english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 21 రోజుల ఉపవాసం: వ రోజు #15
అనుదిన మన్నా

21 రోజుల ఉపవాసం: వ రోజు #15

Sunday, 26th of December 2021
1 0 827
ఇశ్రాయేలు, యెరూషలేము & తూర్పు మధ్యభాగము

దేవుడు ఇశ్రాయేలును "తన కనుపాపవలె" అని అంటున్నాడు, ఇది ప్రేమ యొక్క పదము (ద్వితీయోపదేశకాండము 32:10, జెకర్యా 2:8).
దేవుడు ఇశ్రాయేలును దీవించే దేశాలకు మరియు ప్రజలకు ఒక దీవెనను మరియు ఇశ్రాయేలును శపించేవారికి శాపాన్ని ఇస్తాడు (ఆదికాండము 12:2-3). నిజమైన బైబిలు సమృద్ధి కేవలం డబ్బు కలిగి ఉండటం కంటే ఎక్కువ, అది జీవితంలోని ప్రతి రంగంలో సమృద్ధి.

మీరు సమృద్ధి చెందడం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఇశ్రాయేలు కోసం ప్రార్థించాలి.

దేవుడు ఇశ్రాయేలును ఎన్నటికీ విడువడు మరియు చివరికి, ఇశ్రాయేలు సర్వశక్తిమంతుడైన దేవునిచే రక్షించబడుతుంది (మలాకీ 3:6, రోమీయులకు ​​11:1).
ప్రార్థన:
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)

1. తండ్రీ, యేసు నామంలో, నేను యెరూషలేము శాంతి కోసం ప్రార్థిస్తున్నాను. దాని గోడలలో శాంతి మరియు దాని రాజభవనాలలో సమృద్ధి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. యెరూషలేము  ఇశ్రాయేలు యొక్క అవిభక్త రాజధానిగా ఉండాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను.

2. ప్రభువా, తూర్పు మధ్యభాగము వారు రక్షింపబడాలని మరియు సత్యం యొక్క జ్ఞానం ప్రకారం వారి ఆసక్తి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

3. దేవా, ఇశ్రాయేలును దాని కష్టాలన్నిటి నుండి విడిపించుము. దేవా, దానితో నీ నిబంధనను జ్ఞాపకముచేసుకో మరియు దానిని శాశ్వతమైన నిబంధనగా స్థిరపరచుము. నేను ఇశ్రాయేలు మరియు తూర్పు మధ్యభాగము యొక్క శాంతి కొరకు ప్రార్థిస్తున్నాను.

4. తండ్రీ దేవా, యేసు నామంలో, ఇశ్రాయేలు ప్రజల మనస్సులు మరియు హృదయాల నుండి ప్రతి ముసుగును తొలగించు, తద్వారా వారు ప్రభువైన యేసును తమ నిజమైన మెస్సీయగా గుర్తిస్తారు.

5. తండ్రీ, మతపరమైన మరియు లౌకిక యూదుల మధ్య ఐక్యత మరియు శాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను, తద్వారా దేశములో మెస్సీయ యూదులు మరియు ఇతరుల మధ్య యేసు నామంలో శాంతి ప్రవహిస్తుంది.

6. తండ్రీ, యేసు నామమున, ఇశ్రాయేలు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయు వారిని లేపుము. యెరూషలేము గోడలపై ఎక్కువ మంది కాపలాదారులను ఉంచండి, నీవు యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు దాని ప్రాకారముల మీద ఎక్కువ కావలి వారిని ఉంచుము రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.

7. దయగల తండ్రీ, ఇశ్రాయేలు ప్రజల హృదయాలను వారి సైనిక శక్తి యొక్క రథాలు మరియు గుర్రాలపై కాక విమోచన కొరకు నీ నామంపై నమ్మకం ఉంచులాగున మార్చు.

8. తండ్రీ, యేసు నామంలో, ఇశ్రాయేలు వీధుల్లో కనీళ్ళు విడుచుట లేదా రోదన వినబడకూడదని నేను ప్రార్థిస్తున్నాను, కానీ అది ఆనందించాలని మరియు దాని ప్రజలు తమ దేశంలో ఆనందంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

9. తండ్రీ, యేసు నామంలో, ఇశ్రాయేలుపై హింసను ప్రేరేపించే వారి నాలుకలను నాశనం చేసి విభజించు.

10. తండ్రీ, భారతదేశం (మీ దేశం పేరు) మరియు ఇశ్రాయేలు స్నేహితులుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. భారతదేశపు ప్రజలు (మీ దేశం పేరు) యూదుల ప్రజలను ప్రేమించడానికి మరియు మెస్సీయ - ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని నేను బతిమాలుకొనుచున్నాను!
ప్రార్థన
ఒప్పుకోలు (దీన్ని బిగ్గరగా చెప్పండి)
నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను. 
దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు. (కీర్తనలు 102:13-14)


Join our WhatsApp Channel


Most Read
● 21 రోజుల ఉపవాసం: 2# వ రోజు
● ఇతరులతో శాంతియుతంగా జీవించండి
● ఇది సాధారణ అభివందనము కాదు
● నా దీపమును వెలిగించు ప్రభువా
● సరైన వాటి మీద దృష్టి పెట్టుట
● 11 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● సాధారణ పాత్రల ద్వారా గొప్ప కార్యము
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్