అనుదిన మన్నా
సాంగత్యం ద్వారా అభిషేకం
Monday, 9th of September 2024
1
1
151
Categories :
సహవాసం (Association)
నేను స్కూల్లో నేర్చుకున్న ఒక పాత సామెత ఉంది: "ఒక గూటి పక్షులు ఒకేచోటికి చేరుతాయి" అది నేటికీ నిజం. ఏదో లేదా ఎవరితోనైనా చేదుగా లేదా మనస్తాపానికి గురైనట్లు అనిపించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఒకే రకమైన ఆలోచన కలిగిన ఇతర వ్యక్తులతో కలిసి ఉండటం నేను తరచుగా చూశాను.
వారు ఏదైనా సందేశాన్ని లేదా ప్రవచనాత్మక వాక్యాన్ని విశ్వసించడానికి నిరాకరిస్తారు. తమ ప్రస్తుత పరిస్థితిని ఏమీ మార్చలేమని వారు ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
మనం సహవాసం చేసే వ్యక్తులు మనపై భారీ ప్రభావాన్ని చూపుతారు. అవి మన వైఖరిని, మన ప్రవర్తనను మన భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి. మనం చదివేవి, మనం చూసేవి మనం సహవాసం చేసే వ్యక్తులు మన భవిష్యత్తుపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి లౌకిక పరిశోధన ఈ వాస్తవాన్ని రుజువు చేస్తుంది.
సామెతలు 13:20, "జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును." అని మనకు నిర్దేశిస్తుంది.
సమూయేలు ప్రవక్త సౌలుతో ఇలా ప్రవచించాడు, "యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును; నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును." (1 సమూయేలు 10:6)
వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగినవారందరు అతడు ప్రవక్తలతో కూడ నుండి ప్రకటించుట చూచి "కీషు కుమారునికి సంభవించిన దేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. (1 సమూయేలు 10:10-11)
సౌలు కేవలం ఒక సాధారణ బిన్యామీయుడు, కానీ అతడు ప్రవక్తల సమూహంతో పరిచయం ఏర్పడినప్పుడు, ఒక అద్భుతం జరిగింది. ప్రవచనాత్మకమైన అభిషేకం సౌలుపైకి వచ్చింది, అతడు కూడా ఇతర ప్రవక్తల వలే ప్రవచించడం ప్రారంభించాడు. ఇక్కడ ఒక కీలక సిధ్ధాంతం ఉంది. సహవాసం ద్వారానే అభిషేకం కూడా ఒకరి నుండి మరొకరికి బదిలీ అవుతుంది.
అపోస్తుల కార్యం 4: 13 ఇలా చెబుతోంది: "వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడ ఉండిన వారని గుర్తెరిగిరి."
యేసు ప్రభువు శిష్యులలో ఎక్కువ మంది మత్స్యకారులు, చదువుకోననివారు, శిక్షణ లేనివారు. అయినప్పటికీ, 3 ½ సంవత్సరాలు వారు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. ఇది యేసు ప్రభువుపై ఉన్న అభిషేకం వారిపై ఉండేలా చేసింది. వారు ఆయనచే ఎంతగానో ప్రభావితమయ్యారు, ఎంతగా అంటే యేసు అద్భుతం చేసిన ఫలితాలను వారు ఉత్పత్తి చేసారు.
దావీదు జీవితాన్ని చూద్దాం:
మరియు ఇబ్బంది గలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి యాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చియుండిరి. (1 సమూయేలు 22:2)
దావీదు చుట్టూ చేరిన వ్యక్తులు అప్పులు, బాధలు, అసంతృప్తితో ఉన్న వ్యక్తులు, కానీ వారు అతనితో సహవసించినప్పుడు, వారి జీవితంలో పరిస్థితులు మారడం ప్రారంభించాయి. వారు బాధ అసంతృప్తి నుండి భయంకర మనుష్యులను చంపే విధంగా మారారు. మళ్ళీ ముఖ్య సిధ్ధాంతం ఏమిటంటే, అభిషేకం సహవాసం ద్వారా పెరుగుతుందని, మనం చూడగలం.
సరైన సాంగత్యం గొప్ప వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. యెహోషువ మోషేతో అనుసంధానించబడ్డాడు. తిమోతి పౌలు మొదలైనవారితో అనుసంధానంగా ఉన్నారు.
నేటి గొప్ప బోధకులు ఆధునిక ప్రవక్తలలో చాలామంది వారు కోరుకునే బహుమానం కలిగి ఉన్న ఒక గురువుతో సంబంధం కలిగి ఉన్నారు.
కొన్నిసార్లు మీరు కోరుకునే అభిషేకంలో గొప్పగా కదిలే ఒక వ్యక్తి చుట్టూ శారీరకంగా ఉండటం అంత సులభం కాదు. అప్పుడు అతని బోధనలకు - అతడు బోధించే సందేశంతో సన్నిహిత సహవాసంకు దగ్గరగా ఉండండి. మీరు వారితో ఎలా సహవాసం చేస్తారు. మీరు అభిషేకంతో ఎలా అనుసంధానం అవుతారు.
చివరగా, ఒక హెచ్చరిక:
విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింట నుండును బుద్ధిహీనుడు దాని వ్యవసాయ పరచును. (సామెతలు 21:20)
అమూల్యమైన నిధి తైలం (అభిషేకం గురించి చెప్పాలంటే) జ్ఞానుల ఇంట్లోనే ఉంటాయని పై లేఖనం స్పష్టంగా చెబుతోంది. దాని వ్యతిరేకం కూడా నిజం.
మీరు సహవాసం తప్పు ప్రదేశానికి వెళితే లేదా తప్పు వ్యక్తితో అనుసంధానం అయినట్లయితే, అభిషేకం ఎండిపోతుంది. మీరు తీసుకువెళ్లినది ఆరిపోతుంది. దేవుడు కార్యం చేయుచున్న ప్రదేశానికి అనుసంధానించబడి ఉండండి.
ఒప్పుకోలు
నేను బుద్ధిగల వారితో నడుస్తాను, మరింత బుద్ధిగలవానిగా అవుతాను. యేసు నామంలో. తండ్రీ, యేసు నామంలో, నేను అభిషేకంలో మరింత ఎదిగేలా చేసే దైవ బంధాలకై నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
Join our WhatsApp Channel
Most Read
● తగినంత కంటే అత్యధికముగా అద్భుతాలు చేసే దేవుడు● మంచి కాపరి
● క్షమించటానికి క్రియాత్మక పద్ధతులు
● మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)
● దేవుని అత్యంత స్వభావము
● పాపముతో యుద్ధం
● గతం యొక్క సమాధిలో భూస్థాపితం కావద్దు
కమెంట్లు