం యొక్క ప్రభావాన్ని మనం చూడగలము.

మరియు రిబ్కా ఇస్సాకుతో ఇలా అంది, "హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకు వలన నాకేమి ప్రయోజనమనెను" (ఆదికాండము 27:46)

రిబ్కా తన జీవితంతో విసిగిపోయింది మరియు చివరికి ఆమె తనపై పలికిన -శాపం ఫలితంగా ఆమె అకాలంగా మరణించింది.

స్వతహాగా - విధించుకునే లేదా స్వతహాగా - పలికిన శాపానికి మరొక ఉదాహరణ
పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజన మేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని "ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచు కొనుడని చెప్పెను."

అందుకు ప్రజలందరు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. (మత్తయి 27:24-25)

భావోద్వేగ ఉద్రేకంతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు తమపై మాత్రమే కాకుండా వారి పిల్లలు మరియు వారి పిల్లల పిల్లల మీద శాపం పలికారు.

ప్రఖ్యాత చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసెఫస్ ఇలా వ్రాశాడు: "క్రీ.శ 70 నాటికి, రోమీయులు యెరూషలేము వెలుపలి గోడలను పగలగొట్టారు, ఆలయాన్ని ధ్వంసం చేశారు మరియు నగరానికి నిప్పు పెట్టారు.

విజయంలో, రోమన్లు వేలాది మందిని వధించారు. మరణం నుండి తప్పించుకున్న వారిలో: ఐగుప్తు గనుల్లో వేలాది మంది బానిసలుగా మరియు శ్రమకు పంపబడ్డారు, ఇతరులు సామ్రాజ్యం అంతటా ఉన్న రంగాలకు చెదరగొట్టబడ్డారు. ఆలయా పవిత్ర శేషాలను రోమా సామ్రాజ్యానికి తీసుకెళ్లారు, అక్కడ విజయాన్ని పురస్కరించుకుని వాటిని ప్రదర్శించారు.

WW2 ముగింపులో నాజీ నిర్బంధ శిబిరాలను కనుగొనడం ద్వారా యూదులను నిర్మూలించడానికి హిట్లర్ యొక్క పూర్తి భయాందోళనలను వెల్లడించింది. యూదులను క్రమపద్ధతిలో చంపడం గురించి మీడియా నివేదికలు ఇప్పటికీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

ఈ రోజుకి కూడా, ఆ మాటల ఫలితాలను మనం చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఊహించలేని హింస మరియు రక్తపాతం ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై ఇది మీకు అవగాహన ఇస్తుంది. వారు తమపై మరియు ఇంకా రాబోయే తరాల మీద ఒక శాపం పలికారు.

గోరమైన నాశనం ఏమిటంటే స్వతహాగా చేసుకునే నాశనం. స్వతాహాగా చెప్పుకునే శాపాల ఫలితంగా నేడు చాలా మంది ప్రజలు బాధపడుతున్నారని స్పష్టమవుతోంది. వారు ఎదుర్కొంటున్న సమస్యలు దేవుడు, దుష్టుడు లేదా మానవ వనరుల నుండి ఉద్భవించలేదు కానీ స్వతాహాగా చెప్పుకునే శాపాల నుండి.

ఇశ్రాయేలు దేశం ప్రభువైన యేసును తమ మెస్సీయగా అంగీకరించినప్పుడు మాత్రమే ఈ శాపం విచ్ఛిన్న మవుతుందని నేను నమ్ముతున్నాను - ఆ రోజు ఎంతో దూరంలో లేదు.
స్వహతపై చెప్పుకునే శాపాలు మనం మాట్లాడే పదాల ద్వారా మనపైకి తెచ్చుకుంటాము. నిజానికి మనల్ని మనం శప్పించుకుంటున్నాము. చాలా మందికి ఇలా చెప్పుకునే అలవాటు ఉంది, "నేను చనిపోవాలనుకుంటున్నాను, నేను జీవితంలో విసిగిపోయాను, నేను పనికిరానివాడిని మరియు మొదలగున్నవి, మనపై మనము ఒక శాపాన్ని పలుకుతున్నాము.

ప్రజలు అర్థం చేసుకోనని విషయం ఏమిటంటే, ప్రజలు అలాంటి ప్రతికూల భాషను ఉపయోగించినప్పుడు, వారు నాశనం సృష్టించగల దుష్ట శక్తులకు ద్వారాలు తెరుస్తున్నారు. ప్రజలను పీడిస్తున్న అనేక అనర్థాలకు ఇదే కారణం.

ఒక ప్రశ్న మిగిలి ఉంది: స్వహతపై చెప్పుకునే శాపాలను విచ్ఛిన్నం చేయడానికి నేను ఏమి చేయాలి?
ప్రభువు యొద్దకు నిజమైన పశ్చాత్తాపంతో వెళ్ళడం 

నిజమైన అభిషిక్తుడైన దేవుని దాసుడు లేదా దాసురాలి నుండి లేదా ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా విడుదలను కోరుకోవడం

సరైన మాటలను ఒప్పుకోవడం ద్వారా ఆ ప్రతికూల మాటలను భర్తీచేయడం (దీని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి నోహ్ యాప్‌లో అనుదిన ఒప్పుకోలు భాగాన్ని చూడండి)

పరిశుద్ధాత్మ పట్ల మనం సున్నితంగా ఉందాం, తద్వారా మనం చెప్పిన ప్రతికూల విషయాలను ఆయన మనల్ని నిర్దోషులుగా నిర్ధారించి, మనల్ని పశ్చాత్తాపం మరియు స్వస్థత వైపుకు నడిపించును గాక.

గమనిక: దయచేసి దీన్ని మీకు తెలిసిన ఐదుగురికి పంపండి, తద్వారా వారు కూడా ఈ విడుదలను అనుభవిస్తారు. మీరు ఇలా చేసినప్పుడు ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
ఒప్పుకోలు
నేను చావను సజీవుడనై యుందును. నేను ఈ తరానికి మరియు రాబోయే తరానికి ప్రభువు క్రియలను యేసు నామంలో వివరించెదను. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● పరిశుద్ధత గురించి స్పష్టంగా తెలియజేయబడింది
● లోబడే స్థలము
● కలవరాన్ని అధిగమించడానికి క్రియాత్మకమైన మార్గాలు
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 4
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 1
● ఆశీర్వాదం యొక్క శక్తి
● పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం – I
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్