english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ప్రవచనాత్మక మధ్యస్త్యం అంటే ఏమిటి?
అనుదిన మన్నా

ప్రవచనాత్మక మధ్యస్త్యం అంటే ఏమిటి?

Saturday, 13th of July 2024
0 0 483
Categories : ప్రవచనాత్మక (Prophetic) మధ్యస్త్యం (Intercession)
యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. (ఆదికాండము 29:20)

రాహేలు పట్ల యాకోబుకు ఉన్న ప్రేమ సంవత్సరాలు కొద్ది దినములుగా అనిపించింది. మన ప్రార్థనలు, మన మధ్యస్త్యం విధి ఆధారిత జీవితం నుండి బయటికి వెళ్లినప్పుడు, అవి ప్రవచనాత్మక సువాసనను కలిగి ఉంటాయి.

దేవుడు శక్తివంతంగా ఉపయోగించిన లేఖనాలలో దేవుని స్త్రీపురుషుల జీవితాన్ని మీరు అధ్యయనం చేస్తే, వారందరూ ఆయన నుండి సమాచారాన్ని వినడానికి, చూడటానికి మరియు స్వీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని మీరు చూస్తారు. దావీదు యొక్క ఉదాహరణను తీసుకుందాం. అతను ఎదుర్కొన్న దాదాపు అన్ని యుద్ధాలలో అతను విజయం సాధించాడు. రహస్యం ఏమిటంటే, యుద్ధం ప్రారంభమయ్యే ముందు దావీదు ప్రార్థించినప్పుడు, యుద్ధం గురించి ముందుగానే అతనికి కీలకమైన సమాచారం అందుతుండేది.

నాతో పాటు 1 సమూయేలు 30:8 వచన్నాని తెరవండి, "నేను ఈ దండును తరిమిన యెడల దాని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెల విచ్చెను."

ఈ లేఖనంలో, దేవుని దాసుడు దావీదు ప్రార్థనలో ప్రభువును ఎంతో ఆసక్తిగా వెతుకుతున్నాడని మరియు తరువాత యుద్ధం గురించి ప్రభువును విచారించడాన్ని మనం చూస్తాము. అప్పుడు యెహోవా దావీదు చేయవలసిన దానితో స్పందిస్తాడు. దావీదు నిర్దేశించినట్లే చేసాడు.

ప్రవచనాత్మక మధ్యస్త్యం దైవిక మధ్యస్త్యం మీద ఆధారపడి ఉంటుంది, ఇది ప్రార్థన మరియు ఆరాధనలో దేవుని ఆసక్తిగా కోరిన ఫలితంగా వస్తుంది. ఇది మధ్యవర్తిత్వం చేసేటప్పుడు యెహోవాను ఆసక్తిగా ప్రార్థన ద్వారా వినడం జరుగుతుంది.

నేను పాత రోజుల్లో తిరిగి గుర్తుంచుకున్నాను, డయల్‌ను ముందుకు వెనుకకు తిప్పడం రేడియో స్టేషన్‌లోకి ట్యూన్ చేయడానికి ప్రయత్నించడం లేదా స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి వీడియో రికార్డర్‌లో ట్రాకింగ్‌ను మార్చడం. అదేవిధంగా, మన ఆధ్యాత్మిక కళ్ళు మరియు చెవులను దేవునితో ట్యూన్ చేయడం నేర్చుకోవాలి, తద్వారా ఆయన మనకు ఏమి చెబుతాడో వినవచ్చు మరియు స్పష్టంగా చూడవచ్చు.

మేము మధ్యస్త్యం చేస్తున్న అంశంపై దైవిక మధ్యస్త్యం కోరడం ప్రవచనాత్మక మధ్యస్త్యం.

కీర్తనల గ్రంథము 53 : 2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనిదేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు అందించే అవగాహనతో మనం వెతుకుతున్నప్పుడు, మధ్యస్త్యం ఇకపై కేవలం మతపరమైన చర్యగా మారదు. దేవుడు కోరుకునేది ఇదేనని గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సంఘానికి, దేశానికి లేదా మన కుటుంబానికి మధ్యస్త్యం వహించినా, మనము ఆయన చిన్న స్వరాని సున్నితంగా వినగలం.

మనం మధ్యస్త్యం చేస్తున్న ఒక విషయానికి సంబంధించిన సమాచారం కలలు, దర్శనాలు మరియు ఆత్మ నుండి సూక్ష్మ ముద్రల ద్వారా లేదా పరిశుద్ధాత్మ  హైలైట్ చేసిన ద్వారా కూడా రావచ్చు. సమూహ నేపధ్యంలో, మనము యెహోవా నుండి సమాచారాన్ని స్వీకరించినప్పుడు, మనం దానిని మాట్లాడకూడదు. మనం చూసిన లేదా అందుకున్న విషయాలను నిశ్శబ్దంగా నాయకుడికి తెలియజేయాలి. ఇక్కడే వినయం కనిపిస్తుంది. చాలా మంది చూడాలని, వినాలని కోరుకుంటారు. అహంకారం ఇక్కడే ఉంటుంది.

ప్రవచనాత్మక మధ్యస్త్యం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, మనం మధ్యస్త్యం చేస్తున్న విషయంలో ఆయన చిత్తాన్ని స్థాపించడం.
ప్రార్థన
తండ్రీ, నిన్ను హృదయపూర్వకంగా వెతకడానికి నాకు నీ కృపను ఇవ్వు. చూడటానికి మరియు వినడానికి నా కళ్ళు మరియు చెవులు తెరువు. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ప్రేమ గల భాష
● వాక్యం యొక్క సమగ్రత
● 24వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఇది సాధారణ అభివందనము కాదు
● 18 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కృప ద్వారా రక్షింపబడ్డాము
● రాజ్యంలో వినయం మరియు ఘనత
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్