మొత్తం బైబిల్లో, యేసు రక్తం తప్ప మరే ఏ రక్తము "అమూల్యమైనది" అని పిలవబడలేదు (1 పేతురు 1:19). ప్రభువైన యేసు మన విమోచన కోసం అత్యంత వెల చెల్లించాడు మరియు దాని వెల 'తన స్వంత అమూల్యమైన రక్తం'.
యేసుక్రీస్తును తమ ప్రభువు మరియు రక్షకునిగా అంగీకరించిన వారికి యేసు యొక్క విలువైన రక్తము అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది.
యేసు క్రీస్తు రక్తం యొక్క ప్రయోజనాలు
1. పవిత్రపరచును
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యోహాను 1:7)
వెలుగులో నడవడం అంటే మనం పరిపూర్ణంగా నడుస్తున్నామని కాదు. దీని అర్థం ఆయన నుండి ఏమీ దాచకుండా ఆయన యందు నడవడం. యేసు రక్తము అటువంటి వారికి పవిత్రులనుగా చేయడానికి అందుబాటులో ఉంటుంది.
2. విమోచన
విమోచన అంటే తిరిగి కొనడం. మనం సాతాను ఆధీనంలో పాపానికి బానిసలుగా అమ్మబడ్డాము. యేసు మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించినప్పుడు, మనం పాపం యొక్క శక్తి నుండి విడుదల పొందాము. మీరు మరియు నేను యేసు రక్తం ద్వారా కొనబడ్డాము. ఇప్పుడు, మీరు మరియు నేను ఆయనకు చెందినవారము.
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. (ఎఫెసీయులకు 1:7)
3. విడుదల మరియు రక్షణ
మరణ దూత ఐగుప్తు గుండా వెళ్లినప్పుడు, గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలీయులను కొద్ది మందిని మరణం నుండి కాపాడింది. (నిర్గమకాండము 12)
వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని (సాతానుని) జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. (ప్రకటన 12:11)
సాతాను మరియు వాని దుష్ట సమూహాలను యేసు రక్తం ద్వారా మరియు పూర్తిగా క్రీస్తుకు సమర్పించడం ద్వారా జయించవచ్చని లేఖనం స్పష్టంగా చెబుతుంది.
ఒప్పుకోలు
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అంశమును పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అంశానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)
1. నేను యేసుక్రీస్తు రక్తంలో ముంచబడ్డాను: నేను నా ఆత్మను, మనస్సాక్షిని, దివ్యజ్ఞానమును మరియు ఆరాధనను యేసు రక్తంతో ద్వారా కప్పుతున్నాను.
2. నేను నా ఆత్మను: స్పృహను, ఉపచేతనను మరియు స్మృతిహీనతాను: మనస్సు, సంకల్పం, భావోద్వేగాలు మరియు తెలివిని యేసు రక్తంతో కప్పుతున్నాను.
3. నేను నా ఐదు ఇంద్రియాలను: చూపు, వినికిడి, సువాసన, రుచి మరియు స్పర్శ యేసు రక్తంతో కప్పుతున్నాను.
4. నేను నా భౌతిక శరీరాన్ని: మెదడు, శారీరక ఆకలి మరియు లైంగిక స్వభావమును యేసు రక్తంతో కప్పుతున్నాను.
5. నేను నా జీవితాన్ని మరియు విధిని యేసు రక్తంలో నానవేయుచున్నాను.
6. యేసు రక్తం, ఇప్పుడు నా జీవితంలోని ప్రతి రంగంలోకి లోతుగా ప్రవహించును గాక మరియు యేసు నామంలో లోతైన పవిత్రులనుగా, విమోచన మరియు స్వస్థత చేయును గాక.
7. నేను యేసు రక్తాన్ని నాపై మరియు నా కుటుంబ సభ్యులపై, యేసు నామంలో ఉంచుతున్నాను.
8. నేను నా యిండ్లమీద మరియు నా ఆస్తులన్నిటిని యేసు క్రీస్తు రక్తముతో కప్పుతున్నాను (నిర్గమకాండము 12:13).
[కొంచెం నూనె తీసుకుని, మీ ఇంటి తలుపులు, కిటికీలు మరియు ఇతర వస్తువులను అభిషేకించండి మరియు మీరు మీ ఇల్లు మరియు ఆస్తులను అభిషేకిస్తున్నప్పుడు కూడా ఇలా పలకండి]
9. నేను యేసు క్రీస్తు రక్తం ద్వారా దుష్టునిపై జయిస్తాను (ప్రకటన 12:11) [మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను నూనెతో అభిషేకించండి]
10. నేను యేసు క్రీస్తు రక్తాన్ని ప్రోక్షింపజేస్తాను మరియు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక (1 పేతురు 1:2)
11. నిత్య నింబధన రక్తము ద్వారా నేను పరిపూర్ణుడనైతిని (హెబ్రీయులకు 13:20-21)
12. యేసు క్రీస్తు రక్తం ద్వారా దేవుని సన్నిధిలోకి ప్రవేశించే ధైర్యం నాకు ఉంది (హెబ్రీయులకు 10:19)
13. యేసు క్రీస్తు రక్తము ద్వారా సజీవుడైన దేవునికి సేవ చేయుటకు నా మనస్సాక్షి మృతల క్రియల నుండి పవిత్రులనుగా చేయబడింది (హెబ్రీయులకు 9:14)
14. యేసు క్రీస్తు రక్తము ద్వారా నేను విమోచన కలిగి ఉన్నాను, మరియు నేను దుష్ట శక్తుల నుండి విమోచించబడ్డాను (ఎఫెసీయులకు 1:7)
15. కొంత సమయము దేవుని ఆరాధించండి. మీరు యేసయ్య రక్తం యొక్క ఆరాధన పాట పాడవచ్చు.
Join our WhatsApp Channel
Most Read
● ఆయనకు సమస్తము చెప్పుడి● ఏడంతల ఆశీర్వాదములు (దీవెనలు)
● అంతర్గత నిధి
● ఆరాధనను ఒక జీవన విధానంగా మార్చుకోవడం
● డబ్బు స్వభావాన్ని పెంపొందిస్తుంది
● ఎత్తబడుట (రాప్చర్) ఎప్పుడు జరుగుతుంది?
● 18 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు