english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. హెచ్చరికను గమనించండి
అనుదిన మన్నా

హెచ్చరికను గమనించండి

Monday, 13th of March 2023
1 1 981
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు, ఆ ప్రాంతాన్ని జయించమని మరియు భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ, తమ భూమిని వదులుకునే ఉద్దేశం లేని అనేక అన్యమత వంశములు ఈ దేశములో నివసించినందున ఇది అంత తేలికైన పని కాదు.

1 "నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుట నుండి వెళ్లగొట్టిన తరువాత 2 నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు,. (ద్వితీయోపదేశకాండము 7:1-2)

ఇశ్రాయేలీయులు ఓడించే బాధ్యత వహించిన ఏడు గిరిజన దేశాలు:
1. హిత్తీయులు
2. గిర్గాషీయులు
3. అమోరీయులు
4. కనానీయులు
5. పెరిజ్జీయులు
6. హివ్వీయులు
7. యెబూసీయులు

ఈ వంశాలు విగ్రహారాధన, అనైతికత మరియు నరబలి వంటి క్రూరమైన పద్ధతులకు ప్రసిద్ధి చెందాయి. ఇశ్రాయేలీయులు ఈ ప్రత్యర్థి దేశాలతో వ్యవహరించకపోతే, వారు తమ ఆచారాలచే పాడు చేయబడతారు మరియు చివరికి వారినే దేశం నుండి వెళ్లగొట్టబడతారని దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు.

అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. (సంఖ్యాకాండము 33:55)

ఈ హెచ్చరిక ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా నేడు మనకు క్రియాత్మకంగా వర్తిస్తుంది. క్రియాత్మకమైన అన్వయం నుండి, మీ ఆధ్యాత్మిక కళ్ళు అసత్యం నుండి సత్యాన్ని గుర్తించడానికి ఉపయోగించబడతాయి మరియు తప్పుడు బోధలు మరియు నమ్మకాలు మన జీవితాల్లో ఉండటానికి అనుమతించడం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా ఉంటుంది.

న్యాయాధిపతుల పుస్తకములోని చివరి వచనం ఇలా చెబుతోంది: ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. (న్యాయాధిపతులు 21:25)

ఇది ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టిన అన్యమత ప్రజల గురించి కాదు - ఇది దేవుని ప్రజల గురించి మాట్లాడుతోంది! వారు సరిగ్గా చేయడానికి హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు, కానీ వారు పూర్తిగా ధ్యానాన్ని కోల్పోయారు మరియు వారు దానిని కోల్పోతున్నట్లు కూడా వారికి తెలియదు. తాము చేస్తున్నది సరైనదని వారు భావించారు!

యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. (కీర్తనలు 19:8) మీ భౌతిక కళ్ళను మాత్రమే నమ్మకండి - అవి మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరిగే దేనినైనా తొలగించడంలో మరియు ఆయన సత్యం మీద దృష్టి కేంద్రీకరించడంలో మనం అప్రమత్తంగా ఉండాలి.

శారీరకంగా, పరుగెత్తడం లేదా నడవడములో ప్రక్కన లేదా బహిరంగ ప్రాంతం కీలకం, మరియు ఈ ప్రాంతంలో ఏదైనా గాయం లేదా బలహీనత ముఖ్యమైన అడ్డంకులను కలిగిస్తుంది. అదేవిధంగా, మన జీవితాలలో, మన అభివృద్ధికి ఆటంకం కలిగించే బలహీనత లేదా దుర్బలత్వం యొక్క ఏవైనా ప్రాంతాలను గుర్తించి పరిష్కరించాలి. ఇది చెడు అలవాటు అయినా, విషపూరితమైన బంధం అయినా లేదా మన దినచర్యలో క్రమశిక్షణ లేకపోవడం అయినా, ఈ అడ్డంకులను తొలగించి, మన లక్ష్యాల మీద దృష్టి పెట్టడానికి మనం కార్య రూపం దాల్చాలి

ప్రార్థన
ప్రియమైన పరలోకపు తండ్రీ, ఆధ్యాత్మిక వివేచన అనే వరమును కోరుతూ ఈరోజు నేను నీ యొద్దకు వస్తున్నాను. శత్రువుల పన్నాగాలకు నేను మోసపోకుండా ఉండేందుకు అబద్ధం నుండి సత్యాన్ని చూడడానికి మరియు అర్థం చేసుకోవడానికి నా కళ్ళును తెరువు. నా అభివృద్ధికి ఆటంకం కలిగించే బలహీనత లేదా దుర్బలత్వం ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయం చేయి. యేసు నామములో. ఆమెన్!


Join our WhatsApp Channel


Most Read
● 40 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 03 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మీ గురువు (బోధకుడు) ఎవరు - II
● మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలి - 2
● దేవుడు నిన్ను ఉపయోగించుకోవ లనుకుంటున్నాడు
● లోబడే స్థలము
● 39 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్