english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మర్చిపోయిన ఆజ్ఞా
అనుదిన మన్నా

మర్చిపోయిన ఆజ్ఞా

Friday, 20th of September 2024
0 0 409
Categories : శిష్యత్వం (Discipleship)
పదునొకండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి. అయితే, "యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు, నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను." ఆమెన్ (మత్తయి 28:16-20) 

మత్తయి సువార్తలో తన శిష్యులకు యేసు ఇచ్చిన చివరి భూసంబంధమైన సందేశం గొప్ప ఆజ్ఞా. ఈ రోజు కూడా ప్రభువు ఆయన దిశానిర్దేశం చేసినందుకు మనము కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు, ఆయన శిష్యులు తన విడిపోయే ఆజ్ఞగా గుర్తుంచుకోవాలని ఆయన కోరుకుంటున్న ప్రధాన సందేశం ఇది.

శిష్యుడు అంటే ఏమిటి?
యేసును వెంబడించడంలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, యేసు చేత మార్చబడి మరియు యేసు మాటలకు కట్టుబడి ఉండడం (మత్తయి 4:19).

శిష్యులనుగా తయారు చేయడం అంటే ఏమిటి?
యేసును యందు విశ్వసించడానికి మరియు వెంబడించడానికి ప్రజలకు సహాయపడటానికి శిష్యులను చేయడం ఆధ్యాత్మిక సంబంధాలలోకి ప్రవేశించడం (మత్తయి 28: 18-20). ఇది వ్యక్తిగత శ్రద్ధ మరియు క్రైస్తవ మార్గదర్శకత్వం ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మిక సంతాన సాఫల్యం. శిష్యులను చేయడం అంటే ప్రజలతో పాలుపంచుకోవడం.

ఈ రోజు, సంఘం చాలా మంచి కార్యక్రమాలను నడుపుతోంది, మరియు దానిలో తప్పు ఏమీ లేదు. అయితే, నిజం ఏమిటంటే, శిష్యులను చేయడంలో మరియు శిష్యుడిగా ఉండటంలో పునాది స్థాయిలో వైఫల్యం అవుతుంది.

కారణం #1:
చాలా మంది క్రైస్తవులు శిష్యులను ఎందుకు చేయరు?
దీనికి కారణం వారే ఎప్పుడూ శిష్యులుగా కాలేకపోయారు.

కారణం #2:
చాలా మంది క్రైస్తవులు శిష్యులను ఎందుకు చేయరు?
శిష్యులను తయారు చేయడం మీ అనువయిన ప్రదేశం నుండి బయటికి వెళ్లడం దీనికి కారణం; ఇందులో కార్యం ఉంటుంది.

మనకు జీవితంలో మంచి విషయాలు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఏదేమైనా, క్రీస్తు ఆజ్ఞలు సౌకర్యమైన వెనుక సీటు తీసుకున్నప్పుడు, సౌకర్యం విగ్రహం అవుతుంది. జీవిత సౌలభ్యం ఒక క్రైస్తవ కార్యమును సోమరితనం చేయకూడదు.

ఒక క్రైస్తవుడు శిష్యులను చేయకపోవటానికి కారణం వారు కార్య రహిత ఇతర కార్యకలాపాలతో చాలా బిజీగా ఉన్నారు. అలాంటి సందర్భములో, వారు మౌనముగా ప్రభువుకు "వారి పనులు" ఆయన లక్ష్యం కంటే ముఖ్యమైనవని ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారు.

మంచి సమరయుని ప్రేమ అతనిని రోడ్డు పక్కన గాయపడిన వ్యక్తిని కాపాడటానికి ప్రేరేపిస్తుంది. (లూకా 10:33-34) మీరు ప్రభువును ప్రేమిస్తే, మీరు ఆయన ప్రజలను ప్రేమిస్తారు, మరియు వారికి సహాయపడటానికి మరియు దేవుని మార్గాల్లో వారికి మార్గనిర్దేశం చేయడానికి ఇది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.

నేను మీకు ఒక ప్రశ్నతో ముగించలనుకుంటున్నాను
ప్రతి క్రైస్తవుడు శిష్యుడిగా ఉండటానికి మరియు కొంత మందిని శిష్యులుగా చేయడానికి తన బద్ధమైన కర్తవ్యాన్ని చేస్తే? నేను మీకు చెప్తున్నాను, ఒక వారం వ్యవధిలో గొప్ప ఉజీవం ఉంటుంది.
ప్రార్థన
ప్రభువైన యేసు, నీ కృపను ప్రతిబింబించే జీవితాన్ని గడపడానికి నాకు సహాయం చెయ్యి. తండ్రీ, శిష్యులను చేయడానికి నీ కృప మరియు సామర్త్యం నాకు దయచేయి. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● కోపంతో వ్యవహరించడం
● కోపాన్ని (క్రోధాన్ని) అర్థం చేసుకోవడం
● మీ ప్రతిదినము మిమ్మల్ని నిర్వచిస్తుంది
● రహస్యాన్ని స్వీకరించుట
● ప్రతిభకు మించిన పాత్ర (స్వభావం)
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #1
● దేనికి కాదు డబ్బు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్