english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దైవ క్రమము -1
అనుదిన మన్నా

దైవ క్రమము -1

Saturday, 2nd of November 2024
0 0 244
Categories : దైవ క్రమము (Divine Order)
1 కొరింథీయులు 14:33 లో బైబిల్ ఇలా సెలవిస్తుంది, "ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు." అల్లరి అంటే ఏమిటి? అల్లరి దైవిక క్రమము లేకపోవడం తప్ప మరొకటి కాదు. నేడు అనేక గృహాలు, అనేక కుటుంబాలు, సంస్థలు, వ్యాపారాలు, సంఘాలు మరియు ప్రార్థన సమూహాలు అల్లరులు, కలహాలు మరియు విభజన స్ఫూర్తితో దాడి చేయబడ్డాయి.

ఇంత గందరగోళానికి (అల్లరికి) కారణం ఏమిటి?
దీనికి కారణం ఈ విషయాలలో దైవిక క్రమం లేకపోవడం మాత్రమే. చుట్టూ చూడండి, మీరు చాలా ఒత్తిడి మరియు నిరాశతో ఉన్న వ్యక్తులను చూడగలుగుతారు. మళ్ళీ, దానికి కారణం వారి జీవితంలో దైవిక క్రమం లేకపోవడం.

ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, "నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టు కొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను" (యెషయా 38:1)

హిజ్కియా రాజు తన యిల్లు సక్రమంగా లేదని దేవుడు చెప్పాడు, అందుకే అతడు బ్రతుకడు కానీ చనిపోతాడు. దేవుని ప్రజలారా, మన జీవితాలు దైవిక పద్ధతి (దేవుని చిత్తం) ప్రకారం లేనప్పుడు మనం ప్రతిచోటా మరణం మరియు ఓటమిని మాత్రమే చూస్తాము. వివరించడానికి నాకు అనుమతివ్వండి.

ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. (అపొస్తలుల కార్యములు 6:1)

ఆదిమ సంఘంలో, అనుదిన ఆహార పంపిణీలో సమస్య తలెత్తింది, ఇది గొప్ప అల్లరికి మరియు కలహాలకు కారణమైంది. దేవుని ఆత్మ నడిపింపుతో అపొస్తలులు పనిని పర్యవేక్షించడానికి ఏడుగురిని నియమించారు, మరియు వారు ప్రార్థన మరియు వాక్యానికి తమను తాము అప్పగించుకోవడం కొనసాగించారు.

అపొస్తలుల కార్యములు 6:7 ఇలా సెలవిస్తుంది, "దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి".

వాస్తవానికి, యెరూషలేములో సంఘ అభివృద్ధికి దారితీసిన అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అయితే కాదనలేని విధంగా, విషయాలను క్రమపద్ధతిలో అమర్చడం సంఘ అభివృద్ధికి దారితీసింది.

మీ ప్రాధాన్యతలపై పని చేయండి. మీ జీవితంలోని ప్రతి అంశంలో దైవిక క్రమము ప్రవహిస్తుంది.
ప్రార్థన
తండ్రీ, సరైన సమయంలో సరైన పనులు చేయడానికి నీ దైవ జ్ఞానం మరియు అవగాహన నాకు దయచేయి. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలి - 2
● మాటల శక్తి
● కోతపు కాలం - 1
● ఒక ఇవ్వగల (అవును గల) హామీ
● సరైన అన్వేషణను వెంబడించడం
● 29 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ప్రార్థించకపోవడం యొక్క పాపం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్