english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలి - 2
అనుదిన మన్నా

మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలి - 2

Monday, 25th of March 2024
0 0 1213
Categories : మార్పు (Change)
మన జీవితంలో శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలో మనము అధ్యయనం చేస్తున్నాము.

2. దేవుని మీద (మరియు ఆయన వాక్యం) మీ దృష్టిని కేంద్రీకరించండి. మీరు లోపల నుండి మార్చబడతారు.

మీరు నిజంగా మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను కోరుకుంటే, మీరు దేవుని మీద మరియు ఆయన వాక్యం మీద మీ దృష్టిని కేంద్రీకరించాలి. మీ జీవన విధానాన్ని పెంచడానికి, మీరు మీ ఆలోచనా విధానాన్ని పెంచుకోవాలి.

నిజం చాలా మందికి, వారి జీవితంలో ఏది సరైనది కాదని లోతుగా ఇప్పటికే తెలుసు. అయినప్పటికీ, వారు ఆలోచించే విధానం కారణంగా, వారు ఎల్లప్పుడూ ఆ ఆలోచన విధంగానే తమ జీవితాలను ముగించారు. వారు తమ ఆలోచనలను బట్టి తమ కార్యాలను సమర్థించుకుంటారు. సంవత్సరాలు గడిచిపోతాయి, అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 

శాశ్వతమైన మార్పులను తీసుకురావడానికి, మీరు మన పరిపూర్ణ ఉదాహరణ అయిన క్రీస్తు జీవితం ఆధారంగా మీ జీవితాన్ని మాదిరిగా లేదా ఆదర్శనంగా మార్చుకోవాలి. మీరు బైబిలు - వాక్యంలో కనిపించే పాత, అనారోగ్యకర ఆలోచనా విధానాలను కొత్త సిధ్ధాంతాలతో భర్తీ చేయాలి.

నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒకరోజు వాక్యం చదువుతుండగా నాకు ఈ వచనం కనిపించింది.

పక్షిరాజు యవనమువలె నీ యవనము క్రొత్తదగు చుండునట్లు 
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. (కీర్తనలు 103:4-5)

ఈ వచనం నాతో మాట్లాడింది, నేను మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే, నా నోటిలోకి ప్రవేశించే ఆహారాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రోజు నుండి, నేను నా ఆహారపు అలవాట్లలో మూడు చిన్న మార్పులు చేసాను.
  1. నేను సోడాతో నిండిన ఏ పానీయమును త్రాగను
  2. నేను ఐస్‌క్రీమ్‌లు తినను
  3. నేను అన్ని సమయాల్లో చక్కెరను నివారించడానికి ప్రయత్నిస్తాను
పైన పేర్కొన్నవి చాలా మందికి సరళంగా అనిపించవచ్చు (మరియు కొందరికి భయాన్ని కలిగించవచ్చు), కానీ వాస్తవం ఏమిటంటే, ఇది వ్యక్తిగతంగా నాలో చాలా పెద్ద మార్పును తీసుకువచ్చింది. శాశ్వతమైన మార్పు వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించడంలో మీకు సహాయపడటానికి నేను పంచుకున్న ఒక చిన్న ఉదాహరణ ఇది.

మీ శరీరానికి శిక్షణ ఇవ్వడం, ప్రార్థన మొదలైన అంశాలలో మీరు మీ ఆలోచనా విధానాన్ని పెంచుకోవచ్చు. మీ జీవితం యొక్క తాకిడి మరియు ప్రభావం మీ ఆలోచనా విధానానికి ప్రతిబింబం. ఎవరైనా తమ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా వారి ఆలోచనా విధానాలను పెంచుకోవచ్చు. ఇది డబ్బు గురించి కాదు; ఇది మనస్తత్వానికి సంబంధించినది.

నిజమైన మార్పు ఎప్పుడూ లోపల నుండి వస్తుంది. లోపల నుండి మార్పు అనేది రావాలి, అప్పుడే ఆ మార్పు అందరికీ తెలుస్తుంది.

ప్రతిదీ-మరియు నా ఉద్దేశ్యం ప్రతిదీ, ఆ పాత జీవన విధానంతో అనుసంధానించబడిన ప్రతిదీ మారాలి. ఇది మోసకరమైన దురాశ వలన చెడిపోవు ఉంది. వదులుకోవాలి! ఆపై పూర్తిగా చిత్తవృత్తియందు దేవుని-శైలి జీవితం - నూతన పరచబడినవారై, లోపల నుండి నూతనపరచబడిన జీవితం మరియు నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. (ఎఫెసీయులకు 4:22-24)

కొత్త బట్టల కోసం షాపింగ్ చేసేటపుడు కొత్త బట్టలు వేసుకునే ముందు మనం పాత బట్టలను తీసివేయాలి. మనం కొత్త బట్టలను పాత దాని మీద వేసుకోలేము. ఇది ఆ విధంగా పని చేయదు. అలాగే, శాశ్వతమైన మార్పులను తీసుకురావడానికి, ఆయన వాక్యానికి సరిపోయేలా మన ఆలోచనా విధానాన్ని మనం పెంచుకోవాలి. ప్రతికూల వైఖరులు మరియు పాత లోక ఆలోచనా విధానాలను విడనాడాలని దీని అర్థం.

ఇది కొందరికి చాలా ఎక్కువ పనిగా అనిపించవచ్చు. అయితే, మీ జీవితం మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించండి. వారి ఆలోచనా విధానాలను పెంచడం ద్వారా వారి జీవన విధానాలు పెంచిన గొప్ప వ్యక్తుల ఉదాహరణలను చరిత్ర వివరిస్తుంది. కొన్ని నెలల వ్యవధిలో మీ గురించి కూడా ఆ విధంగా చెప్పవచ్చు.

ప్రార్థన
తండ్రీ, నా అంతరంగములో నీ ఆత్మ ద్వారా నేను శక్తితో బలపరచబడాలని ప్రార్థిస్తున్నాను. విశ్వాసం ద్వారా క్రీస్తు నా హృదయంలో నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● మీరు దేని కోసం వేచి ఉన్నారు?
● ప్రభావం యొక్క గొప్ప పరుధులకు మార్గం
● తన్నుతాను మోసపరచుకోవడం అంటే ఏమిటి? - I
● విధేయత ఒక ఆధ్యాత్మిక గుణము
● పందెంలో గెలవడానికి రెండు పి(P)లు
● దొరికిన గొఱ్ఱెపిల్ల యొక్క ఆనందం
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #1
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్