english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ ప్రతిదినము మిమ్మల్ని నిర్వచిస్తుంది
అనుదిన మన్నా

మీ ప్రతిదినము మిమ్మల్ని నిర్వచిస్తుంది

Tuesday, 20th of February 2024
0 0 1374
Categories : శిష్యత్వం (Discipleship)
ప్రతి రోజు (దినము) మీ జీవితం యొక్క ఛాయాపటము. మీరు మీ దినమును ఎలా గడుపుతారు, మీరు చేసే పనులు, ప్రతి రోజు మీరు కలుసుకునే వ్యక్తులు మీ భవిష్యత్తును ఎలా రూపొందిస్తారనే దాని గురించి చాలా కనపరుస్తుంది. మీరు మీ దినమును గడుపుతున్నప్పుడు, మీరు మీ భవిష్యత్తును సృష్టించుకుంటారు.

లేఖనం కూడా 'ప్రతిదినము' యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. యేసు ప్రభువు ఇలా సెలవిచ్చారు, "ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను" (లూకా 9:23). యేసయ్యను వెంబడించడం అంటే వారానికో, నెలకో లేదా సంవత్సరానికో కాదు - ఇది మనం చేయవలసిన ప్రతిదినము పని.

యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. (కీర్తనలు 96:2)

'అనుదినము' అనే వాక్యాన్ని గమనించండి. ఇది కేవలం 'ప్రతిదినము' అని అర్థం. మనం అనుదినము స్తుతించాలి (యెహోవా మీద పాడాలి). మనం మన జీవితంలో కూడా ఆయన చేసిన కార్యానికి సాక్ష్యంగా ఉండాలి, కేవలం వారానికో, నెలకో కాదు 'అనుదినము'.

ముఖ్యముకాని దినము లేదా పనికిరాని దినము అంటూ ఏదీ లేదు. అందుకే బైబిలు ఇలా సెలవిస్తుంది:
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము 
దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. (కీర్తనలు 118:24)
ఉత్సహించి సంతోషించమని దేవుడు మిమల్ని బలవంతం చేయడు. మన జీవితంలో మరో దినము కోసం సంతోషించడం మరియు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం అనేది మన ఎంపిక.

కాబట్టి మీరు గమనించండి, మీ భవిష్యత్తు యొక్క మర్మము మీ దినచర్యలో దాగి ఉంది. ఎవరో ఇలా అన్నారు, "మీ దినచర్యను నాకు చూపించండి, మీరు ఎంత దూరం వెళ్లగలరో నేను మీకు చెప్తాను." చాలా మంది అగ్రశ్రేణి కోటీశ్వరులు ఈ మర్మము తెలుసు మరియు మీరు మరియు నేను దీనిని పాటించే సమయం ఆసన్నమైంది.

యేసు ప్రభువు ఇలా సెలవిచ్చారు, "రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును" (మత్తయి 6:34)

రేపు ఎలా ఉంటుందోనని చాలా మంది ఆందోళన మరియు ఆత్రుతగా ఉన్నారు. మన 'అనుదినము' పై దృష్టి కేంద్రీకరించమని చెప్పడం ద్వారా ప్రభువైన యేసు ఆందోళన మరియు ఆత్రుతనను అధిగమించే రహస్యాన్ని వెల్లడిపరిచాడు. రేపటి పంటకు ఈ రోజే విత్తనం. మీరు విద్యార్థి, కార్యనిర్వాహకుడు లేదా వ్యాపార వ్యక్తి కావచ్చు; మీరు ఈ రోజు మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలిగితే, మీ రేపటిని గూర్చి జాగ్రత్త తీసుకోబడుతుంది.

ఇంకొక విషయం: "దేవుడు ఇచ్చిన కల చుట్టూ మీరు ఎల్లప్పుడూ మీ అనుదిన కార్యమును నిర్మించుకోవాలి" అని ఒక గొప్ప దేవుని దాసుడు ఒకసారి చెప్పడం నేను విన్నాను. కాబట్టి ప్రతి నియామకమును, మీరు చేసే ప్రతిదాన్ని, మీరు ఎక్కడికి వెళతారు, ఎవరిని కలుస్తారు అనే దాని ప్రకారం జాబితా చేయండి. నేను ప్రయత్నించి చేసేది ఇదే. ఇది కొంతమందికి కలవరపెట్టవచ్చు, కానీ దినం చివరిలో, మిమ్మల్ని పిలిచిన దేవునిని మీరు సంతోషపరుస్తారు.

ఒప్పుకోలు
(ప్రతిరోజూ ఇలా చెప్పండి) ఈరోజు నా జీవితంలో అత్యుత్తమైన రోజు. మునుపెన్నడూ లేనివిధంగా ఈరోజు నేను ప్రార్థిస్తాను మరియు ఆరాధిస్తాను. మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు నేను దేవుని కృపను అనుభవిస్తాను. ఈరోజు, మునుపెన్నడూ లేని విధంగా దేవుని శక్తి నా ద్వారా వ్యక్తమవడం నేను చూస్తాను. ఈ రోజు నేను నా దైవిక సహాయకులను కలుస్తాను. ఈ దినం గొప్పగా ఉత్సహించి సంతోషకరమైన దినము.


Join our WhatsApp Channel


Most Read
● సాతాను మిమ్మల్ని ఎక్కువగా అడ్డుకునే ఒక రంగం
● అరుపు కంటే కరుణింపు కొరకు రోదన
● ఆయన ద్వారా ఏ పరిమితులు లేవు
● 28 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దేనికి కాదు డబ్బు
● 03 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మీ బలహీనతలను దేవునికి ఇయుడి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్