నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము
జ్ఞానముగల వారు ఇతరులను రక్షించుదురు. (సామెతలు 11:40)
ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని భావించి రోడ్డుపై వెళ్తున్నాడు. అకస్మాత్తుగా, తెలియకుండా, మరొక యువకుడు అతనితో పాటు నడుచుకుంటూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించిన తర్వాత తన జీవితం ఎలా మారిందో అతడు తన సాక్ష్యాన్ని పంచుకోవడం ప్రారంభించాడు. దీంతో ఆకర్షితుడైన ఈ యువకుడు తనను ఆహ్వానించిన ఆరాధనకు వెళ్లాడు.
సభ చాలా చిన్న గదిలో నిర్వహించబడింది మరియు అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ అది ఈ యువకుడిని ముట్టకుండా పరిశుద్ధాత్మను ఆపలేదు. కాబట్టి ఆ రాత్రి, ప్రభువు ఈ యువకుడిని ముట్టాడు, మరియు అతని ఆత్మహత్య ఆలోచనలన్నీ అదృశ్యమయ్యాయి. ఈ యువకుడు ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా - అది నేనే.
నేనెప్పుడూ ఇలా ఊహించుకుంటు ఉంటాను, "ఈ అబ్బాయి నాకు యేసయ్య గురించి చెప్పకపోతే ఏమి అయ్యుండేది? నేను ఇప్పుడు ఎక్కడ ఉండేవాని?"
మన స్వంత ఆసక్తులలో మునిగిపోవడం చాలా సులభం, మనం శాశ్వతత్వమైన మరియు మన చుట్టూ నశించిపోతున్న ఆత్మల దృష్టిని కోల్పోతాము.
ఆత్మలను సంపాదించడానికి ఒక మార్గం మీ సాక్ష్యాన్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో పంచుకోవడం. మీ జీవితంలో దేవుడు చేసినవాటిని ఇతరులతో పంచుకునే అవకాశాల కోసం ప్రతిరోజూ దేవుణ్ణి అడగండి. మీ సాక్ష్యం ఎంత చిన్నదైనా, ప్రజలను ఆయన రాజ్యంలోకి తీసుకువచ్చే దేవుని శక్తిని అది కలిగి ఉంటుంది.
ఆత్మలను సంపాదించడానికి మరొక మార్గం సువార్తను వ్యాప్తి చేయడానికి మీ సమయాన్ని, ప్రతిభను మరియు సంపదను ఇవ్వడానికి సిద్ధంగా ఉండటం.
మీరు ఎవరినైనా ప్రభువు వైపుకు నడిపించినట్లయితే, ఎదగడానికి సరైన మార్గాన్ని కనుగొనడానికి వారిని వారి స్వంతంగా వదిలివేయవద్దు. బైబిలు చదవమని వారిని ప్రోత్సహించండి. వారిని ఆహ్వానించండి లేదా బైబిలు బోధించే వాటిని మరింత వినడానికి వారికి సమీపంలో ఉన్న మంచి సంఘానికి నడిపించండి. (మత్తయి 28:19-20 చదవండి) నేటి కాలంలో, మీరు ఆన్‌లైన్ ఆరాధనను చూడటానికి వారిని ఆహ్వానించవచ్చు.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, యేసు నామంలో, నన్ను ఆత్మ విజేతగా చేసినందుకు వందనాలు. నీ రాజ్యంలో ఆత్మలను సంపాదించడానికి నీ ఆత్మ ద్వారా నాకు అధికారమివ్వు. రక్షణ సువార్తను నాకు అప్పగించినందుకు వందనాలు. ఆమెన్
కుటుంబ రక్షణ
తండ్రీ, “తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా (యేసయ్య) యొద్దకు రాలేడు” అని మీ వాక్యం చెబుతోంది (యోహాను 6:44). నా సభ్యులందరినీ నీ కుమారుడైన యేసు వైపుకు ఆకర్షించమని నేను మనవిచేయుచున్నాను, వారు నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు మరియు నీతో శాశ్వతత్వం ఉంటారు.
ఆర్థిక అభివృద్ధి
ఓ దేవా యేసు నామములో లాభదాయకమైన మరియు ఫలించని శ్రమ నుండి నన్ను విడిపించు. దయచేసి నా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించు.
ఇప్పటి నుండి నా గమనము మరియు పరిచర్య ప్రారంభం నుండి నా పెట్టుబడులు మరియు శ్రమలన్నీ యేసు నామములో పూర్తి లాభాలను పొందడం ప్రారంభిచును గాక.
KSM సంఘం:
తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన బృంద సభ్యులు అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. నీ శాంతి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను చుట్టుముట్టను గాక.
దేశం:
తండ్రీ, యేసు నామములో, ఈ దేశాన్ని నిర్వహించడానికి జ్ఞానం మరియు అవగాహన ఉన్న నాయకులను, పురుషులను మరియు స్త్రీలను లేవనెత్తు.
Join our WhatsApp Channel
Most Read
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 5● మీ అనుభవాలను వృధా చేయకండి
● ఆయన బలం యొక్క ఉద్దేశ్యం
● అశ్లీలత
● సంబంధాలలో సన్మాన నియమము
● రెడ్ అలర్ట్ (ప్రమాద హెచ్చరిక)
● ఒక మాదిరిగా (ఉదాహరణ) ఉండండి
కమెంట్లు