english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. జీవన నియమావళి
అనుదిన మన్నా

జీవన నియమావళి

Sunday, 16th of January 2022
3 0 1123
Categories : అభివృద్ధి (Progress) లక్ష్యం (Goal)
కొత్త సంవత్సరం 2022 ప్రారంభమైంది. వేడుకలు జరిగాయి మరియు పోయాయి, మరియు ఇప్పుడు వాస్తవికత స్థిరపడుతోంది. మనలో చాలా మంది ఈ సంవత్సరం 2022 గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. అలా మీరు కూడా కోరుకునట్లైతే, ఇది చదవండి.

మీ వ్యక్తిగత ఎదుగుదలకు లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా కీలకమని నేను నమ్మడానికి ఇక్కడ రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

#1: లక్ష్యాలు మీకు ఏకాగ్రతను ఇస్తాయి
లక్ష్యాన్ని ఇవ్వకుండా బాణం వేయడం గురించి ఒకసారి ఆలోచించండి. గోల్ పోస్ట్ లేకుండా ఫుట్‌బాల్ ఆడడం లేదా బాస్కెట్ లేకుండా బాస్కెట్‌బాల్ ఆడడం గురించి ఆలోచించండి? ఇది మీ సమయం మరియు శక్తిని వృధా చేయడం అర్థరహితముగా ఉంటుంది. ఇది ఏ నిర్దిష్ట ఫలితాలను కూడా ఉత్పత్తి చేయదు.

నిన్ననే, నేను చాలా ప్రభావవంతమైన వ్యాపారవేత్తతో మాట్లాడుతున్నాను మరియు అతను ఇలా అన్నాడు, "నీవు ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంటే, కనీసం నీవు పైకప్పునైన పొందుకుంటావు" ఒక లక్ష్యాన్ని కలిగి ఉండటం వలన మీరు మీ సమయాన్ని మరియు ప్రయత్నాలను సరైన దిశలో కేంద్రీకరించేలా చేస్తుంది.

కింది లేఖనాన్ని పరిశీలించండి:
మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కుల బెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. (హెబ్రీయులకు 12:2)

ప్రభువైన యేసు భూమిపై సాధించవలసిన లక్ష్యాలను కలిగి ఉన్నాడు మరియు దీని కారణంగా, ఆయన చాలా ఏకాగ్రతతో జీవించాడు.

అపొస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చాడు, "ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము" (కొలొస్సయులకు 1:28).

అపొస్తలుడైన పౌలు యొక్క జీవిత లక్ష్యం ప్రతి మనుష్యునిక్రీస్తులో సంపూర్ణంగా నిలువబెట్టి చూపించడమే, అందుకే అతను కూడా ఏకాగ్రతతో కూడిన జీవితాన్ని గడిపాడు.
#2: లక్ష్యాలు మీరు ప్రగతిని కొలవడానికి అనుమతిస్తాయి
మీ కోసం లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా, మీరు మీ ప్రగతిని కొలవగలుగుతారు ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ సరిపోల్చడానికి స్థిరమైన ముగింపు లేదా నిర్దిష్టాంశం కలిగి ఉంటారు.

అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు, "నేనైతే మరి యొకని పునాది మీద కట్టకుండు నిమిత్తము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని." (రోమీయులకు ​​15:20)

ఇది అపొస్తలుడైన పౌలు తన మనస్సును ఏర్పరచుకున్న లక్ష్యాల గురించి మనకు ఒక ఆలోచనను ఇస్తుంది. ఆ తర్వాత, ఆ లక్ష్యాలకు సంబంధించి తాను సాధించిన అభివృద్ధి గురించి మనకు తెలియజేస్తున్నాడు.

కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల నున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను. (రోమీయులకు ​​15:19)

ఈ సంవత్సరం 2022లో మీరు కలిగి ఉండవలసిన లక్ష్యాలలో ఒకటి, బైబిలును ఆదికాండము నుండి ప్రకటన వరకు పూర్తిగా చదవడం. ఇది ఖచ్చితంగా సాధించదగినది మరియు మీ విశ్వాస నడకలో మీకు అద్భుతంగా సహాయం చేస్తుంది.
దీన్ని చేయడానికి సులభమైన మార్గం నోహ్ యాప్‌లో 365 రోజుల బైబిలు పఠన ప్రణాళికను అనుసరించడం (ప్రధాన మెనూలో బైబిలు అధ్యయనం పై క్లిక్ చేయండి). నేను సంవత్సరాలుగా వందల మంది నాయకులకు శిక్షణ ఇవ్వడానికి ఈ పద్ధతిని ఉపయోగించాను మరియు ఇది పని చేస్తుంది.
అయితే, చాలా మంది తాము చదివినవి గుర్తుండవని, అందుకే బైబిలు చదవడం మానేశారని చెబుతూ నాకు వ్రాస్తారు. మన బలహీనతలు మనకు తెలిసిన దానికంటే మన ప్రభువుకు బాగా తెలుసు.

యేసు ప్రభువు ఏమి చెప్పాడో ఒకసారి గమనించండి: "ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును." (యోహాను 14:26)

పరిశుద్ధాత్మ మీకు బోధించడమే కాకుండా, మరచిపోయిన గ్రంథాలు, కథలు మొదలైనవాటిని మీ జ్ఞాపకార్థం కూడా తీసుకువస్తాడు. మీరు బైబిలును శ్రద్ధగా చదవడం ప్రారంభించినప్పుడు, మీ ఆత్మీయ మనిషి ఒక విధమైన ఖజానాగా (నిల్వచేయు) మారతాడు, దాని నుండి మీకు తెలియని విషయాలను పరిశుద్ధాత్మ బయటకు తీస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీకు చాలా అవసరమైనప్పుడు ఆయన దానిని బయటకు తీస్తాడు.

ప్రార్థన
తండ్రీ, నీవు నన్ను ఒక ఉద్దేశ్యం మరియు ప్రణాళిక కోసం సృష్టించినందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు మహిమ మరియు ఘనతను తెచ్చే విధంగా ఏకాగ్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి నాకు సహాయం చేయి. నా జీవితానికి సంబంధించిన నీ ప్రణాళిక మరియు ఉద్దేశ్యాన్ని నేను నెరవేర్చులాగున ఆత్మ-నడిపింపు గల లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలో దయచేసి నాకు నేర్పు. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● మీరు వారిని ప్రభావితం చేయాలి
● క్రీస్తులాగా మారడం
● 12 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మంచి మనస్సు ఒక బహుమానం
● ఒక కలలో దేవదూతలు అగుపడటం
● ఉత్తమము మంచి వాటికి శత్రువు
● డబ్బు స్వభావాన్ని పెంపొందిస్తుంది
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్