అనుదిన మన్నా
దానియేలు ఉపవాసం
Friday, 26th of August 2022
2
1
1615
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. (1 థెస్సలొనీకయులకు 5:23)
మీ ఆధ్యాత్మిక, శారీరక మరియు భావపూరితమైన ఆరోగ్యాన్ని పూర్తిగా నూతన స్థాయికి పెంచే శక్తివంతమైన బైబిలు రహస్యాన్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను - దీనిని దానియేలు ఉపవాసం అని అంటారు.
దానియేలు ఉపవాసం అంటే ఏమిటి?
దానియేలు 10వ అధ్యాయం ప్రారంభంలో, దానియేలు ప్రార్థన మరియు ఉపవాసం యొక్క ప్రత్యేక సమయంగా మూడు వారాల వ్యవధిని కేటాయించినట్లు మనం చూస్తాము. చాలా మంది క్రైస్తవులు అతడు చేసిన ఉపవాసాన్ని "దానియేలు ఉపవాసం" అని అంటారు. అతడు పూర్తిగా తినడం మానేయలేదు, కానీ అతడు సాధారణ ఫలాలు మరియు కూరగాయలతో కూడిన ఆహారాన్ని మాత్రమే తిన్నాడు. అతడు మాంసం తినలేదు మరియు ద్రాక్షారసము తాగలేదు. (దానియేలు 10:2-3)
తన ఉపవాసంలో, బబులోను సామ్రాజ్యంలో బందీలుగా ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలు తరపున దానియేలు దేవుని ముందు దుఃఖిస్తున్నాడు లేదా దుఃఖ ప్రాప్తుడైయ్యాడు.
దానియేలు ఉపవాసం యొక్క కాలావధి (సమయము)?
దానియేలు ఉపవాసం 28 ఆగస్టు 2022 నుండి ప్రారంభమవుతుంది 3 సెప్టెంబర్ 2022 వరకు ఉంటుంది (7 రోజులు)
దానియేలు ఉపవాస సమయంలో నేను ఏమి తినగలను?
మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు కూడా సురక్షితంగా ఉపవాసంలో పాల్గొనగలిగేలా ఈ క్రింది ఆహారాలు ఇలా ఉన్నాయి.
పానీయాలు (బ్రేవరేజెస్)
నీరు మాత్రమే - ఉపవాస సమయంలో క్రమం తప్పకుండా ఎక్కువ నీళ్ళు త్రాగండి.
కొబ్బరి నీరు మరియు కూరగాయల రసం కూడా తీసుకోవచ్చు.
టీ లేదా కాఫీ తీసుకోకూడదు
సోడాలు, పెప్సీ మొదలైన వాయుపూరిత పానీయాలు తీసుకోకూడదు.
శక్తి పానీయాలు, గమ్ లేదా మిఠాయిలు తీసుకోకూడదు.
చాలామంది టీ మరియు కాఫీకి బానిసలుగా ఉన్నారు మరియు వాస్తవానికి అది లేకుండా జీవించలేరని భావిస్తారు. "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును" అని దేవుని వాక్యం చెబుతోంది. (మత్తయి 4:4)
పాలు, చీజ్, పెరుగు మరియు ఐస్ క్రీంతో సహా అన్ని పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అయితే, మందులు తీసుకునే వారికి ఒక గ్లాసు పాలు తీసుకోవచ్చు.
కూరగాయలు (ఆహారం యొక్క ఆధార పరంగా)
తాజావి లేదా వండినవి తీసుకోవచ్చు
గడ్డకట్టినవి మరియు వండినవి తీసుకోవచ్చు కానీ డబ్బాల్లో ఉన్నవి తీసుకోకూడదు
గుడ్లు అనుమతించబడవు.
పండ్లు
యాపిల్సు, దానిమ్మ, అవకాడోసు, బ్లూబెర్రీసు, బొప్పాయి, జామును, పీచెసు, ఆప్రికాట్సు, ఆరెంజ్, కివీ, పియర్, చెర్రీసు మరియు స్ట్రాబెర్రీసు తీసుకోవచ్చు
మీరు ఈ క్రింది వాటిని తీసుకోకూడదు:
మామిడి, పైనాపిలు, పుచ్చకాయ, అరటి, ద్రాక్ష, ఎండుద్రాక్ష, లిచీలు, ఖర్జూరాలు
రసాలు
తాజా పండ్లు మరియు కూరగాయల రసాలు తీసుకోవచ్చు
డబ్బా రసాలను నివారించండి ఎందుకంటే ఇవి తరచుగా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.
పప్పులు (పల్సస్)
పప్పులను సాధారణంగా "దాల్" అని అంటారు . అవి సాధారణ భారతీయ వంటగదిని అలంకరించే అనేక రకాల పప్పులు. ఇవి పప్పుధాన్యం కుటుంబానికి చెందినవి మరియు ప్రోటీన్లు మరియు పోషకాల యొక్క పవర్‌హౌస్.
- రెడ్ ల లెంటిస్ (మసర పప్పు)
- బెంగాల్ గ్రామ్ (శనగ పప్పు)
- బ్లాక్ గ్రామ్ (మినుములు)
- యెల్లో పీజియన్ పీస్ (కంది పప్పు)
- గ్రీన్ (పెసర పప్పు)
- చిక్పీస్ (తెల్ల శనగలు)
- హార్స్ గ్రామ్ (ఉలవలు)
- బ్లాక్ చిక్‌పీ (నల్ల శనగలు)
- తెల్ల మినుములు
- గ్రీన్ పీజియన్ పీస్ (ఆకుపచ్చ కంది పప్పు)
తృణధాన్యాలు
బ్రౌన్ రైసు, ఓట్సు, క్వినోవా, మిల్లెట్, ఉసిరికాయ, బుక్వీట్ మరియు బార్లీని నీటిలో వండినవి తీసుకోవచ్చు.
తెల్ల బియ్యం లేదా బ్రెడ్డు తీసుకోకూడదు. అయితే, మీరు చపాతీ తినవచ్చు.
పోహా (చదునైన బియ్యం) అనుమతించబడదు లేదా తీసుకోకూడదు
గింజలు మరియు విత్తనాలు
బాదం, జీడిపప్పు, హాజెల్ నట్సు, పెకాన్లు, వాల్‌నట్‌లు మరియు పిస్తాపప్పులు
మీరు చియా విత్తనాలు మరియు జనపనార గింజలను కూడా తినవచ్చు
మీరు వేరుశెనగ తీసుకోకూడదు
సలాడ్లు
దానియేలు ఉపవాసములో సలాడ్లు చాలా బాగుంటాయి. మీరు సలాడ్ ఎంపికలుగా నిమ్మ లేదా నిమ్మరసంతో కలిపి ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు.
వంటలను రుచి చూసేటప్పుడు చాలా తక్కువ గల ఉప్పును ఉపయోగించాలని అని నా సిఫార్సు. అలాగే, చాలా తక్కువ నూనెను వాడండి. చక్కెరను పూర్తిగా నివారించండి.
ఇది మీరు చేసే గొప్ప ఆరోగ్యకరమైన విషయాలలో ఒకటి. మీ శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు.
ఉపవాసం తర్వాత, దానియేలు ఇలా అన్నాడు:
అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అఱచేతులను నేలమోపి నన్ను నిలువ బెట్టి "దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను ... ఈ దర్శనపు సంగతి ఇంక అనేకదినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింప బోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని" అతడు నాతో చెప్పెను (దానియేలు 10:10–11, 14)
దేవుడు దానియేలు కోసం ఒక దర్శనాన్ని కలిగి ఉన్నట్లే, దేవుడు మీ జీవితానికి ఒక దర్శనాన్ని, మీ కోసం ఒక కల కలిగి ఉన్నాడు. ఆయన మీ జీవితాన్ని మొదటి నుండి చివరి వరకు ఒక క్రమంగా ఏర్పాటు చేశాడు - మీరు ఎవరిని వివాహం చేసుకోవాలి, మీరు ఏమి చేయాలి మరియు మీరు ఎక్కడికి వెళ్లాలి.
ఆయనకు మీ ప్రతి అడుగు - సమస్తము తెలుసు. దేవుడు దర్శనం కలిగి ఉన్నాడు. కానీ దానియేలు ఉపవాసం అతనికి ఆ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి కారణమైందని గమనించండి.
దృష్టి లేదా స్పష్టత అనేది అవగాహన స్థానంలో ఉపయోగించబడే రెండు ప్రత్యామ్నాయ పదాలు. ఇది దర్శనాన్ని సాకారం చేయడానికి అవసరమైన జ్ఞాన అభివృద్ధికి దారితీసింది.
దానియేలు ఉపవాసం యొక్క సంభావ్య లేదా శక్తిగల ప్రయోజనాలు
దానియేలు ఉపవాసం యొక్క కొన్ని శక్తిగల ప్రయోజనాలను మూడు వర్గాలుగా విభజించవచ్చు:
1. ఆధ్యాత్మికం
2. మానసిక మరియు భావపూరితము
3. శారీరిక
ఎ]. ఆధ్యాత్మిక ప్రయోజనాలు
1. ఉపవాసం మిమ్మల్ని దేవునికి దగ్గర చేస్తుంది
2. ఉపవాసం మిమ్మల్ని దేవుని స్వరాని వినడానికి మరింత సున్నితంగా చేస్తుంది
3. ఉపవాసం చెడు అలవాట్లను లేదా వ్యసనాలను కూడా విచ్ఛిన్నం చేస్తుంది
4. ఉపవాసం మన బలహీనతలను చూపుతుంది మరియు దేవుని బలం మీద ఆధారపడేలా చేస్తుంది.
బి]. మానసిక మరియు భావపూరితమైన ప్రయోజనాలు
ఉపవాస ప్రయోజనాలు ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి భిన్నంగా ఉంటుంది, కానీ క్రిందివి ఈ విధంగా సంభవిస్తాయి:
1. ఉపవాసం ఆందోళన మరియు భయాన్ని తగ్గిస్తుంది
2. ఉపవాసం శాంతి మరియు సమాధానమును పెంచుతుంది
3. ఉపవాసం మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు మరియు భావాలను తొలగిస్తుంది
4. ఉపవాసం మీ జీవితంలో ఒత్తిడితో కూడిన బంధాలను చక్కదిద్దడంలో సహాయపడుతుంది
5. ఉపవాసం మెదడు యొక్క పొగమంచును తగ్గిస్తుంది
6. ఉపవాసం దేవుని విశ్వసించే మీ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది
7. ఉపవాసం మిమ్మల్ని నిదానంగా లేదా అణచబడిన విధంగా భావించే జీవవిషం నుండి తొలగిస్తుంది.
సి]. శారీరిక ప్రయోజనాలు
భౌతిక శరీరానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి:
1. ఉపవాసం పంచదార వ్యసనాలను విచ్ఛిన్నం చేస్తుంది
2. ఉపవాసం శరీరం యొక్క నిర్విషీకరణకు మద్దతును ఇస్తుంది
3. ఉపవాసం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది
4. ఉపవాసం ఆరోగ్యకరమైన శక్తి స్థాయిలను ప్రోత్సహిస్తుంది
5. ఉపవాసం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
6. ఉపవాసం ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మరియు తొలగింపును ప్రోత్సహిస్తుంది
7. ఉపవాసం ఆరోగ్యకరమైన వాపు ప్రతిస్పందనకు మద్దతు ఇస్తుంది మరియు కీలు సౌకర్యాన్ని ప్రోత్సహిస్తుంది
8. ఉపవాసం ఆరోగ్యకరమైన హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహిస్తుంది
మీరు నాతో మరియు ప్రభువులో లోతైన, మరింత ప్రభావవంతమైన అనుభవం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఇతరులతో కలసి చేరడానికి సిద్ధంగా ఉన్నారా?
దయచేసి మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సూచనలు ఉంటే [email protected] లో నాకు ఇ-మెయిల్ చేయడానికి సంకోచించకండి లేదా నోహ్ చాట్‌లో సందేశం పంపండి.
ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, దానియేలు ఉపవాసం చేయడానికి మరియు పూర్తి చేయడానికి నాకు నీ కృపను దయచేయి. ఉపవాసంలో ఉన్నప్పుడు, మీ సన్నిధిని మరియు తాజా, నూతన ఆధ్యాత్మిక అంతర్దృష్టి గురించి మరింత అవగాహన కొరకై నేను నిన్ను వేడుకుంటున్నాను. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● 14 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 1
● శూరుల (రాక్షసుల) జాతి
● దేవుడు ప్రతిఫలము ఇచ్చువాడు
● మూడు పరిధులు (రాజ్యాలు)
● జ్ఞానుల నుండి నేర్చుకోవడం
● బలిపీఠం మరియు మంటపం
కమెంట్లు