అనుదిన మన్నా
0
0
77
పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం - 2
Thursday, 24th of July 2025
పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడానికి మనం సమయం మరియు కృషిని తీసుకున్నప్పుడు, ఆత్మ పరిధిలో ఇతరులు తీసుకోలేని విషయాలను మనం వింటాము మరియు చూస్తాము. మంచి అవకాశాలకు బదులుగా, "దేవుని అవకాశాలు" మన వద్దకు వస్తాయి, కార్యము చేసినప్పుడు, మన జీవితాలు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మనం ఆయన పరిణతి చెందిన శిష్యులమగుదుము (యోహాను 15:8 TPT)
పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి
1. ఆత్మలో ప్రార్ధించుట
1 కొరింథీయులు 14:14 (యాంప్లిఫైడ్): నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు మరియు ఎవరికీ సహాయం చేయదు.
మీరు గమనించండి, పరిశుద్ధాత్మ నా ఆత్మలో నివసిస్తుంది. నా మానవ వ్యక్తితో ఆయన మొదటిగా సంప్రదిస్తాడు నా మనస్సుతో కాదు, నా ఆత్మతో. క్రమం తప్పకుండా భాషలో ప్రార్థించడం నా మానవ ఆత్మ పట్ల సున్నితంగా ఉండటానికి నాకు సహాయపడుతుంది. మరియు పరిశుద్ధాత్మ నా ఆత్మలో ఉన్నందున, నేను భాషలో ప్రార్థించడం ద్వారా అయన పట్ల సున్నితంగా ఉంటాను.
2. ఆయన హృదయం పట్ల సున్నితత్వం కోసం దేవుని అడుగుట
"అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.(మత్తయి 7:7-8)
అడగడం ద్వారా మీరు పొందగలిగే అనేక వస్తువులు ఉన్నాయి. చాలా సార్లు, మనము అడగనందున మనము పొందుకోలేదు (యాకోబు 4:3).
3. అతనితో సమయం గడపండి
ఏదైనా సాంగత్యానికి సమయం అనేది చాలా అవసరం. దేవునితో సాన్నిహిత్యం ప్రాధాన్యత కలిగిన విషయం. జీవితంలో మీరు దేనికి ఎక్కువ విలువను ఇస్తారు? మీరు మీ రోజును క్రమం చేయవలసి ఉంటుంది, కొంత సమయ నిర్వహణ నేర్పును నేర్చుకోవాలి, మీ స్మార్ట్‌ఫోన్‌ని కొంత సమయం పాటు ఆపివేయండి మరియు ముందుకు సాగాలని నిర్ణయించుకోండి. మీ సమయానికి మీరు బాధ్యత వహిస్తారు మరియు ప్రతి మార్పు నాణ్యమైన నిర్ణయంతో మొదలవుతుంది.
4. దేవుని సన్నిధిని అభ్యసించండి
ఆయన సన్నిధిని గురించి అవగాహన పెంచుకోండి. రోజంతా ఆయనతో మాట్లాడండి. మార్గదర్శకత్వం, కృప మరియు మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఆయనని అడగండి. ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయనను స్తుతించండి, మీ హృదయంలో ఆయనను కీర్తించండి. మీరు ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి ముందు ప్రార్థించండి. మీరు వాహనాన్ని నడిపే ముందు ప్రార్థించండి. మీ ఆలోచనలను మరియు మీ జీవితాన్ని రూపొందిస్తాయి.
5. పవిత్రతను అనుసరించండి
దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను (రోమీయులకు 1:4) గమనించండి, అయన 'పరిశుద్ధ లేఖనముల' గురించి. మీరు పరిశుద్ధాత్మను మీ జీవితంలోకి ఆకర్షించాలనుకుంటే, మిమ్మల్ని మీరు మరింతగా పరిశుద్ధపరచుకోవాలి. ఆయనని సంతోషపెట్టని లేదా మిమ్మల్ని మెరుగుపరచని కార్యాలను కత్తిరించండి. ఉద్దేశపూర్వకంగా ఆయనని బాధపెట్టే పనులు చేయవద్దు. మీరు నిజంగా ఒకరిని ప్రేమిస్తే, మీరు అలా చేయగరా?
"...ఆత్మాను సారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు; ఆత్మాను సారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది" (రోమీయులకు 8:5)
దేవుని ప్రవక్త ఇలా చెప్పడం నాకు గుర్తుంది, "మనం నిరంతరం పరిశుద్ధాత్మతో సన్నిహితంగా జీవించాలనుకుంటే, మన జీవనశైలి కూడా ఆయనకు అనుకూలంగా ఉండాలి. మము ఆయనతో సామరస్యంగా ఉండాలి."
Bible Reading: Song of Solomon 5-8 ; Isaiah 1
ప్రార్థన
తండ్రీ, నన్ను సంప్రదించిన ప్రతి ఒక్కరూ నా ద్వారా నీ ఆత్మ శక్తిని అనుభవించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్. (రోజంతా దీన్ని ప్రార్థిస్తూ ఉండండి)
Join our WhatsApp Channel

Most Read
● 07 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన● 05 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● దుఃఖం నుండి కృప యొద్దకు
● మన రక్షకుని యొక్క షరతులు లేని ప్రేమ
● వుని కొరకు మరియు దేవునితో
● మీ అభివృద్ధి ఆపబడదు
● లోబడే స్థలము
కమెంట్లు