దేవుని జ్ఞానం మన గ్రహణశక్తికి మించినది, మరియు ఆయన చేసే ప్రతి పనిలో ఆయన ఎల్లప్పుడూ ఒక ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటాడు. సామెతలు 16:4 మనకు గుర్తుచేస్తుంది, "యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను." మీరు జీవితంలో ఎదుర్కొనే తుఫానులు, భావోద్వేగమైనా, భౌతికమైనా లేదా ఆధ్యాత్మికమైనా, మీరు గ్రహించగలిగే దానికంటే గొప్ప ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ తుఫానులకు ఒక ఉద్దేశ్యం ఉంది. కొన్ని జీవిత పాఠాలను మీతో పంచుకోవడానికి నన్ను అనుమతించండి.
a) తుఫానులు ఎదుగుదల మరియు శుద్ధీకరణను తెస్తాయి:
నేను రైతు కుమారుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. మా నాన్న నాగలి వెనుక నిలబడి ఎద్దులను లాగడం నేను చూశాను. చిన్నప్పుడు, ఎద్దు నాగలిని లాగినప్పుడు నేను మరియు మా తమ్ముడు నాగలిపై నిలబడ్డాము. రైతు కుమారునిగా పెరిగిన నేను, జీవితంలోని అత్యంత సారవంతమైన క్షణాలు పర్వత శిఖరాలపై కాకుండా లోయల్లోనే జరుగుతాయని తెలుసుకున్నాను. లోయల మట్టి అత్యంత ధనవంతంగా ఉంటుంది, విరిగిన పర్వత శిలలు మరియు సేంద్రియ పదార్థాల నుండి ఏర్పడుతుంది. ఇక్కడే ఉత్తమమైన ఎదుగుదల జరుగుతుంది మరియు ఇది మన వ్యక్తిగత జీవితాలకు ఒక రూపకం వలె పనిచేస్తుంది.
కోత మరియు కుళ్ళిపోవడం వంటి సవాల ప్రక్రియల నుండి లోయలో సారవంతమైన నేల సృష్టించబడినట్లే, వ్యక్తిగత ఎదుగుదల తరచుగా ప్రతికూలతను అధిగమించడం నుండి పుడుతుంది. మన జీవితంలో గరిష్ట ఎదుగుదల పర్వత శిఖరాలపై కాదు, మనం జీవిత లోయలలో ఉన్నప్పుడు. వ్యంగ్యం ఏమిటంటే, లోయలో మీ ఎదుగుదల మరియు శుద్ధీకరణ కారణంగా మీరు పర్వత శిఖరానికి వెళతారు.
మన జీవితంలో తుఫానులు మన స్వభావమును రూపం దాలుస్తుంది మరియు మెరుగుపరచగలవు. అవి మనకు స్థితిస్థాపకత, సహనం మరియు విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. అయితే తుఫానులో వెళ్లే వ్యక్తి మరియు తుఫాను నుండి బయటకు వచ్చే వ్యక్తి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు.
బహుశా మీరు ప్రస్తుతం ఒక దానిలో ఉన్నారేమో. బహుశా ఇది అనారోగ్యం లేదా నిరాశ యొక్క తుఫాను కావచ్చు. ఇది ఆర్థిక పరిస్థితి కావచ్చు లేదా బంధంలో ఒక విధమైన కలహాలు కావచ్చు. చేదువార్త ఏమిటంటే, ఇలాంటి తుఫానుల గురించి ఏ వార్తా ఛానల్ మనల్ని ముందుగా హెచ్చరించడం లేదు. తుఫానులోకి వెళ్ళే వ్యక్తి విశ్వాసం గురించి మాట్లాడతాడు మరియు తుఫాను నుండి బయటికి వచ్చిన వ్యక్తి తన విశ్వాసాన్ని జీవిస్తాడు. హబక్కూకు 2:4 ఇలా చెబుతోంది, "నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును."
నేటి వేగవంతమైన ప్రపంచంలో, సహనం అనేది చాలా తరచుగా విస్మరించబడే ఒక నీతి. నేటి తరంలో ఒక్కటి లోపము ఉందంటే అది సహనం. యాకోబు 1:2-3 ఇలా చెబుతోంది, "నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.." మన విశ్వాస ప్రయాణానికి మనం ఎదుర్కొనే తుఫానులను ఎదుర్కోవడంలో పట్టుదల మరియు సహనం అవసరమని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
ఒక ఆరాధన తర్వాత ఒక స్త్రీ నన్ను సంప్రదించింది, "పాస్టర్ మైఖేల్ గారు, నేను మూడు ఆదివారాలు సంఘానికి హాజరవుతున్నాను మరియు నా ప్రార్థనలకు దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేదు." నేను ఆమెతో, "సహోదరీ, నాల్గవ ఆదివారం, ఐదవది మరియు ఇంకా చాలా ఉన్నాయి" అని చెప్పాను. నేను నిజంగా ఉద్దేశించినది ఏమిటంటే: మీరు దేవుని మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు సహనం అవసరం.
దేవుడు మన సమస్యలకు తక్షణ సమాధానాలు మరియు పరిష్కారాలను అందించే ATM మెషిన్ కాదు. బదులుగా, ఆయన ప్రేమగల తండ్రి, మన జీవితాల్లో నిశితంగా మరియు ఉద్దేశపూర్వకంగా పనిచేస్తూ, మన స్వభావమును మెరుగుపరుస్తూ, మనల్ని మనలోని ఉత్తమ రూపాల్లోకి మలుచుకుంటాడు. తుఫానుల నేపథ్యంలో ఈ ప్రక్రియ నెమ్మదిగా మరియు తరచుగా సవాలుగా ఉండవచ్చు, కానీ సహనం ద్వారా, మనం దేవుని ఖచ్చితమైన సమయాలను విశ్వసించడం నేర్చుకుంటాము మరియు మన జీవితంలోని ప్రతి అంశంలో ఆయన హస్తాన్ని గుర్తిస్తాము.
ప్రార్థన
పరలోకపు తండ్రీ, నేను నీ మార్గదర్శకత్వం మరియు జ్ఞానాన్ని కోరుతూ వినయ హృదయంతో నీ యెద్దకు వస్తున్నాను. తక్షణ తృప్తిని కోరే లోకములో, సహనాన్ని పెంపొందించడానికి మరియు నీ ఖచ్చితమైన సమయం మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి నాకు సహాయం చేయి. నీ మీద ఆధారపడేందుకు మరియు నా జీవితానికై నీ ప్రణాళిక నేను ఊహించగలిగే దానికంటే చాలా గొప్పదని విశ్వసించడానికి నాకు సహాయం చేయి. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● లోకమునకు ఉప్పు● 16 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ఐదు సమూహాల ప్రజలను యేసు అనుదినము కలుసుకున్నారు #3
● యూదా ద్రోహానికి నిజమైన కారణం
● వివేచన v/s తీర్పు
● 14 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● అంతర్గత నిధి
కమెంట్లు