అనుదిన మన్నా
20 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
Saturday, 30th of December 2023
0
0
816
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
స్థాయిలో మార్పు
యెహోవా మిమ్మును మీ పిల్లలను
వృద్ధిపొందించును. (కీర్తనలు 115:14)
చాలా మంది ప్రజలు చిక్కుకున్నారు; వారు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు కానీ వారిని వెనుకకు ఉంచుతున్నది ఏమిటో గుర్తించలేక పోతున్నారు. నేడు, ఆ అదృశ్య అవరోధం యేసు నామములో నాశనం అవును గాక.
ముందుకు సాగడానికి దేవుడు మనల్ని సృష్టించాడు; మనము శాశ్వతంగా ఒకే చోట ఉండకూడదు. నీతిమంతుల మార్గం మరింత ప్రకాశవంతంగా మరియు వెలుగుగా తేజరిల్లును, ఇది స్థాయి మార్పును సూచిస్తుంది (సామెతలు 4:18)
స్థాయిలో బదిలీ అవసరమయ్యే వ్యక్తులు ఎవరు?
- చాలా కాలం పాటు అదే స్థితిలో ఉన్న ఎవరైనా.
- ఎవరైనా చాలా కాలం పాటు ప్రయోజనాలు మరియు ఆశీర్వాదాలను తిరస్కరింన వారు.
- నమ్మకంగా ఇతరులకు సేవ చేసిన వారు మరియు వారి పరిష్కారం కోసం దైవికంగా ఉన్న వారు.
- ఇతరులచే మోసపోయిన వారు.
- జీవితంలో వెనుక ఉన్నవారు.
- రాసిచ్చిన వారు.
- సహాయకుడు లేని వారు.
- కష్టపడుతూ, శ్రమించే వారు.
- భూమి మీద దేవుని రాజ్యం విస్తరించాలనే ఆశ కలిగి ఉన్నవారు.
స్థాయిలో మార్పును అనుభవించిన వారి యొక్క ఉదాహరణలు
1. మొర్దెకై
మొర్దెకై స్థితి రాత్రికి రాత్రే మార్పు చెందింది; అది అతడు కూడా ఊహించని సంగతి; అది దైవికమైనది. (ఎస్తేరు 6:1-12, 9:3-4 చదవండి)
2. ఎలీషా
ఏలీయా నుండి పడిపోయిన వస్త్రము మరియు ఆత్మలో రెండుపాళ్లు ఎలీషా యొక్క ఆధ్యాత్మిక స్థాయిని మార్చింది. అతని స్థాయి మారిందని గమనించిన ప్రవక్త కుమారులు వచ్చి ఆయనకు నమస్కరించారు. (2 రాజులు 2:9-15 చదవండి)
3. దావీదు
గోలియాతు ఓటమి దావీదు స్థాయిని మార్చడానికి దారితీసింది. జీవిత యుద్ధాలు మిమల్ని నాశనం చేయడానికి కాదు; స్థాయి మార్పు కోసం అవి మిమ్మల్ని ప్రకటించడానికి ఉన్నవి.
ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను. (1 సమూయేలు 18:2)
కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని. (2 సమూయేలు 7:8)
4. పౌలు
సంఘాన్ని భయపెట్టిన పౌలు, స్థాయిలో మార్పును అనుభవించాడు మరియు దేవుని రాజ్యానికి అపొస్తలుడయ్యాడు. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని. (1 తిమోతి 1:16)
5. యోసేపు
యోసేపు మానవ ప్రమాణాల ప్రకారం యోగ్యత లేని స్థితికి ఎదిగాడు. ఒక అసాధారణమైన దేశములో, దేవుడు అతన్ని అధిపతిగా నియమించాడు. (ఆదికాండము 41:14-46 చదవండి)
స్థాయిలో మార్పును ఎలా అనుభవించాలి
దేవుడు ప్రతి ఒక్కరి స్థాయిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన తన వాక్య ప్రకారం మాత్రమే కార్యం చేస్తాడు. స్థాయిలో మార్పును అనుభవించాలనుకునే ఎవరైనా తప్పనిసరిగా ఉల్లంఘించకూడని నిర్దిష్ట సిధ్ధాంతాలు ఉన్నాయి. లేఖనములో స్థాయిలో మార్పును ఆనందించే వ్యక్తులు ఈ సిధ్ధాంతాలను వివిధ సమయాలలో ప్రదర్శించారు. ప్రధాన సిధ్ధాంతాలను చూద్దాం.
1. చిత్తశుద్ధితో జీవించుట
దేవుడు దావీదును ఎన్నుకున్నాడు మరియు అతడు యథార్థత కలిగిన వ్యక్తి కాబట్టి అతని స్థాయిని మార్చాడు.
అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను
కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను. (కీర్తనలు 78:72)
2. దేవుని యందు భయభక్తితో జీవించుట
దేవుని భయమే జ్ఞానానికి నాంది. దేవుని భయం మిమ్మల్ని స్థాయిలో మార్పు కోసం ఉంచుతుంది. యోసేపు శోధించబడ్డాడు, మరియు అతడు పరీక్షలో విఫలమైనట్లైతే, అతడు రాజభవనానికి చేరుకునే వాడు కాదు. మీరు పాపపు సుఖాలతో శోదించబడతారు; మీరు స్థాయిలో మార్పును కోరుకుంటే దేవుని భయం మీ హృదయాన్ని ఆదేశించాలి లేదా పరిపాలించాలి. (ఆదికాండము 39:9)
3. స్థాయిలో మార్పు కోసం ప్రార్థించండి
మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు మీ స్థాయిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
9 యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను. 10 యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను. (1 దినవృత్తాంతములు 4:9-10)
4. మీకు దేవుని కటాక్షము అవసరము
పోటీకి వచ్చిన ఇతర స్త్రీల కంటే ఆమె ఎక్కువ అనుగ్రహాన్ని పొందింది కాబట్టి ఎస్తేరు స్థాయి మారిపోయింది. కటాక్షము స్థాయిలో మార్పుకు మీకు అర్హతను ఇస్తుంది.
17 స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను. (ఎస్తేరు 2:17)
5. దేవునితో నిజమైన బంధమును కలిగి ఉండండి
మోషే దేవునితో ఎదుర్కొన్న సమావేశము అతని స్థితిని మార్చింది. మోషే ఫరో నుండి అరణ్యానికి పరుగెత్తాడు, కానీ అతడు దేవునితో కలుసుకున్నప్పుడు, అతడు ఫరోకు దేవుడయ్యాడు. (నిర్గమకాండము 3:2, 4-10 చదవండి)
6. ఇతరుల సమస్యకు పరిష్కారం చూపండి
యోసేపు స్థాయిలో మార్పును అనుభవించాడు ఎందుకంటే అతడు ఫరో మరియు ఐగుప్తుకు పరిష్కారంగా ఉన్నాడు. మీరు స్థాయిలో మార్పును ఆస్వాదించాలనుకుంటే ఇతరుల జీవితాలకు విలువను జోడించండి.
7. జ్ఞానము కలిగి ఉండండి
జ్ఞానమే ప్రధానమైనది, సొలొమోను అడిగాడు. దేవుడు సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానం అతని స్థాయిని మార్చింది. (1 రాజులు 3:5-15)
దేవుడు ఎప్పుడైనా ఎవరి స్థాయిని అయినా మార్చగలడు, దేవుని వదులుకోవద్దు. ఆయనను నమ్మకంగా సేవించండి, సరైన సమయంలో, ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రా
1. దేవా, నీ శక్తితో, యేసు నామములో స్థాయిలో మార్పును అనుభవించేలా చేయి. (కీర్తనలు 75:6-7)
2. తండ్రీ, ఈ 40 రోజుల ఉపవాసంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి వెళ్లాలని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. (యెషయా 40:31)
3. యేసు నామములో వైఫల్యం యొక్క ఆత్మను నేను తిరస్కరిస్తున్నాను. (ఫిలిప్పీయులకు 4:13)
4. యేసు నామములో నా శ్రమలన్నిటిలో ఫలవంతముగా ఉండుటకు నేను కృపను పొందుచున్నాను.
(యోహాను 15:5)
5. యేసు నామములో నేను వ్యర్థముగా శ్రమపడను. నా ప్రియమైనవారు కూడా వ్యర్థంగా శ్రమించరు. (యెషయా 65:23)
6. తండ్రీ, యేసు నామములో నా తదుపరి స్థాయికి మీరు సిద్ధం చేసిన వారితో నన్ను జతపరచు. (సామెతలు 16:9)
7. తండ్రీ, యేసు నామములో నా తదుపరి స్థాయి కోసం నాకు అభివృద్ధి యొక్క ఆలోచనలను దయచేయి. (యాకోబు 1:5)
8. యేసు నామములో మలుపు సాక్ష్యం కోసం నేను తాజా పరిజ్ఞానము పొందుతున్నాను. (రోమీయులకు 12:2)
9. తండ్రీ, యేసు నామములో నా కోసం అభివృద్ధి యొక్క నూతన ద్వారములను తెరువు. (ప్రకటన 3:8)
10. యేసు నామములో ఆర్థిక అభివృద్ధి కొరకు నేను కృపను పొందుతున్నాను. (3 యోహాను 1:2)
11. తండ్రీ, యేసు నామములో నా కొరకు అంతర్జాతీయ ద్వారములను తెరువు. (అపోస్తుల కార్యములు 16:9)
Join our WhatsApp Channel
Most Read
● దేవుణ్ణి స్తుతించడానికి వాక్యానుసారమైన కారణాలు● పరిపక్వత బాధ్యతతో మొదలవుతుంది
● అడ్డు గోడ
● ప్రభావం యొక్క గొప్ప పరుధులకు మార్గం
● శూరుల (రాక్షసుల) జాతి
● సమయాన్ని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి
● ఒక మాదిరిగా (ఉదాహరణ) ఉండండి
కమెంట్లు