అనుదిన మన్నా
సమృద్ధి కోసం మరచిపోబడిన తాళంచెవి
Wednesday, 26th of April 2023
2
2
1083
Categories :
మధ్యస్త్యం (Intercession)
శీర్షిక: సమృద్ధి కోసం మరచిపోబడిన తాళంచెవి
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. (యోబు 42:10)
అతడు స్నేహితుల వలె మారువేషంలో ఉన్న శత్రువులు - నిజానికి 'ఉన్మాదులు' లాగా ఉన్న తన స్నేహితుల కోసం ప్రార్థన మరియు విఙ్ఞాపణ చేయడం ఎంచుకున్నప్పుడు యోబు యొక్క సమృద్ధి పునరుద్ధరించబడింది. ఈ వ్యక్తులు అతనికి నిజంగా వారి మద్దతు మరియు అవగాహన అవసరమైనప్పుడు, అతని చీకటి క్షణాలలో అతనిని విమర్శించారు, తప్పుగా అర్థం చేసుకున్నారు మరియు తీర్పు ఇచ్చారు.
అయినప్పటికీ, వారి క్రియలు ఉన్నప్పటికీ, యోబు ఈ వ్యక్తుల కోసం ప్రార్థించమని అడిగారు, క్షమాపణ యొక్క శక్తిని మరియు మనకు బాధ కలిగించిన వారికి కూడా కృపను అందించడం యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది.
"మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి" (మత్తయి 5:44) అని ప్రభువైన యేసు అదే విధమైన భావాన్ని గురించి నొక్కి చెప్పాడు. అలా చేయడం ద్వారా, మనం మన పరలోకపు తండ్రి యొక్క దృక్పథాన్ని, ఆయన దివ్యమైన కరుణ మరియు కృపను ప్రతిబింబిస్తాము. ఈ నిస్వార్థ క్రియ ద్వారా, మనం దేవునికి దగ్గరగా ఉంటాము మరియు ప్రేమ మరియు క్షమాపణ యొక్క పరివర్తన శక్తిని ప్రదర్శిస్తాము.
స్త్రీ పురుషులందరూ రక్షించబడాలని మరియు ఎవరూ నశించకూడదని దేవుని చిత్తము. ప్రతి విఙ్ఞాపణపరుడు వారి శ్రమకు యెహోవా ప్రతిఫలమిస్తాడని నేను నమ్ముతున్నాను. యెహోవా నుండి వచ్చే ఈ బహుమానం భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలలో కూడా వ్యక్తమవుతుందని నేను నమ్ముతున్నాను.
ఇందుకే నేను ప్రజలను విఙ్ఞాపణ ప్రార్థన బృందంలో చేరమని చెబుతున్నాను. చాలా మంది ప్రజలు ఈ ప్రవచనాత్మక విఙ్ఞాపణ ప్రార్థనను అర్థం చేసుకోరు మరియు గొణుగుతారు, తద్వారా వారి ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఇతరుల కోసం విఙ్ఞాపణ ప్రార్థన చేసినప్పుడు చాలామంది అనుభూతి చెందుతారు; వారు ఏదో కోల్పోతున్నారని. నిజానికి, ఇది కేవలం వ్యతిరేకం - మీరు ఏదో పొందుతున్నారు.
అలాగే, దానియేలు తన దేశం కోసం ప్రార్థించినప్పుడు, అతడు వర్థిల్లాడు. "కాబట్టి ఈ [మనిషి] దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వకాల మందును వర్థిల్లెను." (దానియేలు 6:28) మనం చుట్టూ చూసినప్పుడు మరియు మన చుట్టూ ఏమి జరుగుతుందో చూసినప్పుడు, మన దేశాన్ని విమర్శించడం చాలా సులభం. అయితే, మనం మన దేశాన్ని విశ్వాసపు కళ్లతో చూడాలి. మన దేశం దేవుని వైపు మళ్లేలా ప్రార్థిద్దాం. ప్రభువు మిమ్మును తప్పకుండా దీవిస్తాడు.
ప్రార్థన
సంవత్సరం, 2023లో ప్రతి మంగళ/గురు/శనివారాల్లో మనం ఉపవాసం ఉంటున్నామని గుర్తుంచుకోండి - కరువు మనల్ని లేదా మన ప్రియమైన వారిని తాకదు. నాతో కలసి పాల్గొనాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
ప్రతి ప్రార్థన అస్త్రాన్ని కనీసం 2 నిమిషాలు పునరావృతం చేయండి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ దేవా, నీ వాక్యంలో నన్ను స్థిరపరచు, నీ వాక్యం నా జీవితంలో ఫలించును గాక. శాంతి గల దేవా, నీ వాక్యం ద్వారా నన్ను పరిశుద్ధపరచు, ఎందుకంటే నీ వాక్యం సత్యమైనది. యేసు నామములో. ఆమెన్.
నేను నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉన్నాను. నేను చేయున దంతయు సఫలమగును. (కీర్తనలు 1:3)
నేను మేలు చేయుట యందు విసుకక యుందును. నేను అలయక మేలు చేసితినని తగిన కాలమందు పంట కోతును. (గలతీయులకు 6:9)
కుటుంబ రక్షణ
తండ్రీ దేవా, క్రీస్తు యొక్క సత్యాన్ని అంగీకరించడానికి నీవు నా కుటుంబ సభ్యులందరి హృదయాల గుండా కదలాలని నేను మనవి చేయుచున్నాను. “యేసుక్రీస్తును ప్రభువుగా, దేవునిగా మరియు రక్షకునిగా తెలుసుకునే హృదయాన్ని వారికి దయచేయి. వారి పూర్ణహృదయములతో వారిని నీ వైపుకు మరలించుము.
ప్రతి భారం నా భుజం నుండి తీసివేయబడును, మరియు నా మెడ నుండి ప్రతి కాడి కొట్టివేయబడును మరియు అభిషేకం కారణంగా కాడి విరుగగొట్టబడును. (యెషయా 10:27)
ఆర్థిక అభివృద్ధి
నేను నీకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను, ఎందుకంటే సంపదను పొందే శక్తిని నాకు ఇచ్చేది నీవే. సంపదను పొందుకునే శక్తి ఇప్పుడు నా మీద ఉంది. యేసు నామములో. (ద్వితీయోపదేశకాండము 8:18)
నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు నేను సిగ్గునొందను కరవు దినములలో నేను మరియు నా కుటుంబ సభ్యులు తృప్తిపొందుదుము. (కీర్తనలు 37:18-19)
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులకు 4:19)
KSM సంఘము
తండ్రి, యేసు నామములో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు, బృందం సభ్యులు మరియు కరుణ సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తిని వర్ధిల్లజేయుము.
దేశం
తండ్రీ, నీ వాక్యం సెలవిస్తుంది, పాలకులను వారి ఉన్నత స్థానాలలో నిలబెట్టేది నీవే, అలాగే నాయకులను వారి ఉన్నత స్థానాల నుండి పడగొట్టేది కూడా నీవే. ఓ దేవా, మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో సరైన నాయకులను లేవనెత్తు. యేసు నామములో. ఆమెన్.
మీ దేశం కోసం ప్రార్థించడానికి కొంత సమయం కేటాయించండి.
Join our WhatsApp Channel
Most Read
● మీ విడుదల ఇకపై నిలిపివేయబడదు● వరుడిని కలవడానికి సిద్ధపడుట
● విశ్వాసులైన రాజుల యాజకులు
● మానవుని ప్రశంసల కంటే దేవుని ప్రతిఫలాన్ని కోరడం
● 16 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కొండలు మరియు లోయల దేవుడు
● ప్రేరేపించే జ్ఞానం (బుద్ది) మరియు ప్రేమ
కమెంట్లు