అనుదిన మన్నా
ప్రభువులో మిమ్మల్ని మీరు ఎలా ప్రోత్సహించుకోవాలి (ధైర్యపరుచుకోవాలి)
Tuesday, 20th of June 2023
0
0
631
Categories :
భావోద్వేగాలు (Emotions)
1 సమూయేలు 30లో, సిక్లగునకు తిరిగి వచ్చిన తరువాత, దావీదు మరియు అతని జనులు అమాలేకీయులు దాడి చేశారని మరియు ఎవరినీ చంపకుండా తమ భార్యలను మరియు పిల్లలను బందీలుగా తీసుకుని వెళ్లారని తెలుసుకున్నారు.
దావీదు మరియు అతని జనులు విధ్వంసం చూసినప్పుడు మరియు వారి కుటుంబాలకు ఏమి జరిగిందో తెలుసుకున్నప్పుడు, వారు ఇకపై లేరని తలచుకొని ఏడ్చారు.
దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. (1 సమూయేలు 30:6)
గమనించండి, నిరుత్సాహం అతనిని బాదపెట్టడానికి దావీదు అనుమతించలేదు. బదులుగా, అతడు ప్రభువును బట్టి తనకు తాను ధైర్యము మరియు బలోపేతం చేసుకోవడానికి ఒక ఎంపిక చేసుకున్నాడు. మీకు మద్దతు ఇవ్వడానికి, మీ చేయి పట్టుకోవడానికి ఎవరూ లేని సందర్భాలు ఉంటాయి; అలాంటి సమయాల్లో చాలా మంది ఎప్పటికీ పైకి లేవకుండా పడిపోయారు. ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదని నేను ప్రవచిస్తున్నాను. లెమ్ము! ప్రభువులో మిమ్మల్ని మీరు ధైర్యపరచుకొనుడి
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దావీదు ప్రభువులో తనకు తాను బలపరచుకున్నప్పుడు, అతని జనులు కూడా అతని వద్దకు తిరిగి వచ్చారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రభువులో మికై మీరు ధైర్యపరచుకోనినప్పుడు, ఆ ధైర్యము అంటువ్యాధిగా మారుతుంది. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.
దావీదు తనకు తాను ప్రభువును బట్టి ఎలా ధైర్యపరచుకున్నాడో బైబిల్లో స్పష్టంగా లేదు. బహుశా, అతడు తన వీణను తీసుకొని, ఒంటరి ప్రదేశానికి వెళ్లి, దేవుని స్తుతి ఆరాధన పాటలు పాడటం ప్రారంభించాడేమె. దావీదుకు పాడాలని అనిపించకపోవచ్చు, కానీ అతడు దానిని ఎలాగో అలా చేసాడు.
మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను పెంచడానికి నిరాకరించండి. దానికి బదులుగా, ప్రభువును ఘనపరచండి. మీ హెడ్‌ఫోన్‌లను ధరించుకొని, కొంత ఆరాధన పాటలు వినండి మరియు ఆయన నామాన్ని ఘనపరచు. లేదంటే మీరు మీ బైబిల్ను తెరిచి, గ్రంథంలోని ప్రోత్సాహకరమైన భాగాన్ని బిగ్గరగా చదవవచ్చు. మీ ఆత్మీయ మనిషి వాక్యం పలికే మీ స్వరాన్ని ఎంచుకుంటాడు మరియు మీ ఆత్మీయ మనిషిలో విశ్వాసం పుడుతుంది. (రోమీయులకు 10:17)
దేవుని యొక్క గొప్ప దాసుడు ఒకసారి ఇలా అన్నాడు, "మీరు దేవుని గొప్పగా చేసినప్పుడు, మీ కష్టాలను చిన్నదిగా చేస్తారు." శక్తివంతముగా, ఉంది కాదా? ఈ విధంగా మిమ్మల్ని మీరు ప్రభువును బట్టి ధైర్యపరుచకోవచ్చు. విజయం త్వరలో మీ సొంతమవుతుంది! మీ సాక్ష్యం వినడానికి నేను ఎదురు చూస్తున్నాను.

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
దయగల తండ్రీ, నీవే నా నిరీక్షణ మరియు బలం అని నేను నీకు వందనాలు చెల్లిస్తుతున్నాను. నీవు నన్ను ఎన్నటికీ విఫలం చేయవని తెలుసుకొని నేను నీ మీదే ఆధారపడుతున్నాను. యేసు నామంలో ఆమేన్.
కుటుంబ రక్షణ
నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు నేను సిగ్గుపడను: మరియు కరువు దినములలో, నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా తృప్తిపొందుదుము. (కీర్తనలు 37:18-19)
ఆర్థిక అభివృద్ధి
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులు 4:19) నాకు మరియు నా కుటుంబ సభ్యులకు మంచికి లోటు ఉండదు. యేసు నామములో.
KSM సంఘము
తండ్రీ, మమ్ములను కాపాడుటకు మరియు మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దేవదూతలకు మాపై ఆజ్ఞాపించాలని నీ వాక్యము చెప్పుచున్నది. యేసు నామంలో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న మీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. వారికి వ్యతిరేకంగా చీకటి యొక్క ప్రతి పనిని నాశనం చేయి.
దేశం
తండ్రీ, నీ సమాధానము మరియు నీతితో మా దేశము నింపబడును గాక. మా దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క అన్ని శక్తులను నాశనం అవును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో వ్యాప్తి చెందును గాక. యేసు నామములో.
Join our WhatsApp Channel
Most Read
● శీర్షిక: కొంత మట్టుకు రాజి పడటం● యేసయ్య ఇప్పుడు పరలోకములో ఏమి చేస్తున్నాడు?
● 25 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● జయించే విశ్వాసం
● దేవుని మహిమపరచండి మరియు మీ విశ్వాసాన్ని ఉత్తేజపరచండి
● మరచిపోవడం యొక్క ప్రమాదాలు
● ప్రార్థన యొక్క పరిమళము
కమెంట్లు