అనుదిన మన్నా
శాంతి మిమ్మల్ని ఎలా మారుస్తుందో తెలుసుకోండి
Friday, 28th of April 2023
0
0
634
Categories :
దేవదూతలు (Angels)
శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. (యోహాను 14:27)
ప్రభువైన యేసు చెప్పాడు, "నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను...."
శాంతి మనకు ప్రభువైన యేసుక్రీస్తు నుండి వచ్చిన బహుమానము. ఇది మనతో పంచుకోవాలనే ఆయన కోరికను కూడా వెల్లడిస్తుంది. ఎవరో ఒకసారి ఇలా అన్నారు, “యేసు కేవలం మనలో నివసించాలని కోరుకోవడం లేదు, కానీ ఆయన మనలో ముఖ్యుడిగా ఉండాలనుకుంటున్నాడు.” లోకము కార్యాలు ద్వారా లేదా ప్రతిబింబించే జీవనశైలి ద్వారా శాంతి కోసం శోధిస్తున్నప్పుడు, శాంతి యేసులో మాత్రమే ఉందని గ్రహించండి, ఎందుకంటే ఆయన సమస్త శాంతికి మూలం.
మరల యేసు ఇలా అన్నాడు, “(శాంతి) లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు.
లోకము ఇచ్చే శాంతి తరచుగా రాజీ మరియు తారుమారుపై ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే శాంతి ఆయన సిలువ బలి మరణంపై ఆధారపడి ఉంటుంది.
"ఆయన (యేసు) సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచు కొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. (కొలొస్సయులకు 1:23)
క్రీస్తు మనకు అందించే శాంతి త్యాగపూరితమైనది, ఎందుకంటే దీని కోసం ఆయన సమస్త వెల చెల్లించాల్సి వచ్చింది - ఆయన జీవితం.
ప్రభువైన యేసు ఇంకా ఇలా అన్నాడు, "మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి."
చాలా మంది భయం, నిరాశ, నిద్రలేమి మరియు ఇతర ఒత్తిడికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని నాకు వ్రాస్తారు. ఇది తరచుగా వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక యువకుడు నాకు వ్రాశాడు, అతడు పరీక్ష నుండి బయటపడటానికి ప్రతిరోజూ ఐదు మాత్రలు వేసుకోవాలని. నేను చెప్పేది బాగా వినండి, మీ భయాలన్నిటికీ శాంతి నిశ్చయమైన నివారణ.
నా జీవితంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన సందర్భం ఉంది. నేను ఒక ప్రార్థన సభకు హాజరయ్యాను మరియు నేను ఆరాధిస్తున్నప్పుడు, “ప్రభువా, నేను ముగింపుకు చేరుకున్నాను; నేను నీకు లోబడుతున్నాను; దయచేసి నాకు సహాయం చేయి” ఆ సమయంలో, నేను ఏ దేవదూతలు లేదా దర్శనాలను చూడలేదు, కానీ ఈ శాంతి నా హృదయాన్ని నింపింది. ఆత్మహత్య ఆలోచనలన్నీ మాయమయ్యాయి.
ప్రభువు నా కోసం చేయగలిగితే, ఆయన ఖచ్చితంగా మీ కోసం కూడా చేస్తాడు. దేవుడు వ్యక్తుల పట్ల పక్షపాతి చూపడు. (అపొస్తలుల కార్యములు 10:34)
ఒప్పుకోలు
1. మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు, మనము 2023 ఉపవాసం (మంగళ/గురు/శని) చేస్తున్నాము. ఈ ఉపవాసం ఐదు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది. మీరు కరువు మీద తప్పకుండా విజయం పొందుతారు.
2. ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
3. అలాగే, మీరు ఉపవాసం లేని రోజుల్లో ఈ ప్రార్థన అంశాలను ఉపయోగించండి
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
శాంతి గల దేవా, నేను నా జీవితాన్ని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను; దయచేసి యేసు నామములో నాతో ఉండుము.
కుటుంబ రక్షణ
నా జీవితంలో మరియు కుటుంబ సభ్యులలో శాంతికి ఆటంకం కలిగించే ప్రతి శక్తి యేసు నామములో నరికివేయబడును గాక. నీ శాంతి నా జీవితంలో మరియు కుటుంబ సభ్యులలో ఉండును గాక.
ఆర్థిక అభివృద్ధి
నేను మరియు నా కుటుంబ సభ్యులు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉండుము. మేము చేయునదంతయు దేవుని మహిమ కోసం సఫలమగును. (కీర్తనలు 1:3) మేము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. (గలతీయులకు 6:9)
KSM సంఘము
పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యుల శాంతికి ఆటంకం కలిగించే ప్రతి శక్తి యేసు నామములో నరికివేయబడును గాక. నీ శాంతి వారి జీవితములో ఉండును గాక.
దేశం
ప్రభువైన యేసు, నీవు శాంతికి అధిపతివి. మా దేశ సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నాం. నీ శాంతి మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము.
Join our WhatsApp Channel
Most Read
● మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము● ఇవ్వగలిగే కృప - 3
● మీ మార్పును ఏది ఆపుతుందో తెలుసుకోండి
● అంతర్గత నిధి
● స్నేహితుని అభ్యర్థన: ప్రార్థన ద్వారా ఎన్నుకొనుట
● కార్యాలయంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి - I
● నా దీపమును వెలిగించు ప్రభువా
కమెంట్లు