దేవుని యందలి ప్రేమయు మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును (గ్రహించు మరియు చూపించును) గాక. (2 థెస్సలొనీకయులకు 3:5)
దేవుడు మనలను సంపూర్ణముగా ప్రేమిస్తున్నప్పటికీ, ఈ ప్రేమను అనుభవించడంలో మనం నిమగ్నమై ఉండాలి; అది అకస్మాతుగా జరగదు. మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, కొందరు ప్రజలు ఆయన నుండి ఉత్తమమైన వాటిని పొందలేకపోయిన సందర్భాలు ఉన్నాయి, అయినప్పటికీ ఆయన వారిని ప్రేమించాడు మరియు వారిని దీవించాలని కోరుకున్నాడు (మార్కు 6:1-6, మత్తయి 13:54-58 చూడండి). సమస్య ఆయనతో కాదు; వారు ఆయనను ఎలా పొందారో అనే దానితోనే సమస్య.
అదేవిధంగా, దేవుడు తన అపారమైన ప్రేమను లోకానికి చూపించాడు మరియు మన పాపాల కోసం చనిపోవడానికి తన కుమారుడిని పంపడం ద్వారా తన ఉత్తమమైన వాటిని మనకు అందించినప్పటికీ, చాలా మంది ప్రజలు ఇంకా ఈ ప్రేమను పొందలేదు లేదా అనుభవించలేదు. అయితే, ఈ ప్రేమను పొందేందుకు తీసుకోవాల్సిన మొదటి మెటు ఏమిటంటే, క్రీస్తు చేసిన దానిని విశ్వసించడం మరియు ఆయనను ప్రభువుగా ఒప్పుకోవడం మరియు తద్వారా రక్షింపబడడం (రోమీయులకు 10:9).
అయినప్పటికీ, దేవుని ప్రేమ యొక్క అనుభవం రక్షింపబడడానికే పరిమితం కాదు. దేవుని ప్రేమలో ఇంకా చాలా కోణాలు మనకు అందుబాటులో ఉన్నాయి. రోమీయులకు 8:32లో బైబిలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడిస్తుంది: "తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?" (రోమీయులకు 8:32, KJV). అది చాలా అద్భుతంగా ఉంది!
దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనం పాపులమై ఉన్నప్పుడే మన పాపాల కోసం చనిపోవడానికి ఆయన తన కుమారుడిని విడిచిపెట్టాడు, ఇప్పుడు మనం ఆయన పిల్లలం కాబట్టి మనం తక్కువ ఏమీ ఆశించకూడదు. బైబిలు యొక్క మరొక అనువాదం ఈ విధంగా తెలియజేస్తుంది: "దేవుడు మన కోసం సమస్తము ఇయ్యడానికి వెనుక తీయక, మన పరిస్థితిని స్వీకరించి, తన సొంత కుమారుడిని పంపడం ద్వారా తనను తాను హీనంగా బహిర్గతం చేస్తే, ఆయన మన కోసం సంతోషంగా మరియు స్వతంత్రంగా చేయనిది ఏదైనా ఉందా?" (రోమీయులకు 8:32 MSB). మీరు నిజంగా దాని గురించి ఆలోచిస్తే, దేవుని ప్రేమ మన కోసం చేయలేనిది ఏమీ ఉండదు!
ఆయన ప్రేమను ఎలా పొందాలనేది మనం పరిగణించవలసిన విషయం. మనం ఆయనను అనుమతిస్తేనే మనకోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమే. యోహాను 1:12 మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
కాబట్టి నిరంతరం దేవుని ప్రేమలో మునిగిపోవడానికి మీ హృదయాన్ని తెరవండి. మీరు అలా చేసినప్పుడు మీరు ఆయన అద్భుతమైన ప్రేమ యొక్క వాస్తవాలను అనుభవిస్తారు. మీరు ఆయన వాక్యం, ప్రార్థన, ఆరాధన పాటలు, ఇతర క్రైస్తవులతో సహవాసం చేయడం మొదలైన వాటి ద్వారా ఆయనతో సహవాసం చేయడం ద్వారా ఆయన ప్రేమలో మునిగిపోతారు. ప్రతిక్షణం దేవుని ప్రేమను అనుభవించడానికి మీకై మీరు పట్టుదలగా ఉండటానికి నిర్ణయించుకోండి.

ప్రార్థన
ప్రియమైన పరలోకపు తండ్రీ, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి పరిస్థితిలో నీ ప్రేమను అనుభవించడానికి ఎల్లప్పుడూ పొందడానికి నాకు సహాయం చెయ్యి. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● క్రైస్తవులు దేవదూతలను ఆజ్ఞాపించవచ్చా?● ఇది సాధారణ అభివందనము కాదు
● కావలివారు (ద్వారపాలకులు)
● యేసు యొక్క క్రియలు మరియు గొప్ప క్రియలు చేయడం అంటే ఏమిటి?
● 21 రోజుల ఉపవాసం: #21 వ రోజు
● అద్భుతాలలో పని చేయుట: కీ#2
● యబ్బేజు ప్రార్థన
కమెంట్లు