english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఇవ్వగలిగే కృప - 2
అనుదిన మన్నా

ఇవ్వగలిగే కృప - 2

Saturday, 14th of May 2022
3 0 1174
Categories : ఇవ్వడం (Giving)
'ఇవ్వగలిగే కృప' అనే అంశము మీద మన విషయాన్ని కొనసాగుతున్నాము. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇవ్వడం ఎందుకు కీలకమో అనే కారణాలను మనం పరిశీలిద్దాం.

2. మన ఇవ్వడం బట్టి ప్రభువు సంతోషిస్తాడు
లూకా 6:38, "ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును."

నిజమైన ఇవ్వడం అనేది "ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును" అని గ్రహించడంతో ప్రారంభమవుతుంది. (రోమీయులకు ​​11:35,36) మరో మాటలో చెప్పాలంటే, ఆయనే జీవితానికి మూలం, సాధనం మరియు లక్ష్యం.

దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం దేవునికి ఇచ్చినప్పుడు, అది వృద్ధి చెందడానికి హామీ ఇచ్చే ఆశీర్వాదాలను బయలుపరస్తుంది . మార్టిన్ లూథర్ ఒకసారి ఇలా అన్నాడు, "నేను వస్తువులను నా చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాను మరియు వాటన్నింటినీ పోగొట్టుకున్నాను, కానీ నేను దేవుని చేతుల్లోకి (రాజ్యానికి) ఇచ్చినది ఇప్పటికీ నేను కలిగి ఉన్నాను."

లూకా 6:38 చదవడం మరియు ఇవ్వడం ద్వారా మనం పొందే వాటిపై మాత్రమే దృష్టి పెట్టడం ఉత్సాహం కలిగిస్తుంది, కానీ అలా చేయడం వల్ల అంశము అనేది తప్పిపోతోంది. దేవుడు మన ధారాళత్వానికి సంతోషిస్తాడు కాబట్టి మనం ప్రధానంగా ఇస్తాం. దేవుడు ఇచ్చేవారి పట్ల ఆకర్షితుడవుతాడు. "దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును" (2 కొరింథీయులకు 9:7)

3. మనం ఇవ్వడం ద్వారా ద్వారాలు తెరుచుకుంటాయి
"అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి" (1 రాజులు 17:15)

విధవరాలు ఆశీర్వాదం పొందింది మరియు చాలా రోజుల వరకు తన ఇంటి వారితో కలిసి భోజనం చేసింది. ఆమె ఇవ్వడం ఆమెకు మరియు ఆమె కుటుంబానికి ఆశీర్వాదం యొక్క ద్వారములు తెరిచింది. చాలా మందికి ఈ అవగాహన లేదు, అందువల్ల లేని సమయాల్లో ఇవ్వడానికి కష్టపడతారు.

(కొర్నేలీ) పగలు ఇంచు మించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, "కొర్నేలీ!", అని పిలుచుట దర్శన మందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, "ప్రభువా, యేమని అడిగెను." అందుకు దూత, "నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి." (అపొస్తలుల కార్యములు 10:3-4)

కొర్నేలీ ఒక్క మాటలో దేవుణ్ణి ఆరాధించేవాడు కాదు; అతడు ఆయన ఆరాధనను కార్యరూపంలో నెరవేర్చాడు. లేఖనం కొర్నేలీ దేవుని పనికై మరియు దేవుని ప్రజలకు క్రమం తప్పకుండా ఇచ్చే వ్యక్తిగా సూచిస్తుంది.

కొర్నేలీ ఇవ్వడం ఒక దేవుని దూత నుండి అలౌకికమైన దర్శనముకై ద్వారములను తెరిచింది. దేవుడు తన శక్తివంతమైన అపొస్తలుడైన పేతురును కూడా వచ్చి కొర్నేలీ మరియు అతని ఇంటివారికి రక్షణ సందేశాన్ని బోధించమని ఆదేశించాడు.

కాబట్టి మీరు గమనించండి, ఇవ్వడం అనేది దేవుని పరిమాణంలో ఫలాలకు ద్వారములను తెరుస్తుంది. మీరు ఇచ్చిన ప్రతి కానుక దేవుని యందు జ్ఞాపకార్థముగా ఉంటుంది మరియు ఆ కానుకను ప్రతిస్పందనగా ఆయన మీకు కావలసినది దయచేస్తాడు.

యెషయా 45:1లో ప్రభువు వాగ్దానం చేసాడు, "[నేను] నీ యెదుట ద్వారములు వేయబడకుండ తలుపులు తీసెదను. . . నేను ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

ఒక విజ్ఞప్తి
ఉపవాస ప్రార్థనల సమయంలో, మనము మన లైవ్ ఆరాధనలను క్రమం తప్పకుండా నిర్వహించగలిగే స్టూడియోను కొనుగోలు చేయమని పరిశుద్దాత్మ నాతో మాట్లాడాడు. నేను ప్రజలతో ఒకరి తరువాత ఒకరితో పరిచర్య చేసేలా ఉండే విశ్రాంతి స్థలము లాగా ఉంటుంది.

మాకు:
56 మంది ఒక్కొక్కరు రూ.100000 ఇవ్వగలిగే వారు అవసరము
112 మంది ఒక్కొక్కరు రూ.50000 ఇవ్వగలిగే వారు అవసరము
224 మంది ఒక్కొక్కరు రూ.25000 ఇవ్వగలిగే వారు అవసరము
560 మంది ఒక్కొక్కరు రూ.10000 ఇవ్వగలిగే వారు అవసరము
1120 మంది ఒక్కొక్కరు రూ.5000 ఇవ్వగలిగే వారు అవసరము

మీరు వారిలో ఒకరు అవుతారా?
గుర్తుంచుకోండి, మీరు ఆయన నామమును బట్టి ఏమి చేసిన ప్రభువు మరచిపోవుటకు అన్యాయస్థుడు కాడు మరియు ఆయన దీవెనలు మీపైనా మరియు మీ తరాల మీదకు వస్తుంది. (హెబ్రీయులకు 6:10)

మీరు నోహ్ యాప్/చెక్కు లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వవచ్చు
లేదా మీరు KSM కార్యాలయం లేదా సభలలో నగదు ద్వారా ఇవ్వవచ్చు

ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నేను ఇచ్చానని ప్రకటిస్తున్నాను మరియు అది నాకు గొప్ప కొలతతో ఇవ్వబడుతుంది, అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను పురుషులు మరియు స్త్రీలు నా ఒడిలో కొలుతురు ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● మీరు యేసు వైపు ఎలా చూచు చున్నారు?
● దుష్టాత్మల ప్రవేశ ద్వారాన్ని మూసివేయడం - I
● ఆరాధన యొక్క పరిమళము
● సుదీర్ఘ రాత్రి తర్వాత సూర్యోదయం
● మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు
● నిరాశను నిర్వచించడం
● జీవన నియమావళి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్