అనుదిన మన్నా
ఉపవాసం యొక్క జీవితాన్ని మార్చే ప్రయోజనాలు
Saturday, 29th of April 2023
0
0
745
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
నేను కలిసిన ప్రతి క్రైస్తవునికి ఉపవాసం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. చాలా తప్పుగా అర్థం చేసుకున్న విషయాలలో ఉపవాసం ఒకటి. వాస్తవం ఏమిటంటే, మీరు దేవుని వాక్యం ప్రకారం ఉపవాసం ఉన్నప్పుడు మీరు పొందే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.
"దేవుడు ఎంచుకున్న ఉపవాసం" యొక్క పన్నెండు నిర్దిష్ట ప్రయోజనాలు యెషయా పుస్తకం, 58వ అధ్యాయంలో జాబితా చేయబడ్డాయి. అయితే, ఈ రోజు, నేను సరైన ఉపవాసం యొక్క 5 ప్రయోజనాలను తెలియజేస్తున్నాను.
నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును. (యెషయా 58:8-9)
1. నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును
ప్రత్యక్షత మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. మీరు ఇంతకు ముందు చూడని సంగతులను వాక్యంలో చూడటం ప్రారంభిస్తారు. ఈ "వెలుగు" జ్ఞానము, బుద్ది మరియు వివేచనలో పెరుగుదలను సూచిస్తుంది.
2. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును
స్వస్థత మరియు సంపూర్ణత. సరైన ఉపవాసం మీకు ఆరోగ్యాన్ని మరియు స్వస్థతను ఇస్తుంది. ఉపవాసం మీ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుందని మరియు మరింత సమర్థవంతంగా మరమ్మతులు చేస్తుందని వైద్యపరంగా నిరూపించబడింది.
3. నీ నీతి నీ ముందర నడచును
ఉపవాసం వ్యక్తిగత ఎదుగుదలకు మరియు నైతిక అభివృద్ధికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణకు తనను తాను అంకితం చేసుకోవడం ద్వారా, వ్యక్తులు దైవిక విలువలు మరియు సిధ్ధాంతాలకు మరింత అనుగుణంగా ఉంటారు, ఇది ఆయన నీతి యొక్క బలమైన భావానికి దారి తీస్తుంది. మీరు ప్రభువులో నడుచుకుంటూ ఉంటే, సరైన పని చేసే వ్యక్తిగా మీరు ఘనతను పొందుతారు.
4. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచిన్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలు మరియు ముందుకు సాగుతున్న ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రం దాటినప్పుడు వారిని రక్షించడానికి ఒక గోడను ఏర్పాటు చేయడానికి మేఘం మరియు అగ్ని స్తంభాన్ని ఉపయోగించాడు (నిర్గమకాండము 14:19-20).
అయితే, అమాలేకీయులు వెనుకవైపు ఉన్న ప్రజల మీద దాడి చేశారు. మీరు ఉపవాసం మరియు ప్రార్థన చేసినప్పుడు, మీరు మీ వెనుక గురించి చింతించాల్సిన అవసరం లేదు. ప్రభువు సన్నిధి మిమ్మును కాపాడుతుంది.
5. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును
ఉపవాసం మీకు మరియు ప్రభువుకు మధ్య వర్తమాన మార్గాలను ఎక్కువ స్థాయిలో తెరుస్తుంది. ఇది ఉపవాసం యొక్క ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి - సమర్థవంతమైన ప్రార్థన. దేవుడు మీ ప్రార్థనలకు త్వరగా జవాబివ్వాలని మీరు కోరుకుంటున్నారా? ఉపవాసాన్ని పరిగణించండి.
మీ ఉపవాసం మీకు పైన పేర్కొన్న ప్రయోజనాలను తెస్తుంది. కానీ, అదనంగా, మీ ఆధ్యాత్మిక జీవితం బలంగా అభివృద్ధి చెందుతుంది మరియు మీ ఉపవాసం వందలాది జీవితాలను తాకుతుంది. ఒక్కసారి ఆలోచించండి.
ఒప్పుకోలు
మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు, మనము 2023 (మంగళ/గురు/శని) ఉపవాసం ఉంటున్నాము. ఈ ఉపవాసం ఐదు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది. మీరు కరువు మీద తప్పకుండా విజయం పొందుతారు.
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
అలాగే, మీరు ఉపవాసం లేని దినాలలో ఈ ప్రార్థన అంశాలను ఉపయోగించండి
1. నేను, నా కుటుంబ సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో సంబంధం ఉన్న వారందరినీ యేసు రక్తంతో కపుతున్నాను.
2. నా జీవితం, నా కుటుంబం మరియు కరుణ సదన్ పరిచర్య మీద దాడి చేసే ప్రతి శక్తి యేసు నామములో దేవుని అగ్నితో నాశనం అవును గాక.
3. ప్రభువైన యేసుక్రీస్తు, గొప్ప పునరుద్ధరణకర్త, నా ఆర్థిక సమృద్ధిని కుదిరించు.
4. తండ్రీ, యేసు నామములో, నీ ఆర్థిక అభివృద్ధి యొక్క దేవదూతలు నా జీవితంలో స్పష్టంగా కనిపించబడును గాక.
5. యేసు నామములో నా ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే నా కుటుంబ వంశం నుండి ఆర్థిక బంధాలు, విచ్ఛిన్నం అవును గాక.
6. అన్యజనుల సంపదను యేసు నామమున నా యందు బదిలీ చేయబడును గాక.
7. నేను ప్రభువుకు భయపడి, ఆయన ఆజ్ఞలయందు మిక్కిలి సంతోషించు ధన్యుడను. ఐశ్వర్యం, సంపదలు నా ఇంట్లో ఉండును.
8. నా జీవితంలో శత్రువులు నాటిన ప్రతి దుష్ట విత్తనాన్ని యేసు నామములో అగ్ని ద్వారా నిర్మూలించబడును గాక.
Join our WhatsApp Channel
Most Read
● మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు● దేవుని వాక్యం మిమ్మల్ని అభ్యంతరపరుస్తుందా?
● అద్భుతాలలో పని చేయుట: కీ#1
● మార్పుకై సమయం
● అసూయ యొక్క ఆత్మపై విజయం పొందడం
● ఆయన ద్వారా ఏ పరిమితులు లేవు
● అనిశ్చితి సమయాలలో ఆరాధన యొక్క శక్తి
కమెంట్లు