పురాతన హీబ్రూ సంస్కృతిలో, ఇంటి లోపలి గోడల మీద ఆకుపచ్చ మరియు పసుపు గీతలు కనిపించడం తీవ్రమైన సమస్యకు సంకేతం. ఇంట్లో ఒక రకమైన కుష్టు వ్యాధి ఉందనదానికి ఇది సూచన. అదుపు చేయకుండా వదిలేస్తే, కుష్టువ్యాధి ఇంటి అంతటా వ్యాపించి, గోడలు, అంతస్తులు మరియు పైకప్పుకు కూడా భౌతికంగా నష్టం కలిగించవచ్చు.
అంతేకాకుండా, ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం మరియు సంపద కూడా ప్రమాదంలో ఉంది. కలుషితమైన గోడలు మరియు అంతస్తులను ఒక యాజకునిచే పరిష్కరించవలసి ఉంటుంది, అతడు ఇంటిని పరిశీలించి, దానిని నిర్బంధించి, శుద్ధి చేయాలా అని నిర్ణయిస్తాడు. (లేవీయకాండము 14 చదవండి). ఈ ప్రక్రియ పాపం యొక్క తీవ్రతను మరియు దాని హానికరమైన ప్రభావాలను వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తక్షణ క్రియ యొక్క అవసరాన్ని గుర్తు చేస్తుంది.
పాత నిబంధనలో, కుష్టు వ్యాధి ఒక భయంకరమైన వ్యాధి, ఇది చాలా భయం మరియు ఒంటరితనం కలిగిస్తుంది. కుష్టు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన వారు అపరిశుభ్రంగా పరిగణించబడుతారు మరియు వారి కుటుంబాలు మరియు సమాజాలకు దూరంగా పట్టణ గోడల వెలుపల నివసించవలసి ఉంటుంది. (లేవీయకాండము 13:46). కుష్టు వ్యాధి పాపానికి చిహ్నంగా ఉంది, ఇది మనల్ని దేవుడు మరియు ఇతరుల నుండి వేరు చేస్తుంది.
కుష్టు వ్యాధి చిన్న చిన్న లక్షణాలతో మొదలై వేగంగా వృద్ధి చెందినట్లే పాపం కూడా అలాగే వృద్ధి చెందుతుంది. దావీదు మహారాజు విషయములో మనం దీనిని చూస్తాము, అతడు కామం యొక్క పాపంతో ప్రారంభించి, చివరికి వ్యభిచారం మరియు హత్యకు పాల్పడ్డాడు (2 సమూయేలు 11). మనం దానిని ఆపడానికి క్రియ రూపం దాల్చకపోతే పాపం త్వరగా అదుపు తప్పుతుంది.
పాపం యొక్క పరిణామాలు కుష్టు వ్యాధి యొక్క పరిణామాల వలె తీవ్రంగా ఉంటాయి. కుష్టు వ్యాధి శరీరాన్ని నాశనం చేస్తుంది, ఇది నరాల దెబ్బతినడానికి మరియు వికృతీకరణకు కారణమవుతుంది. పాపం ఆత్మను నాశనం చేస్తుంది, మనలను దేవుని నుండి వేరు చేస్తుంది మరియు వినాశన మార్గంలో నడిపిస్తుంది.
లేవీయకాండము 13-14 అధ్యాయాలలో, ఒక కుష్ఠురోగి పరిశుభ్రంగా ప్రకటించబడటానికి అనుసరించాల్సిన ప్రక్రియను మనం చూస్తాము. యాజకుడు వ్యక్తిని పరీక్షించి, వారు ఇంకా అపవిత్రంగా ఉన్నారో లేదో నిర్ణయిస్తాడు. వారు ఉంటే, వారు స్వస్థత పొందే వరకు బసచేయు వెలుపల నివసించవలసి ఉంటుంది. వారు పరిశుభ్రంగా ప్రకటించబడిన తర్వాత, వారు తిరిగి సంఘంలోకి అనుమతించబడుతారు.
అదేవిధంగా, పాపం నుండి పరిశుభ్రంగా ఉండాలంటే, మనం మన పాపాలను అంగీకరించాలి మరియు క్షమాపణ కోసం అడగాలి. 1 యోహాను 1:9 ఇలా చెబుతోంది, "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును." మన పాపాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.
మార్కు 1:40-45లో యేసు కుష్ఠురోగిని స్వస్థపరిచిన విషయము, యేసు భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎలా బాగు చేయగలడు అనేదానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. కుష్ఠరోగి స్వస్థత కోసం వేడుకుంటూ యేసయ్య దగ్గరకు వచ్చాడు, యేసు అతనిని ముట్టుకుని, "నా కిష్టమే; నీవు శుద్ధుడవు కమ్ము!" వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందాడు.
లేవీయకాండములో వలె, కుష్ఠురోగి తమను తాము పరిశుభ్రంగా ప్రకటించడానికి మరియు బలులు అర్పించడానికి ఒక యాజకుడికి చూపించవలసి ఉంటుంది. మార్కు 1లో, ప్రభువైన యేసయ్య కుష్టురోగికి వెళ్లి తన స్వస్థతకు సాక్ష్యంగా యాజకునికి తనను తాను కనపరచవలెనని ఆదేశించాడు.
అలాగే, లేవీయకాండములో, కుష్టురోగి పరిశుభ్రంగా ప్రకటించబడిన తర్వాత సంఘంలో తిరిగి చేరగలిగాడు. మార్కు 1లో, ప్రభువైన యేసయ్య స్వస్థత పొందిన కుష్టురోగికి తనను తాను యాజకునికి కనపరచవలెనని మరియు సూచించిన బలులు అర్పించమని ఆదేశించాడు, అది అతన్ని సంఘములోకి తిరిగి చేరడానికి అనుమతిస్తుంది.
కాబట్టి మీరు గమనించండి, ప్రభువైన యేసయ్య మన అంతిమ స్వస్థత, మన శారీరక మరియు ఆధ్యాత్మిక రుగ్మతలను బాగు చేయగలడు. ఆయన పాపం యొక్క అవమానాన్ని మరియు ఒంటరితనాన్ని తీసివేయగలడు మరియు తండ్రి మరియు ఇతరులతో మనలను తిరిగి బంధాములోకి తీసుకురాగలడు. కాబట్టి ఈ రోజు మరియు ఎల్లప్పుడూ క్షమాపణ మరియు పునరుద్ధరణ కోసం మన అంతిమ స్వస్థత పరిచే యేసయ్య వైపు తిరగండి.
ప్రార్థన
ప్రేమగల తండ్రీ, నీ స్పర్శతో కుష్ఠురోగి స్వస్థత పొందినట్లే, నన్ను తాకి, నన్ను స్వస్థపరచి నన్ను బాగు చేయుము. నేను నీ సంఘంలో సరైన స్థానాన్ని కనుగొని, నీ శక్తి మరియు మహిమ గురించి సాక్ష్యమివ్వాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● మార్పుకై సమయం● 21 రోజుల ఉపవాసం: 8# వ రోజు
● పరీక్షలో విశ్వాసం
● ఇది ఒక్క పని చేయండి
● వ్యర్థమైన మాటలు సంబంధాలను నాశనం చేస్తుంది
● క్రీస్తుతో కూర్చుండుట
● 24వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు