అనుదిన మన్నా
భాషలలో మాట్లాడుట మరియు ఆధ్యాత్మికంగా విశ్రాంతి పొందడం
Tuesday, 9th of April 2024
0
0
285
Categories :
భాషలలో మాట్లాడటం (Speaking in Tongues)
"నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి", "ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి" అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు. (యెషయా 28:11-12)
స్మిత్ విగ్లెస్‌వర్త్, దేవుని గొప్ప దాసుడు, ఒక ప్లంబర్ (నీటి గొట్టాలు బాగుచేసే వ్యక్తి). కానీ వేలమంది జీవితాలను మార్చడానికి ప్రభువు అతన్ని ఉపయోగించుకున్నాడు. అతని అలౌకిక పరిచర్య ద్వారా చాలా మంది స్వస్థత పొందారు మరియు విడుదల చేయబడ్డారు.
విగ్లెస్‌వర్త్ ఒకసారి అంత్యక్రియల గృహంలోని కూర్చునే గదిలోకి వెళ్లాడు, అక్కడ ఒక వ్యక్తి మృతదేహం మూడు రోజులు నుండి పడి ఉంది. అతడు దేవుని నుండి పొందిన ఒక కార్యములో ఉన్నాడు. అతడు హఠాత్తుగా కుటుంబ సభ్యులను గది నుండి బయటకు పొమ్మని చెప్పాడు. అప్పుడు అతడు ఆ వ్యక్తిని ఒడిలో పట్టుకుని పేటిక నుండి బయటకు తీశాడు! అతడు శరీరాన్ని గోడకు ఆసరాగా ఉంచి, "బ్రతుకు!" అతడు వ్యక్తి యొక్క శరీరాన్ని విడుదల చేసినప్పుడు, గట్టిపడిన శవం వెంటనే చప్పుడుతో నేలపై పడిపోయింది. ఇక్కడే మీరు మరియు నేను విఫలమవుతాము, కానీ మనలో చాలా మందికి విగ్లెస్‌వర్త్ ( దేవుడు మనకు సహాయం చేస్తాడు) కలిగి ఉన్న ఆ విశ్వాసం లేదు!
విగ్లెస్‌వర్త్ శవం మీద ఉన్న కోటు మడిలను పట్టుకుని, శరీరాన్ని మరోసారి గోడకు ఆసరాగా వేశాడు. మళ్ళీ అరిచాడు, "ఒకసారి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను... బ్రతుకు!" మళ్ళీ బిగుసుకుపోయిన శవం మొదటిసారి లాగానే చప్పుడుతోనే నేలమీద పడింది. మూసి ఉన్న తలుపు వెనుక నుండి వస్తున్న శబ్దంతో ఆ పేద కుటుంబం మరియు అంత్యక్రియల గృహ కార్మికులు లోపల ఏమి ఆలోచిస్తున్నారో ఎవరికి తెలుసు!
మూడోసారి విగ్లెస్‌వర్త్ శవాన్ని ఎత్తుకుని గోడకు ఆసరాగా నిలిపాడు. అతడు శరీరం వైపు వేలు చూపించి ఆజ్ఞాపించాడు: "నేను నీకు ఒకసారి చెప్పాను, నేను నీకు రెండుసార్లు చెప్పాను, కానీ ఈ మూడోసారి తర్వాత మళ్ళీ చెప్పను. ఇప్పుడు బ్రతుకు!" అకస్మాత్తుగా ఆ వ్యక్తి దగ్గుతూ, తల ఊపి, ముఖం తుడుచుకుని, శవ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు! మృతుల ఈ అలౌకిక పునరుద్ధరణ స్మిత్ విగ్లెస్‌వర్త్ ఈ పరిచర్య ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 14 సార్లు జరిగింది.
80 ఏళ్ల వయసులో కూడా ఆయన తేజస్సు తగ్గలేదు. ఒకసారి అతన్ని ఎవరో అడిగారు, "సార్, మీరు సెలవు తీసుకుంటారా?" "నేను రోజూ సెలవు తీసుకుంటాను" అని ఠకీమని సమాధానం ఇచ్చాడు. అప్పుడు అతడు ఇలా వివరించాడు, "నేను ప్రతిరోజు భాషలలో మాట్లాడటం ద్వారా విశ్రాంతి తీసుకుంటాను మరియు తాజాదనం పొందుకుంటాను. అదే నా నిజమైన సెలవు."
తీవ్రమైన ఒత్తిడి మరియు అధిక పనులు మరియు ఇతర ప్రతి ఒత్తిళ్లతో కూడిన నేటి కాలంలో, దేవునితో వ్యక్తిగతంగా గడపడం వల్ల వచ్చే అంతర్గత విశ్రాంతి మనకు తరచుగా చాలా అవసరం. ప్రభువైన యేసయ్య మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును." (మత్తయి 11:28)
మీరు ఈ మధ్య కాలంలో నీరసంగా, అలసిపోయి, ఒత్తిడిలో ఉన్నారా, అప్పుడు మీరు చేయవలసిందల్లా దేవున్ని భాషలలో ఆరాధిస్తూ కొంత యోగ్యమైన సమయాన్ని గడపండి . ఇది మీరు ఆలోచించగలిగే లేదా ఊహించిన దానికంటే మించి మీకు విశ్రాంతిని కలుగజేస్తుంది.
(అనుదిన మన్నా మీకు ఎలా దీవెనకరంగా ఉందొ నాకు తెలియజేయండి. క్రింద కామెంట్ చేయండి. అలాగే, మీ కానుకల ద్వారా దేవుని పనికై మద్దతు ఇవ్వడం మర్చిపోవద్దు)

ప్రార్థన
తండ్రీ, నా అవిశ్వాసానికై నన్ను క్షమించు. నేను నా పూర్ణహృదయంతో నీ తట్టు తిరుగుతున్నాను మరియు నీ సన్నిధి ద్వారా వచ్చే విశ్రాంతిని నేను పొందుకుంటాను. యేసు నామంలో. ఆమెన్. (అపొస్తలుల కార్యములు 3:19)
Join our WhatsApp Channel
Most Read
● పులియని హృదయం● ప్రేమ గల భాష
● మీ కలలను మేల్కొలపండి
● ఇతరులపై ప్రోక్షించడం (మేలు చేయడం) ఆపవద్దు
● స్వతహాగా చెప్పుకునే శాపాల నుండి విడుదల
● రాజ్యానికై మార్గాన్ని స్వీకరించడం
● ఒక మాదిరిగా (ఉదాహరణ) ఉండండి
కమెంట్లు