english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ సన్నిహిత్యాని కోల్పోకండి
అనుదిన మన్నా

మీ సన్నిహిత్యాని కోల్పోకండి

Thursday, 27th of June 2024
0 0 665
Categories : నిలిచియుండుట (Connected)
నేటి కాలంలో, మన దగ్గర అద్భుతమైన సెల్‌ఫోన్‌లు ఉన్నాయి. కొన్ని సెల్ ఫోన్‌లు ఖరీదైనవి మరియు కొన్ని చాలా తెలివిగా ధర కలిగినవి మరియు చవకైనవి. అయితే మీరు భూమి మీద అత్యంత ఖరీదైన ఫోన్‌ని కలిగి ఉండవచ్చు, కానీ అది టవర్‌కి కనెక్ట్ చేయబడకపోతే, అది మంచిది కాదు. మీరు కొన్ని గేములు ఆడటమే కాకుండా దానితో ఎలాంటి లాభదాయకమైన పని చేయలేరు. కలసి ఉండడం చాలా కీలకం.

నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. (యోహాను 15:4)

తీగెతో నిలిచియుంటేనే అది జీవితాన్ని ఇస్తుంది.
తీగెతో నిలిచియుండడం ద్వారా మాత్రమే మీరు ఫలిస్తారు.

జీవితంలో నకిలీ లేని కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మనం యేసయ్యతో నిలిచియుండడం. కొందరు ప్రయత్నిస్తారు, కానీ కొంతకాలం తర్వాత ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

నేను చెట్టుకు ఒక కొమ్మను కట్టి ఉంచితే, ఆ కొమ్మ పెరిగి దాని మీద ఆకులు మరియు ఫలాలు లభిస్తాయా? లేదు. అవి చనిపోయాయి. అయితే చెట్టుకు కట్టి ఉంచినంత మాత్రాన అది నిజంగా చెట్టుతో నిలిచియుండబడిందని అర్థం కాదు. ఆ కొమ్మకు ప్రాణం పోయాలంటే అది చెట్టుకు ప్రాణమిచ్చే రసానికి అనుసంధానం కావాలి.

ప్రభువైన యేసయ్య సెలవిచ్చాడు, "ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును" (యోహాను 15:6).

మనం యేసయ్యతో నిలిచియుండినట్లుగా కనిపించడం చాలా సులభం. కానీ మనం నిజంగా క్రీస్తుతో ఆయన వాక్యం, ప్రార్థన మరియు ప్రభు బల్ల ద్వారా నిలిచియుండకపోతే - అప్పుడు నిజంగా తీగతో సంబంధం లేని కొమ్మలా మన విశ్వాసం ఎండిపోతుంది.

చాలా మంది ప్రజలు మా సభలకు హాజరవుతారు మరియు అందుకు నేను దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే, ఆరాధన జరుగుతున్నప్పుడు, అక్కడ మరియు ఇక్కడ చూడటం చాలా మందిని నేను తరచుగా చూస్తుంటాను. వారు సులభంగా కలత చెందుతారు, ఎవరితోనైనా మాట్లాడుతుంటారు మొదలుగునవి.

హాజరు కావడం అనేది కేవలం మతపరమైన బాధ్యతలను నెరవేర్చడం. అది కేవలం సాంగత్యమే మార్పును తీసుకొస్తుంది. మరియు మనం సాంగత్యాన్ని ఎలా నిర్మించుకోవాలి? సాంగత్యాన్ని నిర్మించి మరియు నిలబెట్టి నిలిచియుండడం ద్వారానే సాధ్యము.

కాబట్టి, మీరు ఒక ఆరాధనకు హాజరైనప్పుడు, దేవుని ఆత్మతో నిలిచియుండుడి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా మీ బైబిలు చదువుతున్నప్పుడు, నిలిచియుండుడి. ప్రతి కలవరాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. మీరు త్వరలో ఫలితాలను చూస్తారు.

ప్రార్థన
ప్రభువైన యేసయ్య, నీవు నిజమైన ద్రాక్షావల్లివి. ఎల్లప్పుడూ నీ యందు నిలిచియుండటానికి (సన్నిహితంగా ఉండటానికి) నాకు సహాయం చేయి. నా జీవితం నీకు మహిమ మరియు ఘనతను తెచ్చే విధంగా ఫలింపును గాక. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యొక్క శక్తి
● ప్రవచనాత్మక పాట
● అవిశ్వాసం
● విత్తనం యొక్క శక్తి -1
● విత్తనం యొక్క శక్తి - 3
● ఎత్తబడుట (రాప్చర్) ఎప్పుడు జరుగుతుంది?
● మొలకెత్తిన కఱ్ఱ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్