అనుదిన మన్నా
దేవునికి మీ కొరకు ఒక ప్రణాళిక ఉంది
Tuesday, 30th of May 2023
0
0
804
Categories :
God's Plan
నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. (యెషయా: 54:17)
దేవుడు స్త్రీ పురుషులను సృష్టించినప్పుడు, ఆయన మనలను తన స్వరూపంలో మరియు పోలికలో సృష్టించాడు.
సర్వశక్తిమంతుడైన దేవుని జీవితం మీ ద్వారా ప్రవహిస్తోంది. అలాగే, మీరు ఒక ఉద్దేశ్యంతో సృష్టించబడ్డారు.
అయితే, చాలా మంది "నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సమృద్ధి లేదు, శ్రమలు మరియు బాధలు మాత్రమే" అని అంటారు. ఎవరో ఒకసారి ఇలా అన్నారు. "దేవుడు పరిశుద్ధులను ఫలభరితం చేయడానికి అధికమైన పరీక్షలను ఉపయోగిస్తాడు, తద్వారా ఆయన వారిని ఉన్నతమైన స్థలలో ఉంచగలడు!" హల్లెలూయా!
ఎస్తేరు ఒక సాధారణ అమ్మాయి. ఆమెకు తండ్రి లేదా తల్లి లేరు. ఆమె ఎదుర్కొన్న పరీక్షలు మరియు హింసలను ఊహించండి. అది నాకు ఎలా తెలుసు? సరే, ఏ దేశానికైనా రాణి అవ్వడం అనేది మాములు విషయం కాదు. ఎస్తేరు రాణి అయిన తర్వాత కూడా హామాను అనే దుష్టుడు యూదులందరినీ చంపేస్తానని బెదిరించాడు. యూదులు ఆమె ప్రజలు. మూడు పగళ్లు, మూడు రాత్రులు ఆహారం, నీరు లేకుండా ఉపవాసం చేసింది.‘నేను చస్తే చచ్చిపోతాను." యూదుల రక్షణలో ఎస్తేరు కీలక పాత్ర పోషించింది.
పరీక్షలు మరియు కష్టాలు మీకు రావచ్చు కానీ నిరుత్సాహపడకండి. "చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నా యెదుట నున్నవి" అని ఆయన వాగ్దానం చేశాడు. (యెషయా 49:16)
ప్రభువైన యేసయ్య ఇలా ప్రకటించాడు, "నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని." (యోహాను 6:38). యేసుక్రీస్తు తన తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు. దేవునిలో మిమ్మల్ని మీరు కనుగొనడం ద్వారా మాత్రమే మీ జీవితంలో మీరు నెరవేర్చబడగల ఏకైక మార్గం.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
నా భవిష్యత్తు ఇప్పటికే క్రీస్తు యేసులో స్థాపించబడింది. నా పట్ల ఆయన ఆలోచనలు సమాధాన ఆలోచనలు మరియు నాకు హాని కలిగించవు, నాకు ప్రశస్తమైన భవిష్యత్తును ఇవ్వాలనే ఆలోచనలు. నేను బ్రదుకు దినములన్నియు కృపా క్షేమములే నా వెంట వచ్చును ఎందుకంటే నాకు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంది. ఏమి జరిగినా నేను వెనకడుగు వేయను కానీ నేను దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాను
కుటుంబ రక్షణ
నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు నేను సిగ్గుపడను: మరియు కరువు దినములలో, నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా సంతృప్తి పొందుదుము. (కీర్తనలు 37:18-19)
ఆర్థిక అభివృద్ధి
నా దేవుడు క్రీస్తుయేసు ద్వారా మహిమలో తన ఐశ్వర్యాన్ని బట్టి నా అవసరాలన్నీ తీర్చును. (ఫిలిప్పీయులకు 4:19) నాకు మరియు నా కుటుంబ సభ్యులకు మంచికి లోటు ఉండదు. యేసు నామములో.
KSM సంఘము
తండ్రీ, మమ్ములను కాపాడుటకు మరియు మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దేవదూతలకు మాపై ఆజ్ఞాపించాలని నీ వాక్యము చెప్పుచున్నది. యేసు నామములో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న నీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. వారికి వ్యతిరేకంగా చీకటి యొక్క ప్రతి పనిని నాశనం చేయి.
దేశం
తండ్రీ, నీ శాంతి మరియు నీతి మా దేశాన్ని నింపును గాక. మన దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క అన్ని శక్తులను నాశనం చేయును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో వ్యాప్తి చెందును గాక. యేసు నామములో.
Join our WhatsApp Channel
Most Read
● దూరం నుండి వెంబడించుట● ప్రజలు సాకులు చెప్పే కారణాలు – భాగం 2
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 3
● ప్రేమ - విజయానికి నాంది - 2
● సరి చేయండి
● మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలి - 2
● ప్రభువుతో నడవడం
కమెంట్లు