అనుదిన మన్నా
మీరు ఆధ్యాత్మికంగా యుక్తముగా ఉన్నారా?
Thursday, 8th of June 2023
0
0
577
Categories :
Spiritual Fitness
మనలో చాలా మంది మన శారీరక ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు మరియు అది మంచిది. మనం విటమిన్లు తీసుకుంటాము, ఆకు కూరలు తింటాము, నీరు త్రాగుతాము, మెట్లు ఎక్కుతాము. మనము అంత మంచిది కాకపోయినా, మంచిగా ఉండటానికి మనము దారిని మరియు మార్గాలను కనుగొంటాము. కానీ మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఎంత తరచుగా పరిగణిస్తాము?
మన ఆధ్యాత్మిక దృఢత్వం?
వ్యక్తిగత ఆధ్యాత్మిక తనిఖీ చేయడం ముఖ్యం కాబట్టి మనం ఇలా చేయకూడదు:
1. ప్రభువులో బలాన్ని పోగొట్టుకోకండి
2. ప్రపంచంతో ఏకం కావడానికి మీకై మీరు వృథా కాకండి
3. అనాలోచిత భారమును లేదా బరువును మోయకండి; మనము మోయడానికి ఉద్దేశించబడలేదు
4. మన హృదయాలను (ఆత్మలు) అనారోగ్యకరమైనవిగా గుర్తించకండి
దైవభక్తి (భక్తి) పట్ల శిక్షణ పొందండి [మీకు మీరు ఆధ్యాత్మికంగా సాధకము చేసికొనుము]. (1 తిమోతి 4:7)
ఆధ్యాత్మికంగా సాధకముగా ఉండాలంటే ఆధ్యాత్మిక శిక్షణ అవసరం. ఆధ్యాత్మిక విషయాల్లో శిక్షణ పొందాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది.
ఇప్పుడు, ఘటన యొక్క దినాన కాకుండా ఘటనకు ముందు శిక్షణ చాలా జరుగుతుంది. ఆ ఉదయాన్నే గొల్యాతును ఓడించడానికి దావీదు శిక్షణ ప్రారంభించలేదు. అనేకమంది క్రైస్తవులు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు శిక్షణ పొందుతున్నారు. ముందుగానే శిక్షణ పొందండి, తద్వారా విషయాలు మీ ముందు నిలబడితే, మీరు ఇప్పటికే ఆ విషయాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనది మరియు నేను ఆత్మ ద్వారా మీకు బోధిస్తున్న వాటిని మీరు విస్మరించలేరు.
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే (కొద్దిగా ఉపయోగపడుతుంది) ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి (ఆధ్యాత్మిక శిక్షణ) జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. (1 తిమోతి 4:8)
ఇప్పుడు మీకై మీరు ఎలా శిక్షణ పొందాలో పద్దతుల ద్వారా తెలియజేస్తాను
1. ఆధ్యాత్మిక ఆరోగ్యం సరైన ఆధ్యాత్మిక ఆహారంతో మొదలవుతుంది
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగుతు ఉండండి, (1 పేతురు 2:2)
సరిగ్గా తినడానికి, మీరు దేవుని వాక్యాన్ని క్రమంగా చదవాలి. అలాగే, మీరు ఆధ్యాత్మికంగా మంచి ఆహారంతో మిమ్మల్ని పోషించుకోవడానికి, సువార్త-కేంద్రీకృత సంఘానికి హాజరు కావాలి.
ఈ రోజుల్లో చాలా మంది సువార్త-కేంద్రీకృత సంఘానికి హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించడం లేదని నేను చూస్తున్నాను. వారు తమకు నచ్చినప్పుడు లేదా సమయం అనుమతించినప్పుడు వారు వెళతారు. అలాంటి వారు దేవుని విషయాలలో ఎక్కువ దూరం వెళ్లరు మరియు తరచుగా ఆధ్యాత్మికంగా చల్లగా ఉంటారు. మీరు ఆధ్యాత్మికంగా సాధకముగా ఉండాలనుకుంటే అలా ఉండకండి.
2. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి స్థిరమైన క్రమశిక్షణ అవసరం
ఎవరో ఇలా సెలవిచ్చారు, "శిష్యుడిగా ఉండటానికి క్రమశిక్షణ అవసరం" అని మీ స్నేహితుడు జ్యుసి బర్గర్ తింటున్నప్పుడు ఎవరూ సలాడ్ తినరు - మీకు నచ్చదు.
మీరు ఏమి నేర్చుకున్నవి మరియు అంగీకరించితిరో మరియు విన్నవి మరియు నాలో చూసిన వాటిని ఆచరించండి మరియు దాని ఆధారంగా మీ జీవన విధానాన్ని రూపొందించుకోండి మరియు అప్పుడు సమాధాన కర్తయగు (అవాంఛనీయమైన, కలవరపడని సమృద్ధి) దేవుడు మీకు తోడైయుండును. (ఫిలిప్పీయులకు 4:9)
అభ్యసించుడి
1. మీరు ఏమి నేర్చుకున్నవి
2. అంగీకరించితిరో (ప్రత్యక్షత)
3. విన్నవి
4. మరియు నాలో చూసిన వాటిని
5. దానిపై మీ జీవన విధానాన్ని రూపొందించుకోండి మరియు అప్పుడు సమాధాన కర్తయగు (అవాంఛనీయమైన, కలవరపడని సమృద్ధి) దేవుడు మీకు తోడైయుండును
మీరు ఆధ్యాత్మికంగా పదునుగా ఉండాలంటే ఈ ఐదు విషయాలను ఆచరణలో పెట్టాలి
3.ఆధ్యాత్మిక ట్రెడ్‌మిల్
"ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, (యూదా 20)
మీకు వీలైనంత తరచుగా మరియు మీకు వీలైన చోట భాషలలో మాట్లాడండి. మీ ఆత్మీయ మనిషి బలము మరియు పదునవుతాడు.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
నేను కర్తను లేదా చేయువాడను మరియు వినేవాని మరచిపోయేవాడిని కాదు. నేను ఊహించని సానుకూల ఫలితాలను చూస్తాను. యేసు నామములో.
కుటుంబ రక్షణ
తండ్రీ, రక్షణ యొక్క కృపకై కోసం నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను; తండ్రీ, నీ కుమారుడైన యేసును మా పాపాల కోసం చనిపోవడానికి పంపినందుకు వందనాలు. తండ్రీ, యేసు నామమున, (ప్రియమైన వ్యక్తి పేరును పేర్కొనండి) నీ జ్ఞానంలో ప్రత్యక్షతను దయచేయి. నిన్ను ప్రభువు మరియు రక్షకునిగా తెలుసుకునేందుకు వారి కళ్ళు తెరువు.
ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో, నా పిలుపును నెరవేర్చడానికి ఆర్థిక అభివృద్ధి కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. నీవు గొప్ప పునరుద్ధరణకర్తవి.
KSM సంఘ ఎదుగుదల
తండ్రీ, KSM యొక్క సమస్త పాస్టర్‌లు, గ్రూప్ సూపర్‌వైజర్లు మరియు J-12 లీడర్‌లు నీ వాక్యంలో మరియు ప్రార్థనలో వృద్ధి చెందేలా చేయి. అలాగే, KSMతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి నీ వాక్యం మరియు ప్రార్థనలో వృద్ధి చెందేలా చేయి. యేసు నామములో.
దేశం
తండ్రీ, యేసు నామములో, మా దేశ సరిహద్దులలో శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. మా దేశంలోని ప్రతి రాష్ట్రంలో శాంతి మరియు గొప్ప అభివృద్ధి కోసం మేము ప్రార్థిస్తున్నాము. మా దేశంలో నీ సువార్తకు ఆటంకం కలిగించే ప్రతి శక్తిని నాశనం చేయి. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● విశ్వాసపు జీవితం● 21 రోజుల ఉపవాసం: 16# వ రోజు
● పవిత్రునిగా చేసే నూనె
● కావలివారు (ద్వారపాలకులు)
● 27 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 34 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దానియేలు ఉపవాసం సమయంలో ప్రార్థన
కమెంట్లు