english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మనం దేవదూతలకు ప్రార్థించవచ్చా
అనుదిన మన్నా

మనం దేవదూతలకు ప్రార్థించవచ్చా

Saturday, 8th of March 2025
0 0 108
Categories : దేవదూతలు (Angels) ప్రార్థన (Prayer)
కొంతకాలం క్రితం, ఒక జంట మేము చాలా సంవత్సరాలుగా సంతానం లేని వారని, అందువల్ల వారు సంతానం కోసం ప్రధాన దేవదూత గాబ్రియేలుకు ప్రార్థిస్తున్నారని నాకు వ్రాశారు. మన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక ప్రకటించడంలో దేవదూత గాబ్రియేలు కీలకపాత్ర పోషిస్తున్నందున, అతడు కూడా వారికి బిడ్డను ఆశీర్వదించడంలో కీలకంగా ఉంటాడని వారి ఆలోచనా విధానం. నేను వారిని మందలించలేదు కానీ సున్నితంగా సరిదిద్దాను మరియు వారికి కొన్ని లేఖనాలను చూపించిన తర్వాత వారి కోసం ప్రార్థించాను.

ఈ ప్రియమైన జంట వలె, వారి వివిధ అవసరాల కోసం దేవదూతలకు ప్రార్థించే చాలా మంది ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను తమ సంరక్షక దేవదూతలకు ప్రార్థించమని ప్రోత్సహిస్తారు. ఇది చూడటానికి ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, ఇది వాక్యానుసారము కాదు.

దేవదూతలకు ప్రార్థించాలనే వారి వాదనకు మద్దతుగా, వారు ప్రకటన 8:2-5ని నమ్ముతారు,

2అంతట నేను దేవుని యెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.
3మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
4అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.
5ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమి మీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.

కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, దేవదూతకు ప్రార్థన (విజ్ఞాపన) చేసే ప్రజలు కాదు. దేవదూత దానియేలు పుస్తకంలో ఉన్నట్లుగా ప్రార్థిస్తున్న మధ్యవర్తి నుండి దేవునికి జవాబులు మరియు సమాధానాలను అందించడం వంటి దూత వలె వ్యవహరిస్తున్నాడు.

"మీరు" దేవదూతను ఎలా సంప్రదించాలో తెలియజేసే వందలాది పుస్తకాలను ప్రముఖ ఇంటర్నెట్ సైట్‌లలో ప్రచారం చేయడం నేను చూశాను. కొంత మంది వ్యక్తులు తమ దేవదూతలను ప్రేమించమని మరియు ఆరోగ్యం, స్వస్థత, సంపద, మార్గదర్శకత్వం, ప్రేమ మొదలైన వాటి కోసం వారి అనుచరులను ప్రోత్సహిస్తూ దేవదూతలపై నిపుణులుగా కనిపిస్తారు. ఇది పూర్తిగా మోసం మరియు దేవుని వాక్యానికి విరుద్ధం.

ప్రజలు మోసపోవడానికి ఒక కారణం ఏమిటంటే, వారు వాక్యంలోకి ప్రవేశించకుండా మరియు దానిని చాలా స్పష్టంగా చూడడానికి బదులుగా వ్యక్తి యొక్క స్థానం లేదా పేరు ప్రఖ్యాత వైపు చూస్తారు.

దేవదూతలకు ప్రార్థించడం తప్పు అని చెప్పడానికి అనేక క్రియాత్మక మరియు వాక్యానుసారమైన కారణాలు ఉన్నాయి. (ఈరోజు, నేను ఒకటి మాత్రమే చెబుతాను)

1. ప్రభువైన యేసయ్య, తాను తండ్రికి తప్ప మరెవరికీ ప్రార్థించలేదు

ప్రభువైన యేసయ్య సెలవిచ్చాడు,"ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?" (మత్తయి 26:53)

క్రీస్తు తండ్రికి తప్ప మరెవరికీ ప్రార్థించ (విజ్ఞాపన చేయ) లేదు. గెత్సేమనే తోటలో ఆయన అత్యంత కష్టమైన పరిస్థితిలలో కూడా, ఆయన దేవుని కుమారుడై ఉండి దేవదూతలకు ప్రత్యక్షంగా ప్రార్థించ లేదు, అలా చేయడానికి మీరు మరియు నేను ఎవరు?

ప్రభువైన యేసయ్య తనకు రక్షణ కోసం దేవదూతలను పంపించమని తండ్రిని ప్రార్థించవలసి వస్తే, మన రక్షణకు రావాలని దేవదూతలకు నేరుగా ఎలా ప్రార్థించాలి?

ప్రార్థించడం నేర్పమని ఆయన శిష్యులు అడిగినప్పుడు, ఆయన వారికి ఇలా బోధించాడు, "ఈ విధంగా ప్రార్థించండి: పరలోకమందున్న మా తండ్రీ….(మత్తయి 6:9; లూకా 11:2)

ఒకవేళ శిష్యులు దేవదూతలకు ప్రార్థిస్తే, అలా చేయమని ఆయన మనకు సూచించే స్థానం ఇది కాదా?

Bible Reading: Deuteronomy 21-23

ప్రార్థన
I thank You, Father, that You shall give Your angels charge over my loved ones and me. In their hands, they shall bear us up lest we dash a foot against a stone.

Join our WhatsApp Channel


Most Read
● ఆరాధనకు ఇంధనం
● 19 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● కాపలాదారుడు
● క్రైస్తవులు దేవదూతలను ఆజ్ఞాపించవచ్చా?
● మీరు నిజమైన ఆరాధకులా
● అత్యంత సాధారణ భయాలు
● నరకం నిజమైన స్థలమా
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్