"ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు." (యోవేలు 2:12)
మీరు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి
ఒక వ్యక్తి తన పూర్ణ హృదయంతో ప్రభువు యొద్దకు ఎలా తిరిగి వెళ్లుతాడు?
1. పశ్చాత్తాపం (మారు మనస్సు) - పశ్చాత్తాపం అంటే లోకము నుండి వాక్యము వైపు తిరగడం.
2. ఉపవాసం - అంటే కన్నీరు విడుచుట మరియు దుఃఖించుట అనేది ఉంటుంది.
కాబట్టి ఇప్పుడైనను, ఉపవాసంతో, కన్నీరు విడుచుచు, దుఃఖించుచు [ప్రతి అడ్డంకి తొలగిపోయి, చితికిన సహవాసం పునరుద్ధరించబడే వరకు] మీ పూర్ణహృదయంతో నా యొద్దకు తిరిగి వస్తూ ఉండండి అని ప్రభువు చెబుతున్నాడు. (యోవేలు 2:12 యాంప్లిఫైడ్)
నా వద్దకు వస్తూ ఉండండి....ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలి [ప్రతి అడ్డంకి తొలగిపోయి, చితికిన సహవాసం పునరుద్ధరించబడే వరకు].
గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి (యోవేలు 2:13)
యూదుల సంస్కృతిలో "క్రియా" అని పిలువబడే బట్టలు చింపివేయడం, లోతుగా పాతుకుపోయిన సంతాప సంప్రదాయం. ఈ రోజుకి కూడా ఆచరిస్తారు, ఇది దుఃఖం మరియు నిస్పృహకు ప్రతీక.
దుఃఖం యొక్క బాహ్య ప్రదర్శన కంటే, పాపం కోసం నిజమైన దుఃఖం మరియు హృదయం యొక్క నిజమైన పశ్చాత్తాపం చాలా ముఖ్యమైనవి. ప్రవక్త యోవేలు దేవుని ఆజ్ఞను తెలియజేశాడు: "నీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి" (యోవేలు 2:13).
బాహ్య ఆచారాల కంటే ఒకరి హృదయంలోని చిత్తశుద్ధి మరియు పరిశుద్ధతకు దేవుడు విలువ ఇస్తాడు. అందువల్ల, ఒక వ్యక్తి యొక్క అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే భక్తి యొక్క బాహ్య ప్రదర్శనల కంటే నిజమైన ఉద్దేశాలు మరియు అంతర్గత విశ్వాసం చాలా ముఖ్యమైనవి.
మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును,శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును (యోవేలు 2:13)
దేవుని మంచితనం మరియు కృప తెలుసుకోవడం నిజమైన పశ్చాత్తాపానికి మరొక ప్రేరణ. ఆయన స్వస్థతను మరియు క్షమిస్తాడని మరియు ఆయన ప్రకటించిన తీర్పు నుండి ఆయన పశ్చాత్తాపపడగలడనే నమ్మకంతో మనము ఆయన వద్దకు వస్తాము.
"దేవుడు చాలా నీచుడు, నేను ఆయన వద్దకు తిరిగి రాకపోతే, ఆయన నన్ను నాశనం చేస్తాడు" అనే ఆలోచనతో మనం పశ్చాత్తాపపడము. బదులుగా, ఆలోచన ఏమిటంటే, "దేవుడు చాలా కృప మరియు దయగలవాడు, కోపానికి నిదానవంతుడు మరియు గొప్ప దయగలవాడు, నేను ఆయన వైపు తిరిగితే నాకు దక్కవలసిన దాని నుండి ఆయన నన్ను టాపిస్తాడు." అంతిమంగా, ఆయన అనుగ్రహమే మనలను పశ్చాత్తాపానికి దారి తీస్తుంది (రోమీయులకు 2:4).
లూకా 5:1-11లో, ప్రభువైన యేసు పేతురు దోనెలోకి వచ్చి వలలు వేయమని అతనికి సూచించినప్పుడు. దాని ఫలితంగా పేతురు విస్తారమైన చేపలను పొందుకున్నాడు - చేపలతో నిండిన దోనె. పేతురు అది చూసి, వెంటనే యేసు పాదాలపై పడి, ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను!"
పేతురు పట్ల ప్రభువు చూపిన మంచితనమే అతన్ని పశ్చాత్తాపానికి దారితీసింది. మరియు అది మన పట్ల కూడా జరుగుతుంది.
ప్రార్థన
1. మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు, మనము 2023 ఉపవాసం (మంగళ/గురు/శని) చేస్తున్నాము. ఈ ఉపవాసం ఐదు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది.
2. ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
3. అలాగే, మీరు ఉపవాసం లేని దినాలలో ఈ ప్రార్థన అంశాలను ఉపయోగించండి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, యేసు నామములో, నీ వాక్యంలో మరియు ప్రార్థనలో ఎదగడానికి నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ నీ అగ్నితో నా ప్రార్థన బలిపీఠాన్ని వెలిగించు.
కుటుంబ రక్షణ
తండ్రీ, నీ కృప ప్రతిరోజు నూతనగా ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. నేను మరియు నా కుటుంబము బ్రదుకు దినములన్నియు నీ కృపాక్షేమములే మా వెంట వచ్చును మరియు చిరకాలము యెహోవా మందిరములో మేము నివాసము చేసెదము యేసు నామము లో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
నా ప్రభువైన యేసుక్రీస్తు కృపను నేను ఎరుగుదును. ఆయన ధనవంతుడై యుండియు ఆయన దారిద్ర్యము వలన నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆయన రాజ్యం కొరకు ధనవంతులు కావలెనని, నా నిమిత్తము దరిద్రుడాయెను. (2 కొరింథీయులు. 8:9)
KSM సంఘము
తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన బృందం సభ్యులు అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. నీ శాంతి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను చుట్టుముట్టను గాక. కరుణ సదన్ పరిచర్య ప్రతి రంగములోను సమర్థతంగా ఎదుగును గాక.
దేశం
తండ్రీ, నీ నీతి మరియు శాంతి మా దేశం అంతటా ప్రవహించును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క ప్రతి శక్తులు నాశనం అవును గాక. మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో సమాధానము మరియు సమృద్ధి ఉండును గాక. యేసు నామములో.
Join our WhatsApp Channel
Most Read
● రక్తంలోనే ప్రాణము ఉంది● 21 రోజుల ఉపవాసం: 2# వ రోజు
● ప్రారంభ దశలో దేవుణ్ణి స్తుతించండి
● దేవుడు సమకూరుస్తాడు
● మన్నా, పలకలు మరియు చేతికఱ్ఱయు
● 21 రోజుల ఉపవాసం: #20 వ రోజు
● నిరాశ పై ఎలా విజయం పొందాలి
కమెంట్లు