అనుదిన మన్నా
వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 2
Saturday, 27th of April 2024
0
0
546
Categories :
వాతావరణం (Atmosphere)
సంఘం యొక్క ఆధ్యాత్మిక వాతావరణం పూర్తిగా సేవకుల భుజాలపై ఆధారపడి ఉంటుందని చాలా మంది అనుకుంటారు.
ప్రభువైన యేసయ్య తన భూసంబంధమైన పరిచర్య అంతటా గొప్ప మరియు అసాధారణమైన అద్భుతాలు చేశాడు. అయితే, ఆయన తన స్వగ్రామమైన నజరేతుకు తిరిగి వచ్చినప్పుడు, ఆయన అక్కడ చాలా గొప్ప అద్భుతాలు చేయలేకపోయాడు. ఆలోచించండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వయంగా అక్కడ గొప్ప ఫలితాలను ఇవ్వలేకపోయాడు. ఇది ఆయన పరిచర్యపై అభిషేకం లేకపోవడం వల్ల కాదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న అవిశ్వాస వాతావరణం కారణంగా. "మరియు వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు" (మత్తయి 13:58).
మన సంఘంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరచాలంటే, విజ్ఞాపన ప్రార్థనలో క్రమం తప్పకుండా పాల్గొనే బృందంగా నాయకత్వంతో కలిసి పనిచేయాలి. ఇది బోధకుని విశ్వాసానికి మన విశ్వాసాన్ని జోడిస్తుంది, యేసయ్య నామాన్ని ఎత్తడానికి మరియు పరిశుద్దాత్మ శక్తివంతంగా కదిలే విశ్వాస వాతావరణాన్ని నిర్మించడానికి పనిచేస్తుంది.
మనం మన గృహాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరచుకోవాలంటే, కుటుంబ సమేతంగా క్రమం తప్పకుండా ప్రార్థన చేయడంలో మనం శ్రద్ధ వహించాలి.
చాలా ఆందోళన కలిగించే మరో రంగం ఉంది. మనం ఫ్లైట్ లేదా రైలు ఎక్కవలసి వచ్చినప్పుడల్లా, మనము సమయానికి సరిగ్గా చేరుకున్నామా లేదని మనము ఎల్లప్పుడూ నిర్ధారిస్తుంటాము. అయితే, సంఘం విషయానికి వస్తే, చాలా మంది దీనిని సాధారణ వ్యవహారంగా భావిస్తారు మరియు ఆరాధనలకు ఆలస్యంగా వస్తారు.
ఆరాధనలో పాల్గొనడం ద్వారా, పరిశుద్ధాత్మ సమృద్ధితో నిండిన వాతావరణాన్ని సృష్టించేందుకు మనము సహాయం చేస్తాము. అలాంటి వాతావరణంలోనే ప్రజల హృదయాలు దేవుని హృదయం వైపుకు మళ్ళుతాయి. ఇది ప్రజలు తమ మొదటి ప్రేమకు తిరిగి వచ్చే ఆరాధన వాతావరణం - ప్రభువైన యేసుక్రీస్తు. దేనికోసం ఆరాధనను వదులుకోవద్దండి.
నేను ఈ లోతైన అంతర్దృష్టిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
అటువంటి వ్యక్తి ఆరాధన ముగిసిన తర్వాత కూడా వారు సందర్శించే ప్రదేశాలపై ప్రభావం చూపడం మరియు ప్రభావితం చేయడం ప్రారంభిస్తారు.
దేవదూతలు పగలు రాత్రి ప్రభువును ఆరాధిస్తారు. అలాంటి దేవదూత బేతెస్ద కోనేరు వద్ద నీళ్లను కదిలించినప్పుడు, పరలోకపు వాతావరణం బేతెస్ద జలాలను తాకింది. నీళ్లలో మొదట ప్రవేశించినవాడు స్వస్థత పొంది విడుదల చేయబడ్డాడు.
నేను ఆజ్ఞాపిస్తున్నాను మరియు ప్రకటిస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్లినా, మీరు గొప్ప ఫలితాలను తెచ్చే ఆరాధన మరియు విజ్ఞాపన ప్రార్థన గల వాతావరణాన్ని మీతో తీసుకువెళతారు. ఈ వాక్యాన్ని పొందుకోండి.
గమనిక: అనుదిన మన్నా మీకు ఆశీర్వాదంగా ఉంటే, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను నోహ్ యాప్‌లో చేరమని ప్రోత్సహించండి. ఈ అనుదిన మన్నాని వారితో పంచుకోండి.

ఒక వ్యక్తి ఏకీకృతమైన ఆరాధనలో ఒక క్రమమైన భాగం కావడం ప్రారంభించినప్పుడు, అలాంటి వ్యక్తి ఆరాధన ముగిసిన తర్వాత కూడా అతనితో లేదా ఆమెతో ఆరాధన వాతావరణాన్ని కలిగి ఉంటాడు.
అటువంటి వ్యక్తి ఆరాధన ముగిసిన తర్వాత కూడా వారు సందర్శించే ప్రదేశాలపై ప్రభావం చూపడం మరియు ప్రభావితం చేయడం ప్రారంభిస్తారు.
దేవదూతలు పగలు రాత్రి ప్రభువును ఆరాధిస్తారు. అలాంటి దేవదూత బేతెస్ద కోనేరు వద్ద నీళ్లను కదిలించినప్పుడు, పరలోకపు వాతావరణం బేతెస్ద జలాలను తాకింది. నీళ్లలో మొదట ప్రవేశించినవాడు స్వస్థత పొంది విడుదల చేయబడ్డాడు.
నేను ఆజ్ఞాపిస్తున్నాను మరియు ప్రకటిస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్లినా, మీరు గొప్ప ఫలితాలను తెచ్చే ఆరాధన మరియు విజ్ఞాపన ప్రార్థన గల వాతావరణాన్ని మీతో తీసుకువెళతారు. ఈ వాక్యాన్ని పొందుకోండి.
గమనిక: అనుదిన మన్నా మీకు ఆశీర్వాదంగా ఉంటే, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను నోహ్ యాప్‌లో చేరమని ప్రోత్సహించండి. ఈ అనుదిన మన్నాని వారితో పంచుకోండి.
ప్రార్థన
ప్రభువు ఆత్మ నా మీద మరియు నాలో ఉందని నేను ప్రకటిస్తున్నాను. నేను ఆయన సన్నిధిని తీసుకెళ్లే వాడిని. నేను ఎక్కడికి వెళ్లినా ప్రభువు నాతో వస్తాడు.
Join our WhatsApp Channel
Most Read
● చిన్న విత్తనం నుండి పెద్ద వృక్షము వరకు● 08 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● అభిషేకం పొందుకున్న తరువాత ఏమి జరుగుతుంది
● ఇది నిజంగా ముఖ్యమా?
● పరిశుద్ధత గురించి స్పష్టంగా తెలియజేయబడింది
● విశ్వాసంతో వ్యతిరేకతను ఎదుర్కొనుట
● 11 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు