english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. విత్తనం యొక్క శక్తి -1
అనుదిన మన్నా

విత్తనం యొక్క శక్తి -1

Thursday, 16th of May 2024
0 0 728
Categories : విత్తనం యొక్క శక్తి (Power of the Seed)
ఒక విత్తనం మీ జీవితంలోని - మీ ఆధ్యాత్మిక, శారీరిక, భావోద్వేగ, ఆర్థిక మరియు సామాజిక జీవితం ప్రతి అంశాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని మరియు శక్తిని కలిగి ఉంది, ప్రతిదీ మీరు గతంలో నాటిన విత్తనాలచే నిర్వహించబడతాయి. పిల్లలు వారి తల్లిదండ్రులు నాటిన విత్తనాల ద్వారా బాధించబడుతారు, ప్రభావితమవుతారు మరియు ప్రాబల్యం పొందుతారు.

నోవహు కాలంలో దేవుడు భూమిపైకి పంపిన జలప్రళయం తర్వాత, ఆయన మాట్లాడిన మొదటి విషయాలలో ఒకటి:
"భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను." (ఆదికాండము 8:22)

భూమిని పరిపాలించడానికి దేవుడు నియమించిన ప్రధాన నియమాలలో ఒకటి "వెదకాలము మరియు కోతకాలము యొక్క నియమం. లౌకిక ప్రజలు దీనిని "హేతువు మరియు ప్రభావం" అని అంటారు, కొందరు "విత్తడం మరియు కోయడం" యొక్క నియమం అని అంటారు. దానికి మీరు ఏ పేరు పెట్టినా సిధ్ధాంతం అలాగే ఉంటుంది.

విత్తనం యొక్క సారాంశం ఏమిటి?
పెరుగుదల, స్థిరత్వం మరియు అభివృద్ధి ఉండేలా చూసే సాధనంగా విత్తనం దేవునిచే నియమించబడింది. చెట్లు ఫలాలను ఇవ్వడానికి సృష్టించబడ్డాయి, కానీ ఫలాల లోపల మరొక చెట్టు కోసం విత్తనం ఉంది. దేవుని ప్రణాళిక ఏమిటంటే, ఆయన ఒకసారి ఏదైనా సృష్టించినప్పుడు, ఆ తర్వాత ఆ వస్తువు విత్తనం యొక్క శక్తి ద్వారా పునరుత్పత్తి చేయడం ప్రారంభమవుతుంది.

విత్తనం 5 రకాలు
మీరు నిజంగా లోతుగా పరిశీలిస్తే, భూమిపై ఉన్న ప్రతిదీ ఒక విత్తనం
1. వినడానికి జ్ఞానం నా విత్తనం
2. జ్ఞానమే మార్పుకై నా విత్తనం
3. క్షమాపణకు కృప నా విత్తనం
4. పునరుద్ధరణకు పశ్చాత్తాపం నా విత్తనం. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపపడ్డాడు మరియు అతని జీవితంలో పునరుద్ధరణ జరిగింది.
5. నా పదాలు లేదా మాటలు సృజనాత్మకకు విత్తనాలు. మీరు మాటలు మాట్లాడేటప్పుడు, అవి జీవితం మరియు మరణం యొక్క శక్తిని కలిగి ఉంటాయి మరియు పదాలు సృజనాత్మక శక్తిని కలిగి ఉన్నాయని మీరు గమనించగలరు.

మీ వద్ద ఏమీ లేదని చెప్పకండి. ఈ భూమిపై ఏ ఒక్క వ్యక్తి కూడా, అతను లేదా ఆమెకు విత్తనం లేని పేదవాడు కాడని అని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రోమీయులకు ​​12:3 దేవుడు ప్రతి ఒక్కరికి 'పరిమాణం' ఇచ్చాడని చెబుతోంది. దేవుడు మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి నిక్షిప్తం చేసాడు.

ప్రవక్త ఎలీషా ఆ విధవరాలి వద్దకు వెళ్లి ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. "మీ ఇంట్లో ఏమి ఉంది?" ఆమె బదులిచ్చింది, "నా దగ్గర కొంచెం నూనె తప్ప మరేమీ లేదు" (2 రాజులు 4:1-7) మీలో చాలామంది ఇలా అన్నారు, "నా దగ్గర ఏమీ లేదు. ఏమి చేయాలో నాకు తెలియదు." నన్ను చెప్పనివ్వండి. దేవుడు నీ జీవితంలో నిక్షిప్తం చేసిన ఒక విత్తనం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దాన్ని బయటకు తీసుకురాగలిగితే మీ జీవితంలో గొప్ప పంట వస్తుంది.

ప్రార్థించండి: యెహోవా నా జీవితంలో మీరు నిక్షిప్తం చేసిన విత్తనాన్ని చూడటానికి మరియు తెలుసుకోవడానికి నా కళ్ళు తెరువు. (కనీసం 3 నిమిషాలు ఇలా ప్రార్థిస్తూ ఉండండి)

1. సృష్టిలో మూర్తీభవించిన విత్తనాలు
అప్పుడు దేవుడు, "దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను.(ఆదికాండము 1:11-12)

సృష్టి సమయంలో, చెట్లు మరియు ఇతర జీవులు "విత్తనం" యొక్క శక్తిని కలిగి ఉండేలా దేవుడు నిర్ధారించాడు. విత్తనం ప్రతి జీవికి వారి సహజత్వం తర్వాత ముందుకు రావడానికి శక్తినిచ్చింది. దేవుడు సృష్టించిన ప్రతి జీవిలో విత్తనం ఉంది. ఆయన ప్రతి విత్తనంలో ఒక పంటను ఉత్పత్తి చేయడానికి-ఖచ్చితంగా ఒకే మాదిరిగా చేయడానికి మరియు గొప్పగా అభివృద్ధిపరచడానికి శక్తిని ఇచ్చాడు.

దేవుడు తనను తాను పునరుత్పత్తి చేసుకోవడానికి మొక్కల రాజ్యాన్ని సృష్టించాడు. పునరుత్పత్తి సామర్థ్యం లేకుండా, దేవుడు ఏదెను తోటలో సృష్టించిన పండు సృష్టి తర్వాత వెంటనే అదృశ్యమయ్యేది.

దేవుడు జంతువులను సృష్టించినప్పుడు, వాటిని తిరిగి పునర్నిర్మించుకునే శక్తిని ఇచ్చాడు. ఈ కారణంగా, జంతువుల సంఖ్య గొప్ప నిష్పత్తిలో పెరగడం సాధ్యమవుతుంది. జంతువులు వారి స్వంత సహజత్వం తర్వాత పునరుత్పత్తి చేయడానికి దేవుడు సృష్టించాడు.

2. సంతానోత్పత్తి విత్తనం
ఆదికాండము 3:15 ఇలా సెలవిస్తుంది:
మరియు నీకును స్త్రీకిని 
నీ సంతానమునకును ఆమె సంతానమునకును 
వైరము కలుగజేసెదను
అది నిన్ను తలమీద కొట్టును; 
నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.

ఇది బైబిల్లోని మొదటి మెస్సీయ ప్రవచనం. మెస్సీయ ప్రవచనం అనేది రాబోయే మెస్సీయ - ప్రభువైన యేసుక్రీస్తుతో అనుసంధానించబడిన ప్రవచనం. ఈ ప్రవచనం మెస్సీయ ద్వారా ఏమి సాధించబడుతుందో కూడా చెబుతుంది.

'సంతానము' అనే పదాన్ని గమనించండి. దేవుడు మనకు మానవులకు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. మన సంతానాన్ని "విత్తనాలు" అని కూడా పిలవవచ్చు. మన పిల్లలను మన విత్తనంగా పేర్కొనవచ్చు. సంతానము ద్వారా, మనము ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించవచ్చు. ప్రతి మనిషి తన లోపల విత్తనాన్ని కలిగి ఉంటాడు. భూమిపై ఉన్న ప్రతి జీవి విత్తనంతో పునరుత్పత్తి చేస్తుంది.
ప్రార్థన
తండ్రీ, నీవు నాకు ఇచ్చిన విత్తనం యొక్క శక్తిని ప్రత్యక్ష పరినందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను. నేను విశ్వాసంతో మరియు విశ్వాసం ద్వారా విత్తుతాను. ఇప్పుడు మరియు నిత్యత్వము నీవు బలమైన పంటను ఇస్తావని నేను నమ్ముతున్నాను. యేసు నామంలో. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● కాపలాదారుడు
● 21 రోజుల ఉపవాసం: 10# వ రోజు
● 19 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము
● నూతన ఆధ్యాత్మిక దుస్తులను ధరించుట
● చేదు (కొపము) యొక్క వ్యాధి
● డబ్బు స్వభావాన్ని పెంపొందిస్తుంది
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్