english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #2
అనుదిన మన్నా

దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #2

Sunday, 22nd of September 2024
0 0 561
Categories : ప్రార్థన (Prayer) శిష్యత్వం (Discipleship)
దేవా, నా దేవుడవు నీవే, 
వేకువనే నిన్ను వెదకుదును. (కీర్తనలు 63:1)


మీరు ఉదయానే మేల్కొన్న తర్వాత ప్రభువుకు మీ సమయాన్ని ఇవ్వండి. ఉదాహరణకు: మీరు ఉదయం 6 గంటలకు మేలుకుంటారనుకోండి. మీ నిత్యావసరాలు పూర్తి చేసిన తరువాత, వాక్యము మరియు ప్రార్థనలో కొంత సమయం గడపండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ నోటిఫికేషన్‌లను తనిఖీ చేయవద్దు. ఈ సమయం పవిత్రమైనది మరియు ఆయనకు మాత్రమే కేటాయించబడింది.

దావీదు యొక్క అలవాటు ఉదయాన్నే మొదట ప్రభువును వెతకడం. ఈ ఒక రహస్యం అతన్ని కేవలం గొర్రెల కాపరి బాలుడి నుండి పౌరాణికమైన ఇశ్రాయేలు రాజు వరకు ఆకర్షించింది. మీ జీవితంలోని అన్ని రంగాలలో గరిష్ట పనితీరు కోసం; ఇది మీ రహస్యం కూడా కావచ్చు.

ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. (మార్కు 1:35)

ప్రభువైన యేసు మన పరిపూర్ణ ఉదాహరణ. ఆయన చేసిన మొదటి పని ఏమిటంటే, తన తండ్రితో సమయం గడపడం. ఆయన తన భక్తిని మరియు తండ్రి పట్ల ప్రేమను సమస్తము కంటే మించి చేశాడు. ఈ సంబంధం నుండినే ప్రజలకు అంతరాయం లేకుండా తన శక్తి ప్రవహించింది.

మనము ప్రతి రోజు దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, మన మనస్సు యొక్క మనిషి పునరుద్ధరించబడుతాడు మరియు రాబోయే రోజులో సవాళ్లను ఎదుర్కోవటానికి మనకు అంతర్గత బలం లభిస్తుంది.

ఇప్పుడు ప్రతిరోజూ దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అందరికీ అంతా సులభం కాదు. దేహము మరియు దుష్టుడు మీకు వ్యతిరేకంగా పోరాడటానికి కలిసి ఉంటారు, తద్వారా మీరు మీ ప్రాధాన్యతల జాబితాలో దేవుణ్ణి తక్కువగా చోటు ఇస్తారని.
 మీరు తిరిగి పోరాడాలి. మీరు ఒక రోజు విఫలమైతే, వెనకడుగు వేయద్దు. మిమల్ని మీరే దులిపించుకొండి మరియు మళ్ళీ ప్రయత్నించండి. ఈ విషయంలో మీకు సహాయం చేయమని ప్రభువును అడగండి. "ఆయన కృప మనకు చాలు, ఆయన శక్తి బలహీనతలో ఉత్తమంగా పనిచేస్తుంది" (2 కొరింథీయులు 12:9)

చాలామంది తమ సమయాన్ని దేవునికి ఇవ్వడానికి సాయంత్రం వరకు వేచి ఉండటంలో తప్పు చేస్తారు. కానీ, దురదృష్టవశాత్తు, ఆ సమయానికి, మీరు ఇప్పటికే అలసిపోయి ఉంటారు.

సమయం లోకంలో అత్యంత విలువైన వస్తువు. సమయం నిజంగా ఎంత విలువైనదో మనలో చాలా మందికి తెలియదు.
 
ఒక సంవత్సరం విలువ:
ఒక తరగతి విఫలమైన విద్యార్థిని అడగండి

ఒక గంట విలువ:
తను ఎక్కే విమానంలో తప్పిన వ్యక్తిని అడగండి ఎందుకంటే అతని మొదటి గంట ఆలస్యం అయింది.

1 సెకను విలువ:
పతకం సాధించడంలో విఫలమైన ఒలింపిక్ అథ్లెట్‌ను అడగండి ఎందుకంటే అతడు దానిని ఒక సెకనులో కోల్పోయాడు.

ఈ విధంగా సమయం చాలా ముఖ్యమైనది, మరియు మనం ప్రతిరోజూ మన సమయాన్ని దేవునికి అప్పగించినప్పుడు, మన దగ్గర ఉన్నదానిలో ఉత్తమమైనదాన్ని ఆయనకు అర్పిస్తున్నాము. మనము ఇప్పుడు ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నాము.

దేవుడు మనందరికీ ఒకే వరములు మరియు సామర్ధ్యాలను ఇవ్వలేదు, లేదా అదే మొత్తంలో సంపదను ఇవ్వలేదు, కాని ఆయన మనలో ప్రతి ఒక్కరికి ఒకే సమయాన్ని ఇచ్చాడు.
ప్రార్థన
తండ్రీ, ప్రతిరోజూ, నేను నిన్ను వెతుకుతాను (కనుగొంటాను). నీ కృపను నాకు దయచేయి. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ఎవరికీ రోగనిరోధక శక్తి లేదు
● ఒక మాదిరిగా (ఉదాహరణ) ఉండండి
● 05 రోజు: 21 రోజుల ఉపవాసం & ప్రార్థన
● నేటి కాలంలో ఇలా చేయండి
● ఇతరులను సానుకూలంగా ఎలా ప్రభావితం చేయాలి
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 6
● రెడ్ అలర్ట్ (ప్రమాద హెచ్చరిక)
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్