అనుదిన మన్నా
0
0
167
మనస్సులో నిత్యత్వముతో జీవించడం
Friday, 10th of January 2025
Categories :
దు:ఖం (Grief)
ప్రార్థన తర్వాత, నేను ఒక రాత్రి పడుకున్నప్పుడు, మా టీమ్ సభ్యుడి కుమార్తె నుండి, "పాస్టర్ గారు, దయచేసి ప్రార్థించండి, మా నాన్న చనిపోతున్నారు, వైద్యులు ఆశను వదులేశారు" అని నాకు మయిమరిచిన కాల్ వచ్చింది. నేను షాక్ అయ్యాను మరియు నిరాశతో ప్రార్ధించడానికి మోకాళ్లపై వెళ్లాను. అప్పుడు "పాస్టర్ గారు, నాన్న ఇక లేరు" అని భంగపరుచే కాల్ వచ్చింది.
మరొక రోజు, నేను ఈ అపురూప సోదరుడిని మరియు అతని కుటుంబాన్ని కలుసుకున్నాను, మేము ఎంతో అద్భుతమైన సహవాసం కలిగి ఉన్నాము. ఈ సోదరుడు మరియు నేను, పుస్తకాలు మరియు సంగీతాన్ని ఇష్టపడేవాలము మరియు మేము దానిని కొనసాగించాము. ఇప్పుడు అతను లేడని వినడానికి - నేను జీర్ణించలేకపోతున్నాను. ఈరోజు కూడా నేను అతడిని తీవ్రంగా మిస్ అవుతున్నాను.
యోహాను 11:35 మనకు సెలవిస్తుంది, "యేసు కన్నీళ్లు విడిచెను"
యేసయ్య కూడా తాను ప్రేమించిన వ్యక్తుల మరణంతో వ్యవహరించాల్సి వచ్చింది. యేసయ్య తన స్నేహితుడు లాజరు గురించి ఏడ్చినట్లే, మన దు ఖంలో ఆయన కూడా మనతో ఏడుస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుంది.
జీవితం ఎంత క్షణభంగురముగా మరియు క్షణికంగా ఉంటుందో అలాంటి క్షణాల్లోనే మనం గ్రహించగలము. లేఖనం ఈ సత్యాన్ని గుర్తు చేస్తుంది:
"ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు,
వారి అంద మంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
గడ్డి ఎండును దాని పువ్వును రాలును,
అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే." (1 పేతురు 1:24-25)
అదే సమయంలో, ఈ లోకంలో మన జీవితం కొంత కాలమే, కానీ క్రీస్తులో మన జీవితం శాశ్వతమైనదని మనం మర్చిపోకూడదు.
ఈ లోకంలో విషయాలు గతించిపోతున్నాయి. మనం నిత్యత్వం మీద అనుకోని ఉండాలి. మనం నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకుని జీవితాన్ని గడపాలి. మీ సమయం మరియు మీరు దానిని ఎలా గడుపుతున్నారో అనే ప్రణాలికను చేసుకొనండి.
కీర్తనకారుడు చేసిన కట్టుబాట్లలో ఒకదాన్ని చూడండి: "నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. (కీర్తనలు 146:2) దేవుని ఆరాధించడానికి ప్రతిరోజూ సమయాన్ని వెచ్చించండి ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు. ఒక రోజు, మనమందరం ఆయనని ముఖాముఖిగా చూస్తాము.
Bible Reading : Genesis 30 - 31
ప్రార్థన
తండ్రీ, జీవిత బహుమానానికి వందనాలు. యేసయ్య నా కోసం కొనుగోలు చేసిన ఉచిత రక్షణ బహుమానం కోసం కూడా నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను.ప్రతిరోజు మనస్సులో నిత్యత్వముతో జీవించడానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో. ధన్యుడగు పరిశుద్ధాత్మ, నీవు నిజంగా మాకు ఓదార్పునిచ్చువాడవు. బాధతో, నొప్పితో మరియు దుఃఖంతో ఉన్న ప్రతి ఒక్కరినీ ఓదార్చు.
Join our WhatsApp Channel

Most Read
● ఆయన తరచుదనానికి అనుసంధానం (ట్యూనింగ్) అవ్వడం● శత్రువు రహస్యంగా ఉంటాడు
● ఎవరికీ రోగనిరోధక శక్తి లేదు
● మొలకెత్తిన కఱ్ఱ
● మారని సత్యం
● ఆరాధన యొక్క పరిమళము
● ప్రతిఫలించడానికి సమయాన్ని వెచ్చించడం
కమెంట్లు