అనుదిన మన్నా
దేవునికి దగ్గరవుట (దేవుని యొద్దకు వచ్చుట)
Sunday, 7th of May 2023
0
0
599
Categories :
Intimacy with God
దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. (యాకోబు 4:8)
ఇక్కడ మనకు అద్భుతమైన ఆహ్వానం మరియు అద్భుతమైన వాగ్దానం ఇవ్వబడింది.
1. ఆహ్వానం - దేవునికి దగ్గరవుట.
2. వాగ్దానం - మీరు దేవునికి దగ్గరైనప్పుడు, నేను మీ దగ్గరికి వస్తానని ఆయన వాగ్దానం చేసాడు.
హెబ్రీయులకు 9:1-9 దేవాలయంలో, ఒక తెర అతి పరిశుద్ధ ప్రదేశాన్ని వేరు చేసిందని చెబుతుంది. మానవుడు పాపం ద్వారా దేవుని నుండి వేరు చేయబడాడని ఇది సూచిస్తుంది. ఇశ్రాయేలీయులందరి కోసం దేవుని సన్నిధిలోకి ప్రవేశించడానికి మరియు వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రధాన యాజకుడు మాత్రమే ప్రతి సంవత్సరం ఈ తెర దాటి వెళ్ళడానికి అనుమతించబడ్డాడు.
కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై తన రక్తాన్ని చిందించిన తర్వాత, ఏదో అద్భుతం జరిగింది; ఈ తెర పై నుండి క్రిందికి చిరిగిపోయింది. ఇది ఇప్పుడు యూదా మరియు అన్యజనులందరి కోసం, అతి పరిశుద్ధ స్థలములో, మార్గం తెరిచి ఉందని సూచిస్తుంది.
నా జీవితంలో ఒక సమయం ఉంది, దేవునికి దగ్గరవ్వాలనే భావన రహస్యంగా మరియు ప్రత్యేకమైనదిగా అనిపించింది, ఎంపిక చేసిన కొద్ది మందికి మాత్రమే కేటాయించబడింది.
అయితే, ప్రార్థన సమయంలో, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతూ, "నీవు నన్ను ఎంత తెలుసుకోవాలనుకుంటున్నాఓ అది నీ మీద ఆధారపడి ఉంటుంది." దేవునికి దగ్గరయ్యే సామర్థ్యం నిజానికి అందరికీ అందుబాటులో ఉంటుంది. దేవునితో వారి బంధాన్ని మరింతగా పెంచుకోవాలనే వ్యక్తి యొక్క స్వంత కోరిక మరియు సంకల్పంలో కీలకం ఉంది. దేవుని గురించి తెలుసుకోవాలని ఎంతగా తహతహలాడుతుందో, ఒక లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని అనుభవించడానికి మరింత దగ్గర అవుతాడు.
మీరు దేవుని నుండి ఎంత దూరం వెళ్లాలనుకుంటున్నారు?
47వ అధ్యాయంలోని యెహెజ్కేలు ప్రవక్త వలె (దయచేసి మొత్తం అధ్యాయాన్ని చదవండి)
మీరు దేవునిలోకి ఎంత లోతుగా వెళ్లాలనుకుంటున్నారు, చీలమండల లోతు, మోకాళ్ల లోతు, నడుము లోతు లేదా పరిశుద్దాత్మ మిమ్మల్ని పట్టుకునే ప్రదేశానికి? ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభువు మీతో ఇలా అంటున్నాడు, మీరు నాకు ఎంత సన్నిహితంగా ఉంటారో, నేను అంత మీ దగ్గరికి వస్తాను.
ఈ లోక యొక్క రాజు మరియు సృష్టికర్త మీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు! అయినప్పటికీ, ఆయన మీపై తనను తాను బలవంతం చేయడు. ఆయన మీకే ఆ ఎంపికను వదిలివేస్తాడు.
మీరు రాజసము మీ వద్దకు రావాలని చెప్పరు; మీరు అతని వద్దకు వెళుతారు. మంచి శుభవార్త ఏమిటంటే, 2000 సంవత్సరాల క్రితం, ఈ దేవుడు ఈ భూమిపైకి వచ్చి, పాపరహిత జీవితాన్ని గడిపాడు, తన రక్తాన్ని చిందించాడు, సిలువపై మరణించాడు మరియు తిరిగి లేచాడు. ఈరోజు మనం ఆయన దగ్గరకు వెళ్తాము. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను అంటున్నావు. నేను నీకు లోబడి యుంటాను."
తప్పిపోయిన కుమారుడు ఏమి చెప్పాడో గమనించండి:
నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి--తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇక మీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. (లూకా 15:18-20)
అనుదినము ఆయనకు ఎలా దగ్గరవ్వాలి
దేవునికి దగ్గరవ్వడం అంటే ఆయనతో సమయం గడపడం, ఆయనను ఆరాధించడం, ప్రార్థించడం మరియు ఆయనతో మాట్లాడడం మరియు మన జీవితంలోని ప్రతి విషయములోకి ఆయనను ఆహ్వానించడం. దీన్ని చేయడానికి ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించండి. ఆయన మీ ద్వారా ఏమి చేస్తాడో మీరు ఆశ్చర్యపోతారు.
ప్రార్థన
1. మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు, మనము 2023 ఉపవాసం (మంగళ/గురు/శని) చేస్తున్నాము. ఈ ఉపవాసం ఐదు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది.
2. ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
3. అలాగే, మీరు ఉపవాసం లేని దినాలలో ఈ ప్రార్థన అంశాలను ఉపయోగించండి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, "నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క వేరు చేయబడును" అని నీ వాక్యము చెప్పుచున్నది. నీతో నా నడకలో ఎదగకుండా నన్ను అడ్డుకునే ప్రతిదానిని నిర్మూలించు. నేను నా ప్రార్థన సమయాన్ని యేసు రక్తంతో కప్పుతున్నాను.
తండ్రీ, ప్రతిరోజూ ప్రార్థించుటకు నాకు కృపను దయచేయి. యేసు నామములో నీవు వాగ్దానము చేసినట్లు నేను నీకు సమీపించినప్పుడు, నా యొద్దకు రా ఆమేన్.
కుటుంబ రక్షణ
పరిశుద్దాత్మ, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఎలా పరిచర్య చేయాలో ప్రత్యేకంగా నాకు చూపించు. ప్రభువా నాకు అధికారం దయచేయి. సరైన సమయంలో నీ గురించి పంచుకోవడానికి అవకాశాలను బహిర్గతం చేయి. యేసు నామములో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
నేను విత్తిన ప్రతి విత్తనమును యెహోవా జ్ఞాపకముంచుకొనును గాక. కాబట్టి, నా జీవితంలో అసాధ్యమైన ప్రతి పరిస్థితిని యెహోవా తిప్పిస్తాడు. యేసు నామములో.
KSM చర్చి పెరుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించుదురు గాక. నీ పేరు మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.
దేశం
తండ్రీ, యేసు నామములో, భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలోని ప్రజల హృదయాలు నీ వైపు మళ్లాలని నేను ప్రార్థిస్తున్నాను. వారు తమ పాపాలకు పశ్చాత్తాపపడి యేసును తమ ప్రభువు మరియు రక్షకునిగా ఒప్పుకుందురు.
Join our WhatsApp Channel
Most Read
● ప్రజలు సాకులు చెప్పే కారణాలు – భాగం 2● మీ ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి క్రియాత్మక పద్ధతులు
● మొలకెత్తిన కఱ్ఱ
● మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి
● మీ భవిష్యత్తుకు పేరు పెట్టడానికి మీ గతాన్ని అనుమతించవద్దు
● 06 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● దైవ రహస్యాల ఆవిష్కరణ
కమెంట్లు