english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. క్షమించడానికి క్రియాత్మకమైన పద్ధతులు
అనుదిన మన్నా

క్షమించడానికి క్రియాత్మకమైన పద్ధతులు

Tuesday, 1st of February 2022
3 0 1449
Categories : క్షమాపణ (Forgiveness)
ఎవరైనా మనల్ని లేదా మనం ప్రేమించే వారిని బాధపెట్టినప్పుడు, ప్రతీకారం తీర్చుకోవడం మన సహజ స్వభావం. బాధ కోపానికి దారి తీస్తుంది. అహంకారం తిరిగి ఎలా పగ తీర్చుకోవాలో మనకు సూచనలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. అటువంటి దుర్భరమైన స్థితిలో, ఒక వ్యక్తి క్షమించడం ఎలా సాధ్యమవుతుంది?

నేను నిన్న చెప్పిన విధంగా, మనం ఎన్నటికీ చెల్లించలేని వెలను చెల్లించడానికి క్రీస్తు మన స్థానంలో మరణించాడు. దేవుడు మన తరపున ఆయన పరిపూర్ణ త్యాగాన్ని అంగీకరించాడు మరియు మన రుణాన్ని క్షమించాడు. సమస్త క్షమాపణలు ఈ సత్యంలో పాతుకుపోయాయి.

పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్షమాపణ:
క్షమాపణ అనేది సహజమైనది కాదు కానీ అలౌకికమైనది. ఇది దేవుని నుండి ప్రవహిస్తుంది మరియు దైవికమైనది. మన బలంతో మనం ఎవరినీ క్షమించలేము. మనం దానిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే చేయగలము.

ప్రార్థన ద్వారా క్షమాపణ:
"నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు మని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పున దేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు." (మత్తయి 5:43-45)

విశ్వాసం ద్వారా క్షమాపణ:
మనము చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచు కొనుచున్నాము. (2 కొరింథీయులకు 5:7)

దేవునికి సమస్తము తెలుసు, కానీ మనకు సమస్తము తెలియవు. ప్రస్తుతానికి, ఆయన సమస్తాన్ని చూస్తున్నప్పటికీ మనము మొత్తం పజిల్ యొక్క చిన్న చిత్రాన్ని మాత్రమే చూడగలము.

విశ్వాసం అంటే దేవుణ్ణి ఆయన వాక్యం ద్వారా విశ్వసించడం. ఆయన వాక్యం క్షమించమని చెబుతుంది; అందుకే నేను క్షమిస్తాను. చాలా సార్లు, ఇది నిజంగా నా సహజ మనస్సుకు అర్ధం కాదు. కాబట్టి మీరు గమనించగలరు, మనం మన బాధను, మన వేదనను మరియు న్యాయం మరియు నిరూపణ కోసం మన చిత్తాని ఆయనకు అప్పగించినప్పుడు, "ప్రభువా నీకు సమస్తము తెలుసు" అని చెప్పినప్పుడు క్షమాపణ మరియు విశ్వాసం రెండూ కలుస్తాయి.

వినయం ద్వారా క్షమాపణ:
కాగా, దేవునిచేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. (కొలొస్సయులకు 3:12-13)

క్షమించకపోవడం తరచుగా మానవ అహంకారం (గర్వం) నుండి పుడుతుంది. అహంకారం మానవ ఆత్మను గట్టిపరుస్తుంది. వినయం అంటే దేవుడు మన కోసం ఏమి చేసాడో గుర్తించడం (జ్ఞాపకం చేసుకోవడం), మరియు ఆయన కృప వల్ల మాత్రమే మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాము. మనకు ఎలాంటి అర్హత లేదు.

నిజం చెప్పాలంటే, క్షమించే విషయంలో నేను ఇప్పటికీ కొన్నిసార్లు కష్టపడుతున్నాను, కానీ పై పద్ధతులు నాకు చాలా సహాయకారిగా ఉన్నాయి, అందుకే వాటిని మీతో పంచుకోవాలని అనుకున్నాను. దయచేసి ప్రతిరోజూ నా కోసం ప్రార్థించడం గుర్తుంచుకోండి.

ప్రార్థన

మీరు విడుదల అనుభూతి పొందే వరకు దయచేసి ప్రతి ప్రార్థన అంశమును పునరావృతం చేయండి.

 

ధన్యత గల పరిశుద్ధాత్మ, నీ శక్తితో మరియు కృపతో నన్ను నింపుము. (వ్యక్తుల పేరు) క్షమించడంలో నాకు సహాయం చేయి. నువ్వు లేకుండా నేను ఇది చేయలేను.

యేసు నామములో, నేను (వ్యక్తి(ల) పేరు) విడుదల చేస్తున్నాను.

[పై రెండు పద్దతులను పునరావృతం చేయండి మరియు మిమ్మల్ని లేదా మీ ప్రియమైన వారిని తీవ్రంగా బాధపెట్టిన వ్యక్తుల కోసం చేయండి]

తండ్రీ, యేసు నామములో, నీవు అతనిని/ఆమెను చూసే విధంగా (వ్యక్తి పేరు) చూడటానికి నా కళ్ళు తెరువు, ఎందుకంటే నేను నీ నిజమైన బిడ్డను. నన్ను కరుణించుము.

నేను భావోద్వేగంతో కాక విశ్వాసంతో నడుస్తాను, కాబట్టి నేను (వ్యక్తి పేరు) క్షమిస్తున్నాను. అందుకు యెహోవా నన్ను తప్పకుండా ఘనపరుస్తాడు.


Join our WhatsApp Channel


Most Read
● దేవుని ప్రణాళికలో వ్యూహ శక్తి
● దైవికమైన అలవాట్లు
● దేవునికి మీ పగను ఇవ్వండి
● ఇది అధికార మార్పు  (బదిలి) యొక్క సమయం
● మోసపూరిత లోకములో విచక్షణ సత్యం
● దేవుని వాక్యమును మీ హృదయంలో లోతుగా నాటండి
● మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్