ఉపవాసం యొక్క ప్రధాన ఉద్దేశ్యం దేవుని యెదుట మనల్ని మనం తగ్గించుకోవడం.
"ఉపవాసంతో నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని..." (కీర్తనలు 35:13).
"అప్పుడు…. దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, ఉపవాసముండుడని ప్రకటించితిని." (ఎజ్రా 8:21). కాబట్టి, మన ఉపవాసం మనల్ని పశ్చాత్తాపానికి గురిచేసేలా అనుమతించడం చాలా అత్యవసరం.
పశ్చాత్తాపం
కొత్త నిబంధనలో, పశ్చాత్తాపానికి కీలక పదము 'మెటానోయా' అంటే "ఒకరి మనసు మార్పుచెందడం." నిజమైన పశ్చాత్తాపం క్రియల్లో మార్పుకు దారితీస్తుందని కూడా బైబిలు సెలవిస్తుంది.
"మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పు చున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను." (లూకా 3:8-9)
పశ్చాత్తాపానికి నిజమైన విరిగి నలిగి మనస్సు అవసరం. పశ్చాత్తాపం అంటే మళ్లీ పాపం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభువును క్షమించమని అడగడం కాదు.
పశ్చాత్తాపం అనేది మార్పుచెందడానికి నిబద్ధతతో పాపాన్ని నిజాయితీగా, పశ్చాత్తాపంతో అంగీకరించడం. పశ్చాత్తాపం పాపానికి దారితీసే అలవాట్లను నిర్మూలించేటప్పుడు దైవభక్తిని పెంపొందించుకునేలా చేస్తుంది.
ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి. (అపొస్తలుల కార్యములు 3:19)
మీరు తీసుకోవలసిన మొదటి మెట్టు ఏమిటంటే, మీరు తప్పులు చేశారని మరియు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారని మరియు దేవునితో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అంగీకరించడం.
ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం చేసిన ‘సహాయకుడు’ కాబట్టి మీరు ఆయనను అడిగితే, మీరు ఎక్కువగా పడిపోయే అవకాశం ఉన్న ప్రదేశాలను పరిశుద్ధాత్మ మీకు తెలియజేస్తాడు.
ఎప్పటికీ మర్చిపోకండి, మీ పాపం గురించి మరియు యేసు ఎవరు మరియు ఆయన ఏమి చేసాడు అనే దాని గురించి మొదట మీ మనసు మార్చుకోకుండా రక్షకునిగా యేసు క్రీస్తుపై మీ విశ్వాసం ఉంచడం అసాధ్యం.
ధ్యానించుటకు కొన్ని లేఖనములు
1 యోహాను 1:8-10
కీర్తనలు 51:1-4
అపొస్తలుల కార్యములు 17:30
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అంశమును పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అంశానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)
1. తండ్రీ, నేను మన ప్రభువగు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నీ వద్దకు వస్తున్నాను మరియు ఇప్పుడు యేసు నామంలో నా ఆత్మ, ప్రాణము మరియు శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను.
2. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము. (కీర్తనలు139:23-24)
3. యేసు నామంలో ప్రతి పాపం, ప్రతి దోషం, ప్రతి అతిక్రమణ, ప్రతి తప్పు, ప్రతి అన్యాయం మరియు భక్తిహీనత గురించి నేను పశ్చాత్తాపపడుతున్నాను.
4. నేను యేసు నామంలో నా హృదయం, నా నోటి మాట మరియు నా మనస్సు యొక్క పాపాలను ఒప్పుకుంటున్నాను మరియు పశ్చాత్తాపపడుతున్నాను.
5. యేసు రక్తము ద్వారా యేసు నామములో నన్ను పరిశుభ్రంగా, ఆత్మ, ప్రాణమును మరియు శరీరమును కడుగుము.
6. నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రీ, నా ప్రియమైన వారి, నా కుటుంబం మరియు బంధువుల తరపున నేను నీ యెద్దకు వస్తున్నాను.
7. నేను నా ప్రియమైన వారిని, నా కుటుంబాన్ని మరియు బంధువులను యేసు రక్తంలో ముద్రిస్తున్నాను, నానవేయుచున్నాను, నిమగ్నము చేయుచున్నాను.
8. నేను నా పాపములను మరియు నా పూర్వీకుల పాపములను ఒప్పుకొనుచున్నాను. మేము నీకు వ్యతిరేకంగా పాపం చేసియున్నాము. మేము దుర్మార్గంగా జీవించాము మరియు తిరుగుబాటు చేసాము, నీ స్వరానికి మరియు నీ చిత్తానికి అవిధేయత చూపియున్నాము. మమ్మల్ని క్షమించు.
9. నీవు కృపగల దేవుడవు, దయ మరియు ప్రేమతో నిండి ఉన్నావు మరియు మా పాపాలను క్షమించి, నా రక్తంలో ఉన్న సమస్త అనీతి నుండి పరిశుభ్రపరచమని నేను నిన్ను వేడుకుంటున్నాను. యేసు నామంలో. ఆమెన్.
10. దేవుని ఆరాధించడానికి కొంత యెగ్యమైన సమయాన్ని వెచ్చించండి.
Join our WhatsApp Channel
Most Read
● దేవునికి దగ్గరవుట (దేవుని యొద్దకు వచ్చుట)● 16 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● సహనాన్ని లేదా ఓర్పును హత్తుకోవడం
● దేవదూతల సహాయాన్ని ఎలా సక్రియం చేయాలి
● యజమానుని యొక్క చిత్తం
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #14
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 1
కమెంట్లు