అనుదిన మన్నా
21 రోజుల ఉపవాసం: వ రోజు #13
Friday, 24th of December 2021
3
1
991
Categories :
Fasting and Prayer
అలౌకికమైన ప్రతిఫలము
ఒప్పుకోలు (ప్రతి ఒక్కటిని బిగ్గరగా చెప్పండి)
1. నన్ను బలపరచు క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను. (ఫిలిప్పీయులకు 4:13)
2. నేనైతే క్రీస్తు మనస్సును కలిగి యున్నాను. (1 కొరింథీయులకు 2:16.)
3. నా నడత యెహోవా చేతనే స్థిరపరచబడినది. (కీర్తనలు 37:23)
4. నేను దేవుని ప్రేమిస్తున్నాను, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి యున్నాను, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని నేను యెరుగుదును. (రోమీయులకు 8:28)
5. నేను వెలిచూపు వలన లేదా స్పందన వలన కాక విశ్వాసము వలననే నడుచు కొనుచున్నాను. (2 కొరింథీయులకు 5:7)
6. నేను గొఱ్ఱపిల్ల రక్తమును బట్టియు, నా సాక్ష్యమును బట్టియు అపవాదిని జయించియున్నాను గాని, మరణము వరకు నా ప్రాణమును ప్రేమించు వాడను కాను. (ప్రకటన 12:11)
7. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. (1 యోహాను 4:4)
8. దేవుని మహిమ కొరకు నేను చేయు కార్యమంతయు ఆశీర్వదించబడినది. (ద్వితీయోపదేశకాండము 28:12)
9. నేను దేవునికి లోబడియుండి, అపవాదిని ఎదిరిస్తాను, అప్పుడు వాడు నా యొద్ద నుండి పారిపోవును. (యాకోబు 4:7)
10. నేను అపవాదికి చోటు లేదా అవకాశం ఇవ్వను. (ఎఫెసీయులకు 4:27)
11. నేను క్రీస్తుయేసు నందు దేవుని నీతిని. (2 కొరింథీయులకు 5:21)
12. నా ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా నాకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. (1 కొరింథీయులకు 15:57)
ధ్యానించుటకు కొన్ని లేఖనాలు
జెకర్యా 1:18-20
హెబ్రీయులకు 11:1
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)
1. తండ్రీ దేవా, నీ శక్తివంతమైన సామర్థ్యముతో, యేసు రక్తంలోని శక్తితో, పరిశుద్దాత్మ యొక్క అగ్ని, యేసు నామంలో నాకు వ్యతిరేకంగా ప్రతి ఆటంకం కలిగించే ఆత్మలను చిందరవందర చేయి మరియు నాశనం చేయి.
2. నా జీవితం మీద ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా, వివాహ పరంగా మరియు విద్యాపరంగా చెడుగా చెప్పబడిన లేదా శాపం, నేను నిన్ను యేసు నామంలో విచ్ఛిన్నం చేస్తున్నాను.
3. సజీవం గల దేవుని ఆత్మ, లేచి, యేసు నామంలో ఇప్పుడే నన్ను దీవించబడిన స్థలానికి తీసుకెళ్ళు.
4. తండ్రీ దేవా, యేసు నామంలో నా దైవిక సహాయకులను జతపరచు, సరిదిద్దు మరియు నడిపించు.
5. సజీవం గల దేవుని ఆత్మ, లేచి, నా ముఖాన్ని కప్పి ఉంచే ప్రతి చెడు ముసుగును తొలగించు, తద్వారా నేను యేసు నామంలో స్పష్టంగా చూడగలను.
6. జీవితంలో జయం సాధించే శక్తి, ఇప్పుడే యేసు నామంలో నా మీదకు వచ్చును గాక.
7. చూచే మరియు వివేచించే శక్తి, ఇప్పుడే యేసు నామంలో నా మీదకు వచ్చును గాక.
8. జయించే శక్తి, ఇప్పుడే యేసు నామంలో నా మీదకు వచ్చును గాక.
9. దేవుని జ్ఞానానికి మించి తనను తాను పెంచుకునే ప్రతి ఆలోచన మరియు తలంపు, నేను నిన్ను యేసు యొక్క శక్తివంతమైన నామంలో తీసివేస్తున్నాను.
10. నా జీవితంలో దీర్ఘకాలంగా స్తంభించి ఉండే ప్రతి శక్తి, యేసు నామంలో చనిపోవును గాక.
11. నా జీవితంలో పేదరికాన్ని పొడిగించే ప్రతి శక్తి, యేసు నామంలో చనిపోవును గాక.
12. ఓ దేవా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం యేసు నామంలో నా ప్రతిఫలం అంచున ఉన్న ప్రతి అడ్డంకులను విచ్ఛిన్నం చేయును గాక.
13. నా ప్రతిఫలము చర్చించదగినది కాదు, నేను యేసు నామంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మరియు యేసు రక్తం ద్వారా ముందుకు కొనసాగుతున్నాను.
14. నా జీవితంలో, కుటుంబంలో, పరిచర్యలో, వివాహంలో ప్రవేశించడానికి మరియు కార్యం చేయడానికి సకలమైన ఆత్మ కోసం ద్వారమును తెరిచి ఉంచిన ప్రతి పాపానికి యేసు నామంలో నేను పశ్చాత్తాపపడి క్షమాపణ పొందుకుంటున్నాను.
15. ప్రభువా నీ అగ్నితో నా జీవితాన్ని పరిశుద్ధపరచుము.
16. యేసు నామంలో నీ పరిశుద్ధాత్మ ద్వారా నా జీవితంలో, నా కుటుంబం, నా వివాహం, నా సంతానం, నా సంఘం, నా దేశం, ప్రపంచంలో నీ అగ్నిని విడుదల చేయి.
17. ప్రభువా, యేసు నామంలో నీ పరిశుద్ధాత్మ అగ్నితో నాకు బాప్తిస్మమివ్వు. (పరిశుద్ధాత్మ మీకు కృపను ఇచ్చునంతంగా లేదా 5 నిముషాల పాటు భాషలలో ప్రార్థించండి)
Join our WhatsApp Channel
Most Read
● మీరు నిజమైన ఆరాధకులా● మీరు ప్రార్థిస్తే, ఆయన వింటాడు
● 21 రోజుల ఉపవాసం: 6# వ రోజు
● హన్నా జీవితం నుండి పాఠాలు
● మీరు ఎవరి సమాచారమును నమ్ముతారు?
● 21 రోజుల ఉపవాసం: 18# వ రోజు
● విధేయత ఒక ఆధ్యాత్మిక గుణము
కమెంట్లు