సంవత్సరాలుగా, నేను నేర్చుకున్న ఒక సిధ్ధాంతం ఏమిటంటే: "మీరు నిజంగా గౌరవించే వాటిని మాత్రమే మీరు ఆకర్షిస్తారు మరియు మీరు అగౌరవపరిచే వాటిని తిప్పికొడతారు." నిరంతరం ఆర్థిక సమస్యలతో పోరాడే ప్రజలు డబ్బును గౌరవించడం మరియు విలువైనదిగా పరిగణించడం గమనించదగినది, మరియు ఈ వైఖరి తరచుగా వారు డబ్బును ఖర్చుపెట్టే విధానంలో ప్రతిబింబిస్తుంది. 'విలువ' మరియు 'మర్యాద' ఆరాధనకు భిన్నంగా ఉన్నాయని గమనించడం ముఖ్యం, ఇది దేవునికి మాత్రమే చెందినది (నిర్గమకాండము 20:2-3).
మర్యాద మరియు విలువ ఎందుకు ముఖ్యమైనవి?
మర్యాద మరియు విలువ చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి దైవ క్రమాన్ని తీసుకువస్తాయి. మర్యాద మరియు విలువ ఉన్నచోట కలహాలు మరియు అల్లరికి ఆస్కారం ఉండదు. "దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు" (1 కొరింథీయులకు 14:33). ఒకరి జీవితంలో, వివాహం మరియు ఆర్థిక విషయాలలో క్రమం మరియు సమాధానము లేకుండా, అభివృద్ధి పరిమితం కావచ్చు. ఈ రోజు మనం మర్యాద మరియు విలువైన వాటిలో చాలా వరకు కాలక్రమేణా నేర్చుకుంటుంన్నాము, ఇది తరచుగా బాల్యం లేదా కౌమారదశలో ప్రారంభమవుతుంది. ఏది ఏమైనప్పటికీ, అబద్ధానికి జనికుడు అయిన అపవాది, ఈ రోజు మనం పెద్దలుగా వస్తువులను లేదా వ్యక్తులను విలువైనదిగా మరియు మర్యదగా విధానాన్ని ప్రభావితం చేసే తప్పుడు నమ్మకాలతో మనకు ఆహారం ఇచ్చి ఉండవచ్చని గమనించాలి.
ఉదాహరణకు, డబ్బు చెడ్డదని లేదా సంపద ఉన్నత వర్గాల కోసం మాత్రమే కేటాయించబడిందని మనకు బోధించబడితే, మన ఆర్థిక విలువలను లెక్కించడంలో మరియు నిర్వహించడంలో మనం కష్టపడవచ్చు. ఏది ఏమైనప్పటికీ, సంపద మరియు ఆస్తులు దేవుని బహుమతులు అని బైబిలు మనకు బోధిస్తుంది మరియు వాటిని తెలివిగా నిర్వహించడం మన బాధ్యత (సామెతలు 10:22, లూకా 12:48).
మీరు మీ విలువల వ్యవస్థను ఎలా మార్చుకోగలరు?
మీరు మీ విలువల వ్యవస్థను మార్చుకోవాలనుకుంటే, పాత నిబంధనలో దావీదు మహారాజు సలహా సహాయకరంగా ఉండవచ్చు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆయన సూచిస్తున్నాడు.
కీర్తనలు 1:1-3లో బైబిలు మనకు ఉపదేశిస్తుంది, "దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును."
ధ్యానించడం అంటే లోతుగా ఆలోచించడం, దీర్ఘాంగా ఆలోచించడం మరియు దేవుడు తన వాక్యం ద్వారా ఏమి తెలియజేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఈ బోధనలు మన అనుదిన జీవితానికి ఎలా వర్తిస్తాయి మరియు ఈ సానుకూల లక్షణాలను మన వ్యక్తిత్వాలలో ఎలా చేర్చుకోవచ్చో మనం ఆలోచించాలి.
ఫిలిప్పీయులకు 4:8లో, పౌలు మన మనస్సులను సత్యమైన, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతిగల, శ్రేష్ఠమైన మరియు స్తుతులకు అర్హమైన వాటిపై కేంద్రీకరించమని ఉద్బోధిస్తున్నాడు. ఈ అభ్యాసం మన ఆలోచనను మార్చగలదు మరియు దేవుడు విలువైనది మరియు మర్యాదించే వాటిని విలువైనదిగా మరియు మర్యాదించేలా మన మనస్సులను పునరుద్ధరించగలదు. మీరు దేనిని గౌరవిస్తారో, మీరు ఆకర్షిస్తారు మరియు మీరు అగౌరవపరిచే వాటిని మీరు తిప్పికొడుతారని గుర్తుంచుకోండి.
ప్రార్థన
ప్రియమైన పరలోకపు తండ్రీ, ఈ రోజు నేను వినయ గల హృదయంతో నీ యొద్దకు వస్తున్నాను. నా విలువల వ్యవస్థ నీ ఇష్టానికి అనుగుణంగా ఉండేలా చేయి. నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నీ బోధలను ధ్యానించుటకు మరియు ప్రతిబింబించుటకు మరియు వాటిని నా అనుదిన జీవితంలో చేర్చుకొనుటకు నాకు నీ కృపను దయచేయి. యేసు నామములో, ఆమేన్.
Join our WhatsApp Channel
Most Read
● 07 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన● మీ లక్ష్యాలను సాధించే శక్తిని పొందుకోండి
● పెంతేకొస్తు కోసం వేచి ఉండడం
● మానవ స్వభావము
● 16 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 20 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● విశ్వాసులైన రాజుల యాజకులు
కమెంట్లు