english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. వ్యర్థమైన మాటలు సంబంధాలను నాశనం చేస్తుంది
అనుదిన మన్నా

వ్యర్థమైన మాటలు సంబంధాలను నాశనం చేస్తుంది

Wednesday, 25th of September 2024
0 0 315
Categories : గుసగుసలాడుట (Gossip)
మూర్ఖుడు కలహము పుట్టించును 
కొండెగాడు (వ్యర్థముగా మాటలాడువాడు) మంచి స్నేహ బంధమును నాశనం చేయును. (సామెతలు 16:28 టిఎల్‌బి)

వ్యర్థమైన మాటలు అనేది మనం కొత్త సంబంధాలను ఏర్పరచుకునేటప్పుడు చూడవలసిన విషయం.

వ్యర్థమైన మాటలు సంబంధాలకు ఎందుకు హానికరం?
లేఖనము చెప్పినట్లుగా, వ్యర్థమైన మాటలు మంచి స్నేహితులను వేరు చేస్తుంది. వ్యర్థమైన మాటలు సంబంధాలను విభజిస్తుంది, నమ్మకాన్ని నాశనం చేస్తుంది మరియు పదాలు మాట్లాడిన చాలా కాలం తర్వాత వ్యర్థమైన మాటలకు సంబంధించిన నొప్పి అనుభూతి చెందుతుంది.

గుర్తుంచుకోండి, ఎవరైనా మీతో  వేరే వాళ్ళ గురించి వ్యర్థమైన మాటలు చెప్పినప్పుడు వారు మీ గురించి కూడా వ్యర్థమైన మాటలు చెప్తారని గుర్తుంచుకోండి, మరియు వ్యర్థమైన మాటలు స్నేహాన్ని వేరు చేస్తుంది (సామెతలు 16:28). మన సంబంధాలను గౌరవిద్దాం మరియు వ్యర్థమైన మాటలు యొక్క వ్యాధి ఉచ్చులో పడకుండా చూసుకుందాం.

వాస్తవానికి, కొన్నిసార్లు ప్రజలు వ్యర్థమైన మాటలు చేప్తారు మరియు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో తప్పును కనుగొనడానికి ప్రయత్నిస్తారు, తద్వారా వారు మీ అంతర్గత వ్యవహారంలోకి వస్తారు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులను అణిచివేస్తే మీరు సహించరని ప్రజలకు తెలియజేయడం ద్వారా సరిహద్దును సెట్ చేయండి.

ఇతర సహోద్యోగులు లేదా స్నేహితుల గురించి వ్యర్థమైన మాటలు చెప్పడం ఎవరితోనైనా సంబంధాన్ని పెంచుకోవడానికి సులభమైన మార్గంగా అనిపించవచ్చు; అయితే, బలమైన, నమ్మకమైన సంబంధాలను పెంచుకోవడానికి ఇది సరైన మార్గం కాదు. వాస్తవానికి, ఎవరైనా చుట్టూ తిరిగే అన్ని పసురుగల వ్యర్థమైన మాటల్లలోకి రావడాన్ని ఇష్టపడతారని మీకు తెలిస్తే, అలాంటి వ్యక్తిని నమ్మడం పట్ల జాగ్రత్తగా ఉండండి.

మీరు క్రొత్తవారిని కలిసినప్పుడు మరియు వ్యర్థమైన మాటలు వచ్చినప్పుడు, సంభాషణను వేరే అంశానికి మళ్లించడానికి ప్రయత్నించండి. అది పని చేయకపోతే మరియు అది వస్తూ ఉంటే, మీరు మీ సరిహద్దులను స్పష్టంగా తెలియజేసే ప్రేమపూర్వక పద్ధతిలో నేరుగా అంశాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది.

వ్యర్థమైన మాటలు మీ కోసం దేవుని ప్రణాళికలో లేదు. ప్రతి ఒక్కరి లోపాలను అందరికీ ఎత్తి చూపడం ద్వారా ఒకరినొకరు తీర్పు తీర్చడానికి దేవుడు మనలను సృష్టించలేదు. ఒకరినొకరు ప్రేమించుకోవాలని, మనం కూడా చక్కగా పొందాలని కోరుకునే విధంగా ఇతరులతో చక్కగా వ్యవహరించాలని బైబిల్ పదేపదే ఆజ్ఞాపిస్తుంది. మాట్లాడే స్వేచ్ఛ అంటే మనకు విడదీయు నాలుక ఉండాలి అని కాదు.

ప్రియమైనవారులారా, పరిశుద్ధాత్మలో స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడపాలని దేవుడు మనలను పిలిచాడు. కానీ ఈ అద్భుతమైన స్వేచ్ఛను ఒకరిని క్రిందికి లాగే అవకాశంగా చూడవద్దు. స్వేచ్ఛ అంటే మనం ఒకరికొకరు సేవకులుగా మారి, మనం చేసే పనులన్నిటిలో ప్రేమను వ్యక్తపరిచే విధంగా మనం పూర్తిగా దాసులై ఉండాలి. (గలతీయులు 5:13 టిపిటి)
ప్రార్థన
యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. తండ్రీ, నన్ను వ్యర్థముగా మాట్లాడుట నుండి దూరంగా ఉంచు. యేసు నామంలో. ఆమెన్


Join our WhatsApp Channel


Most Read
● ప్రజలు సాకులు చెప్పే కారణాలు - పార్ట్ 1
● నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
● హామీ గల సంతృప్తి
● సరైన అన్వేషణను వెంబడించడం
● వివేకం పొందుట
● సహనాన్ని లేదా ఓర్పును హత్తుకోవడం
● మీ బాధలో దేవునికి లోబడియుండుట గురించి నేర్చుకోవడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్