అనుదిన మన్నా
21 రోజుల ఉపవాసం: 5# వ రోజు
Thursday, 16th of December 2021
1
0
1552
Categories :
Fasting and Prayer
క్రింది లేఖనాలు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి యొక్క భయంకరమైన పరిస్థితిని గురించి తెలియాజేస్తాయి.
ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారునా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి యున్నారు. నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.
నేను నా పనివాని పిలువగా వాడేమి పలుక కుండనున్నాడు నేను వాని బతిమాల వలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగబడియున్నారు. నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవిదంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది. (యోబు 19:13-20)
ప్రభువైన యేసయ్య తన దగ్గరకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు. ఆయన ఎవరినీ తిప్పిపంపలేదు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి వారు బాధపడటం దేవుని చిత్తమని ఆయన ఎన్నడూ చెప్పలేదు. యేసు ప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దీని నుండి, స్వస్థత అనేది అందరికీ దేవుని చిత్తమని మనం తెలుసుకోవచ్చు. తరచుగా శత్రువు (దుష్టుడు) దేవుని ప్రజలను అనారోగ్యం మరియు వ్యాధికి బానిసలుగా ఉంచడానికి అబద్ధాలను ఉపయోగిస్తాడు.
అపొస్తలుల కార్యములు 10:38 ఇలా సెలవిస్తుంది, "అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత (అనగా-సాతానుచే) పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను."
గమనించండి, అపొస్తలుల కార్యములు 10:38 ఆయన "అపవాది చేత పీడింపబడిన వారందరినీ" స్వస్థపరచడం గురించి చెప్పాడు. ఇది నిజంగా అనారోగ్యం అంటే ఏమిటో వెల్లడిస్తుంది. మనకు ఏదైనా బొదించడం దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదం కాదు. అది దేవుడిచ్చిన శిక్ష కూడా కాదు. దేవుడు అనారోగ్యానికి మూలం అయితే, మనకు స్వస్థత తీసుకురావడానికి ఆయన తన కుమారుడైన యేసును పంపి ఉండేవాడు కాదు.
స్వస్థత ఇప్పటికే సంపూర్ణమైన కార్యము. 1 పేతురు 2:24 ఇలా సెలవిస్తుంది, "మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను - ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి."
ధ్యానించుటకు లేఖనాలు
నిర్గమకాండము 15:26
యెషయా 53
కీర్తనలు 103:1-5
ఒప్పుకోలు
[ప్రతి ప్రార్థన అంశము మీ హృదయం నుండి వచ్చేంత వరకు పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అంశానికి వెళ్లండి. దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి]
ప్రభువైన యేసయ్య, నేను జీవమును పొందుటకు మరియు నేను దానిని సమృద్ధిగా పొందుటకు నీవు వచ్చావు (యోహాను 10:10)
నా శరీరం పరిశుద్ధాత్మ ఆవలయము. దేవుని ఆత్మ నాలో నివసిస్తుంది మరియు నా శరీరంలోని ప్రతి భాగానికి జీవాన్ని ఇస్తుంది. అందువల్ల అనారోగ్యం, వ్యాధి, బలహీనత, నొప్పి మరియు ఇన్‌ఫెక్షన్‌లకు నా శరీరంలో స్థానం లేదు. యేసు నామంలో.
క్రీస్తు నన్ను శాపం నుండి విమోచించాడు. కావున, ఈ దేహమునకు ఏ రోగము లేదా వ్యాధి రాకూడదని నేను నిషేధిస్తున్నాను. ఈ శరీరాన్ని తాకిన ప్రతి వ్యాధి, సూక్ష్మక్రిమి మరియు ప్రతి వైరస్ యేసు నామంలో తక్షణమే చనిపోవును గాక.
ఈ శరీరం యొక్క ప్రతి అవయవము మరియు ప్రతి కణజాలం పని చేయడానికి దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయును గాక, మరియు నేను యేసు నామంలో ఈ శరీరంలో ఉన్న లోపాన్ని నిషేధిస్తున్నాను. (గలతీయులకు 3:13: రొమీయులకు 8:11, ఆదికాండము 1:31: మత్తయి 16:19)
(మీరు చెప్పినట్లుగా శరీరంలోని ఆ భాగాలను ముట్టండి)
నేను యేసు నామంలో నా తల వెంట్రుకలలో దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా కంటిలో దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా చెవులలో దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా ముక్కులో దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా నోటిలో దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా దంతాలు మరియు చిగుళ్ళలో దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా శరీరంలోని ప్రతి కణంలోకి దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా శరీర రక్తంలోకి దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా శరీర ఎముకలలో దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా శరీరం యొక్క చర్మంలోకి దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా శరీరంలోని ప్రతి అవయవంలోకి దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
నేను యేసు నామంలో నా శరీరంలోని ప్రతి సిర, నరాలు మరియు ధమనిలో దేవుని జీవాన్ని పలుకుతున్నాను.
(మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే, శరీరంలోని ఆ భాగంపై మీ చేతులు ఉంచి, ఈ క్రింది విధంగా పలకండి)
నేను దేవుని జీవాన్ని నా ……. (శరీర భాగము యొక్క పేరు పలకండి) యేసు నామంలో పలుకుతున్నాను.
నేను దేవుని జీవాన్ని……….... [మీ కుటుంబ సభ్యుల పేర్లను ఉపయోగించండి] యేసు నామంలో పలుకుతున్నాను.
(మీరు క్రింది ప్రార్థన అంశములను చెప్పేటప్పుడు కూడా మీ ఛాతీపై ఒక చేయి వేయండి)
1. నా శరీరం నుండి ప్రతి విషాన్ని యేసు నామంలో అగ్ని ద్వారా ఖాళైపొవును గాక.
2. యేసు నామంలో నా జీవితం నుండి ప్రతి సాతాను నాటిన సమస్తము వినాశనం అవును గాక.
3. నా జీవితంలో నాటిన ప్రతి చెడు విత్తనం యేసు నామంలో వినాశనం అవును గాక.
4. ప్రతి సాతాను నిక్షేపం నా జీవితం మరియు శరీరం నుండి యేసు నామంలో మరియు యేసు రక్తం ద్వారా తొలగించబడును గాక.
5. తండ్రీ, యేసు నామంలో, ఈ 21 రోజుల ప్రార్థన కార్యక్రమంలో భాగమైన ప్రతి వ్యక్తిలో నేను దేవుని జీవాన్ని పలుకుతున్నాను. దేవా వారిని స్వస్థపరచు. (దీని కొరకు కొంత సమయం వెచ్చించండి)
మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, అతనికి లేదా ఆమెకు నూనెతో అభిషేకించి మరియు పైన పేర్కొన్న ప్రార్థన అస్త్రములను ఉపయోగించి వారి కొరకు ప్రార్థించండి.
దేవుని స్తుతిస్తూ మరియు ఆరాధిస్తూ యెగ్యమైన సమయాన్ని వెచ్చించండి.
Join our WhatsApp Channel
Most Read
● మీ ప్రపంచానికి ఆకారం ఇవ్వడానికి మీ తలంపును ఉపయోగించండి● ఇతరులకు ప్రకవంతమైన దారి చూపుట
● మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు
● చిన్న విత్తనం నుండి పెద్ద వృక్షము వరకు
● ఎవరికీ రోగనిరోధక శక్తి లేదు
● మీ బాధలో దేవునికి లోబడియుండుట గురించి నేర్చుకోవడం
● శపించబడిన వస్తువును తీసివేయుడి
కమెంట్లు