english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 04 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
అనుదిన మన్నా

04 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన

Thursday, 14th of December 2023
1 1 1095
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
మంచి విషయాల యొక్క పునరుద్ధరణ

"మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను." (యోబు 42:10)

పునరుద్ధరణ, ప్రపంచం యొక్క సాధారణ పరిభాషలో, పాతదిగా మారిన, అరిగిపోయిన, శిథిలమైన లేదా విచ్ఛిన్నమైన దానిని గతంలో ఉన్న విధంగా తిరిగి మార్చే ప్రక్రియను గురించి సూచిస్తుంది. అయితే, పునరుద్ధరణ, దేవుని వాక్యం ప్రకారం, ప్రాపంచిక పునరుద్ధరణకు భిన్నంగా ఉంటుంది. బైబిలు ప్రకారం, "పునరుద్ధరణ" అనే పదం ఏదైనా దాని పూర్వ స్థితికి పునరుద్ధరించే ప్రక్రియను గురించి సూచిస్తుంది, అయితే అది మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉండే విధంగా దాన్ని మెరుగుపరుస్తుంది.

యోబు విషయములో కంటే ఏదీ స్పష్టంగా తెలియజేస్తుంది. యోబు 42:12 ఇలా చెబుతోంది: "యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటె మరి అధికముగా ఆశీర్వదించెను."

శత్రువు ఏది దొంగిలించినా-అది మీ ఆరోగ్యం, మీ ఆర్థిక భద్రత, మీ మనశ్శాంతి లేదా మీకు ఇష్టమైన మరేదైనా సరే-దేవుడు దానిని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేస్తాడు. శత్రువు ఏమి చెప్పినా, ప్రభువైన యేసు చివరి మాటను కలిగి ఉంటాడు ఎందుకంటే మన పట్ల దేవుని చిత్తం పునరుద్ధరించబడాలి.

ఒక దొంగ పట్టుబడినప్పుడు దేవుడు నిర్దేశించిన ఆధ్యాత్మిక సిధ్ధాంతాల ప్రకారం, అతడు మన నుండి తీసుకున్న దానికి ఏడు రెట్లు తిరిగి చెల్లించాలి. (సామెతలు 6:31 చదవండి) దొంగిలించడం, చంపడం మరియు నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో దొంగ వస్తాడు, కానీ దేవుడు మన జీవితాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే స్థాయికి తీసుకువస్తాడు. ఆయన మునుపటి కంటే ప్రతిదీ మెరుగుపరుస్తాడు.

విశ్వాసి నుండి అపవాది దొంగిలించగలడా?
అవును. అపవాది అనుమతితో పనిచేస్తాడు; ప్రవేశం లేకుండా, వాడు విశ్వాసి నుండి దొంగిలించలేడు (ఎఫెసీయులకు 4:27). విశ్వాసుల నుండి అపవాది దొంగిలించగల కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

1. దైవ సూచనలకు అవిధేయత చూపడం
అవిధేయత మన ఆధ్యాత్మిక కవచంలో అంతరాన్ని సృష్టిస్తుంది, మనల్ని అపవాది తంత్రములకు గురి చేస్తుంది. ఇది మీ ఇంటి తలుపును తెరచి ఉంచడం, అనవసరమైన అతిథులను ఆహ్వానించడం లాంటిది. మరోవైపు, దేవునికి విధేయత చూపడం, రక్షణను అందజేస్తుంది మరియు ఆయన మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదం క్రింద ఉంచుతుంది.

దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించేలా చేయడం ద్వారా భూమిపై ఆదాము యొక్క అధికారాన్ని అపవాది దొంగిలించాడు. 1 సమూయేలు 15:22 మనకు ఇలా చెబుతోంది, "బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము." ఈ వచనము ఏ విధమైన ఆచార భక్తి కంటే విధేయత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

2. తప్పుడు ఆలోచన
మన ఆలోచనలే మన క్రియల నమూనా చిత్రం. అవి దేవుని సత్యానికి అనుగుణంగా లేనప్పుడు, అవి మనలను వినాశన మార్గంలో నడిపించగలదు. అపవాది తరచుగా సందేహం, భయం మరియు ప్రతికూలత యొక్క విత్తనాలను నాటుతాడు, దీనిని అడ్డుకొనకపోతే  హానికరమైన క్రియలకు దారితీస్తుంది.

దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఊహలు, ఆలోచనలు మరియు జ్ఞానాన్ని మీరు వదులుకోవాలి. (2 కొరింథీయులకు 10:5). ప్రజలు తప్పుడు విషయాల గురించి ఆలోచించినప్పుడు, అది వారి ఒప్పుకోలు మరియు క్రియలకు ప్రభావితం చేస్తుంది.

ఫిలిప్పీయులకు 4:8 మన ఆలోచనలను ఎలా మరియు దేనిపై కేంద్రీకరించాలో మనకు నిర్దేశిస్తుంది, "మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి."

3. తప్పుడు ఒప్పుకోలు
మాటలకు మన వాస్తవికతను చిత్రించే శక్తి ఉంది. సానుకూల ప్రకటనలు సానుకూల ఫలితాలకు దారితీసినట్లే, ప్రతికూల ఒప్పుకోలు ప్రతికూల ఫలితాలను ఆకర్షించగలవు. అపవాది మనకు వ్యతిరేకంగా పనిచేయడానికి మన స్వంత మాటలను ఉపయోగిస్తాడు, మన భయాలను మరియు సందేహాలను వాస్తవంగా మారుస్తుంది.

దేవుని శపించడానికి యోబు తప్పుడు విషయాలు చెప్పడానికి అపవాది ప్రయత్నించాడు, కానీ యోబు నిరాకరించాడు. "నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు." (సామెతలు 6:2)

యాకోబు 3:10 మన మాటల శక్తిని, వాటిని జ్ఞానయుక్తంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. "ఒక్కనోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు."

4. తప్పుడు సహవాసం
దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఆయన ఒక పురుషుడిని లేదా స్త్రీని పంపుతాడు. అపవాది కూడా మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు, వాడు ఒక పురుషుడిని లేదా స్త్రీని పంపుతాడు. దీని ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు కలిగి ఉన్న స్నేహితుల పట్ల మరియు మీరు కలిగి ఉన్న సహవాసం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు సహవాసాల వల్ల చాలా మంది మంచి విషయాలను పోగొట్టుకున్నారు.

అలా మోసపోయి తప్పుదారి పట్టించకండి! చెడు సాంగత్యము (కలసి ఉండడం, సాంగత్యం) మంచి నడవడికను మరియు నైతికత మరియు స్వభావాన్ని పాడు చేస్తాయి. (1 కొరింథీయులకు 15:33)

మీరు అనుభవించిన ఎదురుదెబ్బలు, నష్టాలు, బాధలు, తప్పులు మరియు నష్టాలు ఉన్నప్పటికీ పునరుద్ధరణ సాధ్యమవుతుంది. సాతాను చాలా వస్తువులను తీసివేయవచ్చు, కానీ ప్రభువు ప్రతిదీ పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసాడు మరియు ఆయన ప్రతిదీ పునరుద్ధరించగలడు.
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)

1. తండ్రీ, నా జీవితంలో మంచి సంగతులు పునరుద్ధరణ యేసు నామములో జరుగును గాక. (యోవేలు 2:25)

2. నా జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆధ్యాత్మిక దొంగలు మరియు నష్టం కలిగించే వాని యొక్క కార్యాలను నేను యేసు నామములో భంగపరుస్తున్నాను మరియు రద్దు చేస్తున్నాను. (యెషయా 54:17)

3. నా జీవితంలో మంచి సంగతులను నాశనం చేసే సాతాను ప్రతినిధి యొక్క కార్యాలను నేను  యేసు నామములో స్తంభింపజేస్తున్నాను. (లూకా 10:19)

4. ఓ దేవా, నేను కోల్పోయిన ఆశీర్వాదాలు, విధి యొక్క సహాయకులు మరియు సద్గుణాలన్నింటినీ దయచేసి నాకు మరల యేసు నామములో దయచేయి.

5. తండ్రీ, నా శరీరములో మరియు జీవితంలో దెబ్బతిన్న వాటిని యేసు నామములో బాగు చేయి. (యిర్మీయా 30:17)

6. తండ్రీ, కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాలను వెంబడించడానికి, అధిగమించడానికి మరియు తిరిగి పొందేందుకు నాకు యేసు నామములో అధికారం దయచేయి. (1 సమూయేలు 30:19)

7. ఆశీర్వాదం యొక్క ప్రతి మూసివేసిన తలుపు యేసు నామములో తిరిగి తెరవబడును గాక. (ప్రకటన 3:8)

8. తండ్రీ, యేసు నామములో నా నుండి తప్పిపోయిన విధి సహాయకులతో నన్ను మళ్లీ కలుపు. (రోమీయులకు 8:28)

9. నా జీవితములో సంపద, ఆశీర్వాదం మరియు కీర్తి యొక్క ఏడింతలు పునరుద్ధరణ జరగాలని యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. (సామెతలు 6:31)

10. తండ్రీ, యేసు నామములో నీ పరిశుద్ధ స్థలము  నుండి నాకు సహాయమును  పంపు. (కీర్తనలు 20:2)

11. దేవా, శత్రువుల మోసము నుండి నన్ను రక్షించుము మరియు నీ సత్యముతో నా హృదయాన్ని ప్రకాశింపజేయుము, తద్వారా నేను అపవాది యొక్క కుయుక్తులకు వ్యతిరేకంగా స్థిరంగా నిలబడతాను. యేసు నామములో. (ఎఫెసీయులు 6:11)

12. పరలోకపు తండ్రీ, ప్రతి బంధన గొలుసును తెరువు మరియు ఏ విధమైన ఆధ్యాత్మిక చెర నుండి నన్ను విడిపించు. నా జీవితంలోని ప్రతి రంగములో, నీ స్వేచ్ఛను  యేసు నామములో పాలించును గాక. (యెషయా 58:6)

Join our WhatsApp Channel


Most Read
● దేవుని యొక్క 7 ఆత్మలు: యెహోవా యెడల భయభక్తులు గల ఆత్మ
● యేసు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు?
● పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం - II
● లొపలి గది
● నేటికి కనుగొనగలిగే అరుదైన విషయం
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 4
● దైవికమైన సమాధానము ఎలా పొందాలి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్