అనుదిన మన్నా
పరలోకపు ద్వారములను తెరవండి & నరకపు ద్వారములను మూసేయండి
Tuesday, 18th of April 2023
1
0
751
Categories :
Fasting and Prayer
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను." (కీర్తనలు 42:1-3)
దావీదు మానసిక అలజడికి లోనయ్యాడు, అక్కడ అతడు తినే ఏకైక జీవనాధారం అతని చెంపల మీదుగా మరియు అతని నోటిలోకి కనికరం లేకుండా ప్రవహించే కన్నీళ్లే. స్పష్టంగా, దావీదు ఉపవాసం ఉన్నాడు.
ప్రభువుతో ఒకరి సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఉపవాసం చాలా కాలంగా శక్తివంతమైన సాధనంగా పరిగణించబడుతుంది. నిర్ణీత వ్యవధిలో ఆహారాన్ని మానుకోవడం ద్వారా, వ్యక్తులు తమ ఆత్మను లోకములోని పరధ్యానాలు మరియు శారీరిక ఆందోళనల నుండి విముక్తి చేయవచ్చు, ఫలితంగా ఆధ్యాత్మిక సుతిమెత్తనితనం పెరుగుతుంది. దావీదు ఈ శక్తివంతమైన పరివర్తనను చవిచూశాడు, అందువలన అతడు కీర్తనలు 42:7 వ్రాశాడు: "కరడు కరడును పిలుచుచున్నది."
దేవునితో లోతైన బంధం కోసం దావీదు యొక్క ఆధ్యాత్మిక కోరిక ఆహారం మరియు జీవనోపాధి కోసం అతని శారీరిక అవసరాలను అధిగమించింది. తత్ఫలితంగా, అతడు తన పరీక్షల మధ్య కూడా తన ఆత్మ యొక్క లోతు నుండి దేవుని లోతు వరకు కేకలు వేయగల ప్రదేశానికి చేరుకున్నాడు.
ఉపవాసం పరలోకపు యొక్క ఆశీర్వాదాలను తెరచి మరియు నరకం యొక్క ద్వారాలను మూసివేయడానికి శక్తివంతమైన తాళపు చెవి చాలా కాలంగా గౌరవించబడింది. ఈ పురాతన క్రమశిక్షణను అభ్యసించడం ద్వారా, వారి జీవితంలో ఒక అవకాశం, అద్భుతమైన సదుపాయం, దైవ అనుగ్రహం మరియు దేవుని యొక్క సున్నితమైన, ప్రేమతో కూడిన స్పర్శ యొక్క తెరచిన ద్వారములను పొందవచ్చు.
కుటుంబాలను మరియు దేశాలను నాశనం చేసే ప్రమాదం ఉన్న ప్రస్తుత ప్రపంచ కరువు కారణంగా, ఉపవాస ప్రార్థనను ప్రకటించమని ప్రభువు నన్ను నిర్దేశిస్తున్నట్లు నేను భావిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన ప్రతి వారం మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. (మంగళవారం, గురువారం మరియు శనివారం) ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కరుణా సదన్‌తో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక వృద్ధి కోసం. (ప్రత్యక్షంగా ప్రసారం చూడటం, నోహ్ యాప్‌లో అనుదిన మన్నా చదవడం మొదలైనవి). అలాగే, ఈ ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, అనుసంధానించబడిన ప్రజలందరూ వారి ఆర్థిక, ఉద్యోగాలు మొదలైన వాటిలో అలౌకికంగా ఆశీర్వదించబడతారు.
నాతో కలసి పాల్గొనండి, తద్వారా మనం కలిసి ఆత్మలో నూతన స్థాయిలలోకి ప్రవేశిస్తాము.
ఉపవాస సమయం 00:00 గంటలు (అర్ధరాత్రి 12 గంటలు) మరియు ప్రతిరోజూ 14:00 గంటలకు (మధ్యాహ్నం 2 గంటలు) ముగుస్తుంది. ఈ కాలంలో వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మీరు మీ సాధారణ భోజనం తీసుకోవచ్చు. ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు మీకు వీలైనంత వరకు దేవుని వాక్యాన్ని చదవండి.
మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సూచనలు ఉంటే నాకు తెలియజేయండి. అలాగే, మీరు ఈ ఉపవాసంలో నాతో పాటు పాల్గొనట్లైతే దిగువ కామెంట్ విభాగంలో నాకు తెలియజేయండి.
గుర్తుంచుకోండి, ఏ పరిస్థితిలోనైనా ప్రభువు తన ప్రజలను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాడు. దావీదు ఇలా సెలవిచ్చాడు, "నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు" (కీర్తనలు 37:25).
ప్రార్థన
తండ్రీ నా పట్ల మరియు నా కుటుంబం పట్ల నీకున్న ఎనలేని ప్రేమకై నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను.
తండ్రీ నీవు నాకు మరియు నా ఇంటివారి పట్ల చూపిన సమస్త కృపకై నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను.
(ప్రభువుకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతూ కొంత సమయం గడపండి)
ప్రభువా, యేసు నామములో, నన్ను మరియు నా కుటుంబ సభ్యులను భక్తిహీనమైన వాటి నుండి వేరు చేయు.
తండ్రీ, యేసు నామములో, నాపై, నా కుటుంబ సభ్యులపై మరియు కరుణ సదన్ పరిచర్యలో పాల్గొనే ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించు
Join our WhatsApp Channel
Most Read
● సర్వశక్తిమంతుడైన దేవునితో కలుసుకోవడం● మరచిపోవడం యొక్క ప్రమాదాలు
● 03 రోజు: 21 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆధ్యాత్మిక గర్వము యొక్క ఉచ్చు
● ఆర్థిక గందరగోళం నుండి ఎలా బయటపడాలి # 2
● తప్పుడు ఆలోచనలు
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #13
కమెంట్లు